Bigg Boss Telugu Latest Promo : తనూజ అరవడం ఎక్కువ ఆట తక్కువ.. డేంజర్​ జోన్​లో బిగ్​బాస్ కంటెస్టెంట్లు

1 month ago 3
ARTICLE AD

Bigg Boss Telugu 9 Day 31 Latest Promo : బిగ్​బాస్ సీజన్ 9 డే 31 ప్రోమో తాజాగా విడుదల చేసింది స్టార్ మా. నిన్న టాస్క్​లో స్ట్రాటజీలు కాకుండా ఫౌల్ గేమ్స్ ఆడుతున్నారంటూ.. బిగ్​బాస్ వార్నింగ్ ఇవ్వడంతో అందరూ షాకై పోయారు. డేంజర్​ జోన్​లో ఉన్నా మీరు ఇలాంటి ఫౌల్ గేమ్స్ ఆడుతున్నారంటూ బిగ్​బాస్ సీరియస్ అయి.. వారి పాయింట్స్ తగ్గించేశాడు. దీంతో ప్లేయర్స్​దే తప్పు అంటూ సంచాలకులు.. సంచాలకులే సరిగ్గా చెప్పలేదంటూ ప్లేయర్స్ తిట్టుకున్నారు. మళ్లీ ఇచ్చే గేమ్స్​పై ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో.. తాజా ప్రోమో చూస్తే తెలుస్తుంది.

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో..

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమోలో కొత్త టాస్క్ ఇచ్చాడు. డేంజర్ జోన్​లో ఉన్న సభ్యులకు నేను ఇస్తోన్న మరో టాస్క్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్. అంటే ఓ బల్లకి నాలుగు వైపులా తాడు కట్టి.. రెండు ఒకరు రెండు ఒకరు పట్టుకుని.. జట్టుగా ఉన్న సభ్యులు బ్యాలెన్స్ చేయాలి. అలా కాసేపు ఉన్న తర్వాత దానిపై బరువు పెడతారు. అప్పుడు కూడా చేతులు స్ట్రైయిట్​గా ఉంచి బరువును బ్యాలెన్స్ చేయాలని బిగ్​బాస్ సూచించారు. ఇప్పటికే టీమ్స్​గా విడిపోయిన వారు.. బ్యాలెన్స్​లు చేస్తూ కనిపించారు. ఇమ్మాన్యూయేల్, రాము ఇద్దరూ సంచాలకులుగా చేస్తున్నారు.

అబ్బాయిలు లేరు కష్టపడుతున్నాము..

దీనిలో భాగంగా అన్ని జంటలకు ఒకసారి బరువు పెట్టాలని సూచించాడు బిగ్​బాస్. తర్వాత ఒక జంటకు ఓసారి అంటూ చెప్పాడు. అప్పుడు రాము బరువును భరణి, దివ్యల దగ్గరికి తీసుకెళ్లినట్లు ప్రోమోలో చూపించారు. టాస్క్ ముగిసేవరకు ఏ జంట అయితే ప్లాట్​ఫామ్​కు బల్ల టచ్ అవ్వకుండా ఉంచుతారో.. వారు గెలిచినట్లు అని బిగ్​బాస్ చెప్పాడు. ఇమ్మూ బరువును సంజన, ఫ్లోరా దగ్గర వేస్తున్నప్పుడు.. సంజన ఇక్కడ అబ్బాయిలు కూడా లేరు చాలా కష్టపడుతున్నాము ప్లీజ్ అని చెప్పింది. అయినా ఇమ్మూ బల్లపై వెయిట్ వేశాడు.

గేమ్ ఆడదు.. కానీ అరుస్తుంది..

తర్వాత ఒక జంటకి రెండు పెట్టండి అంటూ చెప్పాడు. ప్రోమోలో రాము శ్రీజ, సుమన్ శెట్టి బల్లపై బరువు వేస్తున్నప్పుడు శ్రీజ సరిగ్గా వేయమని చెప్తే.. మీరు సరిగ్గా పట్టుకోలేదని చెప్పాడు రామ్. ఆ టైమ్​లో బ్యాలెన్స్ తప్పిపోవడంతో సుమన్ శెట్టి, శ్రీజ అవుట్​ ఆఫ్​ ద గేమ్ అంటూ రాము డిక్లేర్ చేశాడు. భరణి, దివ్యవి కూడా కిందపడ్డాయి. సంజన, ఫ్లోరా కూడా గేమ్ నుంచి వచ్చేసినట్లు ప్రోమోలో తెలుస్తుంది. అయితే బ్యాలెన్స్ చేసుకునే సమయంలో తనూజ, కళ్యాణ్​వి కూడా కింద పడితే.. తప్పంతా కళ్యాణ్​పై వేసి తనూజ అరిచేసింది. దీంతో ప్రోమో ముగిసింది.

ముందు నుంచి టాప్​లోనే ఉన్న పవన్, రీతూ ఈ గేమ్​ని కూడా గెలిచినట్లు తెలుస్తుంది. అలాగే ఈ ప్రోమో కింద తనూజ ఆట లేదు కానీ అరిచేస్తుందంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తోన్న సందర్భంగా డేంజర్​ జోన్ నుంచి తప్పించుకోవాలని బిగ్​బాస్ ఈ టాస్క్లు పెడుతున్నాడు. మరి ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో.. ఎవరు బిగ్​బాస్ హోజ్​లో ఉంటారో వేచి చూడాల్సిందే.

Read Entire Article