Bigg Boss Telugu Demon Pavan Promo : కామనర్​ టూ టాప్ 5.. ఎదురులేని యోధుడివంటూ డిమోన్ పవన్​ని పొగిడేసిన బిగ్​బాస్

3 months ago 10
ARTICLE AD

Bigg Boss 9 Telugu Demon Pavan AV Promo : బిగ్​బాస్​ టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరైన డిమోన్ పవన్ స్పెషల్ ప్రోమో ఈరోజు ఎపిసోడ్​లో రానుంది. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది. కామనర్​గా వచ్చి.. టాప్​ 5గా నిలిచిన తీరును.. బిగ్​బాస్ మెచ్చుకున్నాడు. పవన్​కి భారీ రేంజ్​లో ఎలివేషన్ ఇచ్చాడు బిగ్​బాస్. ప్రోమోలో అదిరే సాంగ్స్​ పెట్టి గట్టిగా ప్లాన్ చేసి రిలీజ్ చేశారు. బిగ్​బాస్ పవన్​కి ఇచ్చిన హైప్ ఏంటో.. ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.

బిగ్​బాస్​ లేటెస్ట్ ప్రోమో..

బిగ్​బాస్ పవన్​కి ఇచ్చిన ఎలివేషన్.. పవన్ కామనర్​గా అడుగు పెట్టి.. మీరు ఈ బిగ్​బాస్​ రణరంగంలో కాంకరర్​గా మారిన తీరు.. మీ ప్రత్యర్థుల వెన్నులో ఒణుకు పుట్టించింది. మీరు ఎవరి వైపు ఉంటే.. వారికి కొండంత బలం. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం. మీకు ఏ గెలుపు సులువుగా లభించిలేదు. మీరు చెమటోడ్చి.. చివరి వరకు పోరాడి.. గెలిచారు. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ.. టఫ్ఫెస్ట్ కాంపిటేటర్​గా, తల్లి ఆశీస్సులతో.. ఎదురులేని యోధుడిగా ఇప్పుడు టాప్​ 5లో నిలబడ్డారు అంటూ బిగ్​బాస్ చెప్పగా.. లవ్​ యూ బిగ్​బాస్ అంటూ పవన్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో ప్రోమో ముగిసింది. పూర్తి ఏవీ కోసం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

కామనర్ టూ టాప్ 5

కామనర్​గా అగ్నీపరిక్షకు వచ్చిన డిమోన్ పవన్.. అక్కడ గెలిచి.. బిగ్​బాస్​ హోజ్​లో కామనర్​గా అడుగుపెట్టాడు. మొదటి నుంచి టాస్క్​ల్లో తనదైన ప్రతిభను కనబరిచాడు. అంతేకాకుండా రీతూతో ఫ్రెండ్​షిప్ కూడా అతనికి బాగా హైప్ తీసుకొచ్చింది. ఈ బిగ్​బాస్​ హోజ్​లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీని ఎదుర్కొని టాప్​ 5 వరకు వచ్చాడు. రీతూ ఎలిమినేట్ అవ్వనంత వరకు.. డిమోన్ పవన్ కామెడీ ప్రజలకు తెలియలేదు. ఈ మధ్యకాలంలో అతని కామెడీని చాలామంది మెచ్చుకుంటున్నారు. చివరి వరకు గేమ్స్​ ఆడి గెలిచి.. బిగ్​బాస్​లో గేమ్స్ అంటే డిమోన్ పవన్​ అనిపించేలా మార్క్ వేశాడు. టాప్​ 5లో ఉన్న డిమోన్.. టాప్​ 3లో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Read Entire Article