Bigg Boss Telugu Day 92 Promo : ఆరు బాక్సులు.. సంజనకు సపోర్ట్ చేసిన ఇమ్మాన్యుయేల్, వద్దంటోన్న హోజ్​మేట్స్

2 hours ago 1
ARTICLE AD

Bigg Boss 9 Telugu Today Promo : బిగ్​బాస్ సీజన్ 9 తెలుగు తుది దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో సీజన్ ముగియనుండగా ఆరు బాక్స్​లు ఇచ్చి.. మీరు ఆడిన గేమ్​కి పాయింట్స్ అంటూ చిచ్చు పెట్టాడు. ఒక్కో బాక్స్​లో ఒక్కో అమోంట్ ఇచ్చి.. దానిని బాల్ పట్టుకున్నవారు తమకు నచ్చినవారికి ఇవ్వాలని.. దానిని ఇంటి సభ్యులు అంగీకరించాలంటూ ట్విస్ట్ పెట్టాడు. దీంతో నామినేషన్స్ హడావుడి లేకున్నా గొడవలు మాత్రం జరుగుతున్నాయి.

బిగ్​బాస్ ప్రోమో హైలెట్స్..

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమోలో బాల్ గేమ్ పెట్టాడు. బాల్ ఎవరైతే పట్టుకుంటారో వారు ఆరు బాక్సుల్లోని ఒక బాక్స్​ను తమకు నచ్చినవారికి ఇవ్వాలని ఆదేశించాడు. దానికి ఇంటి సభ్యులు అంగీకరించాలంటూ షరతు పెట్టాడు. ఇలా పెట్టిన గేమ్​లో ముందుగా డిమోన్ పవన్ బాల్ పట్టుకున్నట్లు చూపించారు. పవన్ ఒకరిని ఎంచుకుని వారికి లక్ష బాక్స్ ఇస్తున్నట్లు చూపించారు. అయితే దానిని ఇంటి సభ్యులు అంగీకరించనట్టుగా ప్రోమో ఉంది.

అందరికీ 2,50,000 బాక్స్ కావాలి. అందుకే ఎవరూ మిగిలినవాటిని తీసుకోవట్లేదంటూ సంజన ఇమ్మూతో చెప్తుండగా ప్రోమో ముగిసింది. అయితే ఈ గేమ్​లో కళ్యాణ్​కి ఎలాంటి బాక్స్ రాదని ముందే బిగ్​బాస్ చెప్పాడు. దాంతో తర్వాత ప్రోమోలో బాక్స్ పట్టుకున్న కళ్యాణ్.. 2,50,000 బాక్స్ ఇమ్మూకి ఇవ్వాలనుకుంటున్నానని.. తన రీజన్స్ చెప్పాడు. తనకే ఇచ్చినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. తర్వాత భరణి బాల్ పట్టుకున్నట్లు చూపించారు.

సంజన కోసం.. ఇమ్మూ స్టాండ్

సంజన కోసం ఇమ్మూ బాల్ పట్టుకుని.. 1,50,000 ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. కానీ ఇంటి సభ్యులు దానికి అంగీకరించట్లేదు. ఆమె ఫిజికల్ టాస్క్​లు ఆడకపోయినా.. మెంటల్​గా తన ఒక గేమర్.. తన ఆట నాకు నచ్చుతుందని చెప్పాడు కానీ.. ఎవరూ దానికి ఒప్పుకోలేదు. ఆమె కంటే మేము డిజర్వ్ అంటూ తమ పాయింట్స్ చెప్పారు. దీంతో ప్రోమో ముగిసింది. అయితే తనూజకు 2 లక్షలు ఇచ్చినట్లు లైవ్ చూస్తే తెలుస్తుంది. పూర్తి ఎపిసోడ్ కోసం ఈరోజు రాత్రి 10వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఈరోజు నుంచి బిగ్​బాస్ టైమ్ మారింది. పొదరిల్లు అనే సీరియల్ 9.30కి రానుంది. కాబట్టి దీని టైమింగ్స్ మార్చారు.

Read Entire Article