Bigg Boss Telugu Day 79 : సంజనకు ముద్దు పెట్టిన సుమన్ శెట్టి.. తనూజ, పవన్ జంట కూడా క్యూట్​గా ఉంది కదా

1 week ago 2
ARTICLE AD

Bigg Boss 9 Telugu Masthi Mode : బిగ్​బాస్​ ఇంట్లోకి కెప్టెన్సీ పోటీల్లో భాగంగా ఓల్డ్ కంటెస్టెంట్లను పంపిస్తున్నారు. దీనిలో భాగంగా వచ్చిన గౌతమ్ ఇంటి సభ్యులకు టాస్క్ ముందు కొన్ని ఫన్నీ టాస్క్​లు పెట్టాడు. దానికి సంబంధించిన ఎపిసోడ్ నిన్న విడుదలైంది. అయితే ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్​గా ఉంది. ఎందుకంటే ఏ క్షణంలో ఎవరు ఎలా మారుతారో అనేలా ఎపిసోడ్ సాగింది. అయితే ప్రధానంగా ఎపిసోడ్లో రెండు అంశాలు ఆడియన్స్ దృష్టిని ఆకర్షింటాయి. అవేంటంటే..

బిగ్​బాస్​ ఇంట్లోకి వచ్చిన గౌతమ్ కంటెస్టెంట్లతో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. లవ్, ఫ్లర్ట్ ఇలా ఫన్నీగా చేస్తూ ఉన్నారు. మొత్తం ఎపిసోడ్​లో ఇమ్మాన్యుయేల్ కామెడీ హైలెట్​గా ఉంది. అయితే ఫన్​, ఎంటర్​టైన్​మెంట్ పక్కన పెట్టేస్తే.. సుమన్ శెట్టి సంజనను కిస్ చేయడం చూసేందుకు ఫన్నీగానే ఉంది. అయితే అతను టాస్క్​లో భాగంగానే, ఆమె అనుమతితోనే చేతిపై కిస్ పెట్టాడు. అయితే దీనిపై ఇప్పుడు కాంట్రవర్సీ జరుగుతుంది.

సుమన్ శెట్టిపై నెగిటివిటీ పెరుగుతుందా?

సుమన్ శెట్టి.. ఫ్యామిలీ వీక్ తర్వాత వైఫ్ ఇచ్చిన ఇన్​పుట్స్​తో సంజనకు, తనూజకు దూరంగా ఉంటున్నారు. అదీ పక్కనపెడితే ఈవారం సంజనను నామినేట్ చేశాడు. అదీ కూడా సంజన సుమ్ము, సుమ్ము డార్లింగ్ అంటూ ఇరిటిట్ చేస్తుందని చెప్పాడు. తనకి ఆ విషయం నచ్చట్లేదని కనీసం ఆ విషయం సంజనకు చెప్పకుండా నామినేట్ చేశాడు. కట్ చేస్తే.. నామినేట్ చేసిన రెండో రోజు టాస్క్​లో భాగంగా ఫ్లర్ట్ చేసి.. చేతిని కిస్ చేశాడు. ఇది కరెక్ట్ కాదంటూ కాంట్రవర్సీ అవుతుంది. మరి దీనిపై నాగార్జున ఏమి జడ్జిమెంట్ ఇస్తారో శనివారం వరకు చూడాలి.

తనూజ, పవన్.. ఎంత బాగున్నారో..

ఈ ఎపిసోడ్​లో హైలెట్​ అయిన మరో అంశం తనూజ, పవన్ పెయిర్. నిజానికి వీరిద్దరి స్క్రీన్ ప్రెజన్స్ చాలా రిఫ్రెషింగ్​గా ఉంది. ఇప్పటివరకూ రీతూతో చూసిన పవన్​ని.. కళ్యాణ్​కి దగ్గరగా ఉన్న తనూజని ఇలా జంటగా చూస్తే బాగుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వీడియోలు కట్ చేసి వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే మ్యాన్ హ్యాండిలింగ్ అంటూ పవన్​పై తనూజ గొడవ పడటం.. ఇప్పుడేమో జంటగ కనిపించడం చూసి.. బిగ్​బాస్​లో తిమ్మిని బమ్మిని చేయడం అంటే ఇదేనేమో అంటున్నారు.

మొత్తం ఈ ఎపిసోడ్​లో ఇమ్మూ కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది. సెలబ్రెటీలతో కామెడీ చేయడం నుంచి.. దాదాపు అందరి ఫన్ టాస్క్​ల్లో ఇమ్మూ హైలెట్ ఆఫ్ ది ఎపిసోడ్​గా కనిపించాడు.

Read Entire Article