Bigg Boss 9 Kalyan Mother Promo : బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్ రోజు రోజుకి మరింత ఎమోషనల్‌గా సాగుతుంది. బిగ్‌బాస్ ఆడియన్స్ ఫ్యామిలీ వీక్‌లో ఎంతగానో ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. అదే కళ్యాణ్ ఫ్యామిలీ బిగ్‌బాస్ హోజ్‌లోకి రావడం. కళ్యాణ్ అమ్మ లక్ష్మీ ఇంట్లోకి వచ్చిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇది చూసిన ప్రతి ఒక్కరు బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే కళ్యాణ్ స్టోరీతో అంతగా అందరూ కనెక్ట్ అవుతున్నారు. అసలు ప్రేక్షకులు కళ్యాణ్ పడాలతో అంత బాండింగ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ప్రోమో హైలెట్స్ ఏంటి విషయాలు చూసేద్దాం.

బిగ్‌బాస్ లేటెస్ట్ ఎమోషనల్ ప్రోమో..

బిగ్‌బాస్ ఇంటికి కళ్యాణ్ పడాల అమ్మగారు ఎంట్రీ ఇచ్చారు. అమ్మ.. అమ్మ సాంగ్ ప్లే అవుతుండగా.. లక్ష్మీగారు ఇంట్లోకి అడుగు పెట్టడంతో ప్రోమో స్టార్ట్ అయింది. అమ్మని చూసిన ఆనందంలో కళ్యాణ్ ఏడ్చుకుంటూ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఇద్దరూ ఎమోషనల్ అయి.. ఓ చోట కూర్చొని.. మాట్లాడుకుంటుండగా.. వాళ్ల అమ్మగారు తిను శుభ్రంగా అంటే.. ఏమ్ బక్కగా అయిపోయానా అంటూ అడిగిన తీరు దాదాపు అందరికీ కనెక్ట్ అవుతుంది.

పిచ్చోడా.. కప్పు పట్టుకుని రారా..

బాగా తినరా పిచ్చోడా.. పిచ్చి.. పిచ్చి.. ఇంత పెట్టుకున్నావా అంటూ అమ్మ అడిగిన తీరు కూడా చాలా హార్ట్ ఫుల్‌గా ఉంటుంది. కప్పు పట్టుకుని కంప్లసరీగా రావాలి.. ప్రామిస్ అంటే ప్రామిస్ వేసి మరీ తీసుకొస్తా అని చెప్తాడు కళ్యాణ్. తర్వాత మొన్నటివరకు లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్.. లక్ష్మీ కొడుకు కళ్యాణ్.. కానీ ఇప్పటి నుంచి కళ్యాణ్ నాన్న లక్ష్మణ రావు.. కళ్యాణ్ అమ్మ లక్ష్మీ.. ప్రౌడ్ ఆఫ్ యూ పేరెంట్స్ అని చెప్పడం ప్రోమోకే హైలెట్‌గా నిలించింది. దీంతో ప్రోమో కూడా ముగిసింది.

కళ్యాణ్‌కి ఎందుకు కనెక్ట్ అవుతారంటే..

దాదాపు 17 ఏళ్లు పేరెంట్స్‌కి దూరంగా ఉన్నానంటూ కళ్యాణ్ వారం క్రితం చెప్పి ఎక్కి ఎక్కి ఏడ్చేశాడు. అందుకే అతని పేరెంట్స్ రియాక్షన్ కోసం చాలా మంది అభిమానులు వెయిట్ చేశారు. అంతేకాకుండా కామన్ మ్యాన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆర్మీలో చేస్తూ.. ఇప్పుడు నేషనల్ మీడియాలో ఈ పొజిషన్లో ఉన్నాడంటే మామూలు విషయం కాదంటూ కళ్యాణ్ అభిమానులు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. వీరి మధ్య ఏమి జరిగిందో.. తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.