Bigg Boss Telugu Day 65 Promo : పవన్​కి ఫేవర్ చేయాలనుకున్న రీతూ, ఇక మారదంటోన్న ఆడియన్స్.. నోరుజారిన సంజన!?

3 weeks ago 2
ARTICLE AD

Bigg Boss 9 Rithu vs Sanjana Promo : బిగ్​బాస్ సీజన్ 9 తెలుగు 10వ వారానికి గానూ నామినేషన్స్​లో ఉన్నవారు.. దానినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాలని.. టాస్క్ పెట్టాడు బిగ్​బాస్. రీతూ, కళ్యాణ్, దివ్యలను రాజా, రాణిలుగా చెప్పి.. మిగిలిన వారిని కమాండోలు, విలేజర్స్​గా మార్చాడు. అయితే ఇప్పుడు కమాండోలు తమ పనిని రిస్క్​లో పెట్టి టాస్క్​ ఆడాలని రీతూని సంచాలక్​గా పెట్టాడు. అయితే ఈ క్రమంలో రీతూ ఓ తప్పు చేసింది. సంజన కూడా రీతూతో గొడవలో మాట తూలింది. అవేంటో చూసేద్దాం.

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో

బిగ్​బాస్​లో రీతూ ఇన్నిరోజులుగా తెచ్చుకున్న మంచి పేరును ఒకటేసారి చెడగొట్టుకున్నట్లు అయింది. రీతూ, డిమోన్ గేమ్స్ బాగా ఆడతారని.. కలిసి ఉన్నా.. ఎవరు ఎన్ని చెప్పినా తమ రిలేషన్ వదులుకోలేదని ఆడియన్స్ బాగా ఇష్టపడ్డారు. అయితే ఈరోజు గేమ్​లో రీతూ చేసిన పనికి అది పోయిందంటూ లేటెస్ట్ ప్రోమో కింద కామెంట్లు చేస్తున్నారు. కమాండర్స్ మీలో ఒకరు తమ స్థానాన్ని రిస్క్​లో పెట్టుకుని.. విలేజర్స్​లో ఒకరిని ఎంచుకుని పోరాడాలని చెప్తాడు. అయితే ముందుగా కమాండర్స్​ గేమ్ ఆడాలని.. దానిలో ఓడిపోయినవారు విలేజర్స్​తో ఆడతారని చెప్పాడు. దీనికి సంచాలక్​గా రీతూని నియమించారు.

రెండుసార్లు అవుట్ అయిన పవన్

గేమ్​లో భాగంగా కమాండోలకు బ్యాక్ బ్యాగ్స్ ఇచ్చాడు బిగ్​బాస్. అక్కడే కొన్ని బాల్స్ కూడా ఇచ్చారు. దీనిలో కమాండోలు ఒకరి బ్యాగ్​లో ఒకరు ఈ బాల్స్ వేయాలని.. ఎవరి దాంట్లో ఎక్కువ బాల్స్ ఉంటే.. వారు ఓడిపోయినట్లని చెప్పాడు. గేమ్​లో డిమోన్ లైన్​నుంచి బయటకు వెళ్లిపోతే.. తనూజ అవుట్ అంటుంది. వాడు వెళ్లలేదు నువ్వు నెట్టావంటూ కవర్ చేసి గేమ్ ఆడేలా చేస్తుంది. తర్వాత కూడా బాల్స్ వేస్తూ పరిగెత్తుతూ పవన్ మళ్లీ బౌండరీ క్రాస్ చేస్తే ఇది ఫస్ట్ టైమ్ అందరూ ఆడండి అని చెప్తుంది. ఇలా రెండుసార్లు అవుట్ అయినా వెళ్లనివ్వలేదు.

సంజనతో గొడవ..

అయితే నిఖిల్​కి వార్నింగ్ ఇస్తూ రెండుసార్లు అవుట్ అయ్యావని గేమ్ నుంచి బయటకు వెళ్లిపోమ్మని చెప్తుంది. అయితే తనూజ వాడెందుకు వెళ్లాలి? అంటే రెండుసార్లు బయటకొచ్చాడు అని చెప్తుంది రీతూ. అలా అయితే డిమోన్ కూడా వెళ్లాడుగా అంటే.. లేదని చెప్పడంతో సరే నలుగురు ఆడండి అని చెప్తుంది. అలా ఎలా కుదురుతుంది? బయటకి పంపాలిగా అని సంజన చెప్తుంది. ముందు మీరు గేమ్ ఆడండి. ముచ్చట్లు చెప్తున్నారు అంటే.. నేను గేమ్ ఆడుతున్నాను అని నువ్వు ఎవరు నాకు చెప్పడానికి ఆఫ్​ట్రాల్ అంటుంది సంజన. రీతూ నేను ఆఫ్ట్రాల్ కాదు అంటూ సీరియస్ అవుతుంది. దీంతో ఈ ప్రోమో ముగిసింది.

Read Entire Article