Bigg Boss Telugu Day 61 Promo : గ్రడ్జ్ పెట్టుకున్న దివ్య, ఏడ్చేసిన తనూజ.. పాపం భరణి, ఎమోషనల్ ప్రోమో చూశారా?

4 weeks ago 2
ARTICLE AD

Bigg Boss 9 Thanuja VS Divya Task Promo : బిగ్​బాస్​లో కెప్టెన్సీ కోసం నాలుగు రోజుల నుంచి వరుసగా టాస్క్​లు జరుగుతున్నాయి. అందరూ ఎఫర్ట్స్ పెట్టి ఆడారు. చివరికి ఆరుగురు కంటెండర్స్ అయ్యారు. వారిలో చివరికి ముగ్గురు మిగిలారు. రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్ మిగలగా.. చివరి పోటి వారి ముగ్గురికి పడింది. అయితే ఇది ఒక సపోర్టింగ్ టాస్క్​ మాదిరిగా బిగ్​బాస్ గేమ్​ని డిజైన్​ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే ఈ ప్రోమో చాలా ఎమోషనల్​గా, ఫ్యామిలీ డ్రామాగా హైలెట్ అయింది. ఎందుకో ఇప్పుడు చూసేద్దాం.

బిగ్​బాస్​ లేటెస్ట్ ప్రోమో..

బిగ్​బాస్​లో కెప్టెన్సీకి సంబంధించిన టాస్క్​ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటివరకు ఇమ్మూ చాలాసార్లు కెప్టెన్ అయ్యాడు. అయితే ఈసారి రీతూ లేదా తనూజకి కెప్టెన్సీ వస్తుందని అందరూ భావించారు. ఇమ్మూ కూడా ఈసారి వారిలో ఎవరికో వస్తుందనే ధీమాలోనే ఉన్నాడు. అయితే వారి గేమ్​ని తలకిందులు చేస్తూ దివ్య ఆటని మార్చేసింది. ఒకరిని గెలిపించాలి అనుకుంటున్నాను అంటూనే తనలోని గ్రడ్జ్​ని బయట పెట్టినట్లు కనిపిస్తుంది. ప్రోమో హెలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

తనూజ vs దివ్య

ముందు గేమ్​నే కంటిన్యూ చేస్తూ.. బిగ్​బాస్​ గార్డెన్​ ఏరియాలో రెడ్ ట్రైన్ ఒకటే ఉంచాడు. అయితే టాస్క్​లో లేని వారు అక్కడున్న సీట్​లో కూర్చోవాలని చెప్తూ.. అలాగే వారిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్తాడు. అందరూ ట్రైన్​లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. తమకి సపోర్ట్ చేసేవారినే లోపలికి పంపేలా కెప్టెన్సీ కంటెండర్స్ అడ్డుకుంటున్నారు. అయితే వారిని దాటుకుని దివ్య లోపలికి వెళ్లి చైర్​లో కూర్చొంది. సంజన కూడా దివ్య కూర్చొంది అని చెప్పేసరికి.. దివ్య ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. నేను ఇమ్మూకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. నువ్వు ఉంటే తను కెప్టెన్ అవ్వలేడు కాబట్టి నిన్ను తీసేస్తున్నానంటూ తనూజను తీసేసింది.

ఏడ్చేసిన తనూజ.. ఓదార్చిన భరణి..

నువ్వు భరణిని గారిని దృష్టిలో పెట్టుకునే నన్ను గేమ్​ నుంచి తీసేశావు అంటూ తనూజ సీరియస్ అయింది. పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నావు. అందుకే ఇలా చేస్తున్నావు. నీ కోపాలు బయట పెట్టుకో ఇంట్లో కాదంటూ సీరియస్ అయి లోపలికి వెళ్లిపోయింది. దివ్య నిర్ణయానికి ఇమ్మూ కూడా కాస్త షాకైనట్లు కనిపించింది. లోపలికి వెళ్లిన తనూజ పడుకుని ఏడ్చేసింది. రీతూ కూడా తనూని ఓదార్చింది. నేను వాళ్ల ఇద్దరి మధ్యకి వెళ్లట్లేదంటూ తనూజ ఏడ్చేసరికి అందరూ ఎమోషనల్ అయ్యారు. ఓదార్చడానికి వెళ్లిన భరణి కూడా ఏమి చేయాలని స్థితిలో చూస్తూ ఉండిపోయాడు. ఈ మొత్తం సీన్​లో భరణిని చూస్తే నిజంగా జాలేస్తుంది. పూర్తి ఎపిసోడ్ కోసం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

Read Entire Article