Bigg Boss Telugu Day 58 Promo : తనూజ మాటను నమ్మలేకపోతున్న హోజ్​మేట్స్.. సీక్రెట్ టాస్క్​లా కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ చేసిన బిగ్​బాస్

1 month ago 2
ARTICLE AD

Bigg Boss 9 Captaincy Task Promo : బిగ్​బాస్​లో సీజన్ 9 తెలుగులో 9వ వారానికి కెప్టెన్​ని ఎంచుకునేందుకు టాస్క్​లు స్టార్ట్ చేశాడు బిగ్​బాస్. అయితే రొటీన్​కు భిన్నంగా ఈ టాస్క్​ను ప్రారంభించాడు. ఇప్పటికే హోజ్​లో ఒకరంటే ఒకరికి పడట్లేదు. దానిని మరింత రెట్టింపు చేసేలా బిగ్​బాస్​ ఈ టాస్క్​ను ప్రారంభించాడు. పాపం తనూజ నిజం చెప్పినా నమ్మలేని స్టేజ్​లో కంటెస్టెంట్లు ఉన్నారు. ఇంతకీ బిగ్​బాస్ ఇచ్చిన టాస్క్ ఏమిటి? ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో హెలెట్స్..

బిగ్​బాస్​ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. దీనిలో భాగంగా అందరూ డెన్​లో​ కూర్చొని మాట్లాడుకుంటుండగా.. ఫోన్ వస్తుంది. అందరూ దాని దగ్గరికి వస్తారు. తనూజ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అయితే బిగ్​బాస్ వాళ్లు అందరూ మన మాటలు వింటున్నారు. వాళ్లని బయటకి పంపేయ్ అని చెప్తాడు. దీంతో తనూజ వాళ్లందరినీ బయటకు వెళ్లమని చెప్తుంది. అయితే నేను ఈ కాల్ ఎందుకు చేశాను అనుకుంటున్నావు అంటూ బిగ్​బాస్ అడగ్గా.. మొన్న మీకు కావాల్సినవి రాసి ఇవ్వమన్నారుగా దాని గురించి అనుకుంటున్నట్లు చెప్తుంది తనూజ. అయితే అది కాదని చెప్తాడు. ఇప్పటి నుంచి కంటెండర్షిప్ టాస్క్ మొదలైంది. ఈ విషయం అందరికీ చెప్పండి అంటాడు.

తనూజని ఎవరూ నమ్మట్లేదుగా పాపం..

తనూజ బయటకి వచ్చి.. కెప్టెన్సీ టాస్క్​ గురించి చెప్తుంది. ఇక ఏది ఉన్నా ఫోన్​లోనే మాట్లాడతారు అంట అని చెప్తుంది. అవును నీకేమి చెప్పారంటూ దివ్య అడగ్గా అదే చెప్పారు అని అంటుంది. దీంతో రీతూ సీక్రెట్ టాస్క్​.. చెప్పడం రావట్లేదు. క్లియర్​గా కనిపిస్తుందని అంటుంది. ఈ టైమ్ ప్రాంక్ చేయడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కూడా అదే ఎమోషన్​లో ఉన్నాను అని చెప్తుంది. కానీ ఎవరూ నమ్మరు. ఇది నమ్మితే ఆమె సక్సెస్ అవుతుందని అనుకుంటారు. అలాగే ఫోన్ వస్తే లిఫ్ట్ చేయాలా వద్దా అంటే మీ ఇష్టమని చెప్తుంది. అయితే ఫోన్ లిఫ్ట్ చేయవద్దు కెప్టెన్ కావాలనుకుంటే అని అంటాడు గౌరవ్.

రీతూకి క్లారిటీ వచ్చిందా?

ఈసారి మళ్లీ ఫోన్ వస్తుంది. సంజన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అయితే ఫోన్ రీతూకి ఇవ్వమని చెప్తాడు బిగ్​బాస్. రీతూ ఏమనుకుంటున్నావు తనూజ చెప్పిన దాని గురించి అని అడుగుతాడు బిగ్​బాస్. నేను నమ్మట్లేదు అని చెప్తుంది. గుడ్ లక్ అని చెప్పి.. కానీ కెప్టెన్సీ టాస్క్ గేమ్ ప్రారంభమైందని చెప్తాడు. దీంతో రీతూ షాక్ అవుతుంది. మరి ఆమె నమ్మిందా? మిగిలిన వాళ్లు నమ్మారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Read Entire Article