Bigg Boss Telugu 9 Latest Promo on Power Card Task : బిగ్‌బాస్ సీజన్ 9 డే 25 ప్రోమో వచ్చింది. ఇప్పటికే టాస్క్‌లతో కష్టపడుతున్న కంటెస్టెంట్లకు మరిన్ని ఫిజికల్ టాస్క్‌లు పెడుతూ చిచ్చులు పెడుతున్నాడు. నామినేషన్స్‌ని కూడా టాస్క్‌లతో నిర్వహించి.. ఇప్పుడు పవర్ కార్డ్స్ అంటూ మరిన్ని టాస్కులతో ముందుకు వచ్చాడు. బిగ్‌బాస్ సభ్యులను టీమ్లగా విడదీసి.. గేమ్స్ ఆడిస్తూ బంధాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నాడు. తాజా ప్రోమోలో తనూజ భరణిపై సీరియస్ అయినట్లు చూపించారు. ఇంతకీ ఏమి జరిగిందంటే..

బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో

ఆకలితో ఉన్న హిప్పో నోటిలో బాల్స్ వేసి.. దాని ఆకలి తీర్చాలని చెప్పాడు. ఏ టీమ్ అయితే హిప్పో నోటిలో ఎక్కువ బాల్స్ వేస్తారో వారే ఈ ఛాలెంజ్‌లో విజేతలవుతారంటూ చెప్పారు. ఈపోటీలో కంటెస్టెంట్లు తమ శక్తికి మించి ట్రై చేస్తే.. గట్టి కాంపిటేషన్ ఇచ్చారు. ప్రత్యర్థి పోటీదారులు బాల్ హిప్పో నోటిలో పడకుండా అడ్డుకోవచ్చంటూ టాస్క్ రూల్స్ చెప్పాడు. బాల్స్ వేయడమే కాదు.. వేయకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పాడు.

తండ్రీ కూతుళ్ల మధ్య చిచ్చు..

భరణి సంచాలకుడిగా చేసిన ఈ టాస్క్‌లో పాయింట్‌ని రెడ్ టీమ్‌కి ఇచ్చాడు. దీంతో తనూజ భరణిపై ఇది నిజంగా అన్ఫైయిర్ అంటూ సీరియస్ అయింది. వాడు వెనక ఉన్నాడు. శ్రీజ పట్టుకుని వెళ్లింది. కానీ పట్టుకుని తోశాడు అంటూ భరణిపై అరిచింది. ఇమ్మూ డిఫెండ్ చేసుకుంటే కూడా సీరియస్ అయింది తనూజ. అన్‌ఫెయిర్.. ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకోండి అంటూ అరవడంతో ప్రోమో ఎండ్ అయింది.

ఇప్పటివరకు గేమ్స్ ఆడట్లేదు అన్న పవన్ కళ్యాణ్ ఈ టాస్క్‌లతో తన గ్రాఫ్ పెంచేసుకున్నాడు. అలాగే ఫ్లోరా కూడా మంచిగా ఆడారు. రాము రాథోడ్ కూడా ముందు నుంచి టాస్క్‌లో మంచి ప్రతిభ కనబరిచాడు. రీతూ చౌదరి కూడా టాస్క్‌ల్లో తనదైన శైలిలో ఆడింది. మాస్క్ మ్యాన్ కూడా బాగా ఆడాడు. లైవ్ ప్రకారం ఈ గేమ్ ఆడి నలుగు కెప్టెన్సీ కంటెన్డర్స్ అయ్యారు. వీరిలో రీతూ చౌదరి, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, ఇమ్మూ ఉన్నారు. అయితే వీరిలో ఎవరు కెప్టెన్ కానున్నారో.. వేచి చూడాల్సిందే.