Bigg Boss Season 10 Letest Promo: బిగ్‌బాస్ ఇంట్లో ఎనిమిదో వారం బిగ్‌బాస్ ఎనిమిదో అవతారం "ది అల్టిమేట్ గోట్" ప్రారంభమైంది. ఇందులో భాగంగా రెడ్, ఎల్లో, గ్రీన్‌ లెవల్స్‌లో ఉన్న వాళ్లకి నామినేషన్లు పెట్టారు. గోట్స్ జడ్జిలుగా ఉంటూ నామినేషన్ల తీర్పులు ఇచ్చారు. తాజాగా బిగ్‌బాస్ తన ఇంటిని బీబీ హోటల్‌గా మార్చేశారు. గ్రీన్‌ కేటగిరిలో ఉన్న గోట్స్ హోటల్‌కి గెస్ట్‌లుగా వస్తారు. ఎల్లో కేటగిరిలో ఉన్న వాళ్లు హోటల్ యజమానులు.. ఇక రెడ్ టీం వాళ్లు పని వాళ్లగా ఉంటారు. తాజాగా బీబీ హోటల్‌లో ఓ లవ్‌బ్రేకప్ జరిగింది. ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ బ్రేక్‌అప్‌కి సంబంధించిన ప్రోమోని బిగ్‌బాస్ టీం విడుదల చేసింది. ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఆ ప్రోమోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రోమోలో ఉంది ఇదే..

బిగ్బాస్ ఇళ్లు బీబీ హోటల్‌గా మారిపోయింది. గోట్స్ అయిన త్రిగుణ్ భాయ్‌లా.. అమన్‌ లాలా.. దేబ్జానీ మహారాణి నూర్.. ముకేశ్ నూర్ లవర్ మహారాజు.. నీతూ మరో మహారాణి నటిస్తారు. అయితే హోటర్ ఓనర్స్‌లో ఒకరైన వర్షిణి లాలాని లైన్‌లో పెడుతుంది. అయితే ఓనర్ వర్షిణి, నూర్‌ లవర్ ముకేశ్‌ని ముద్దు పెట్టుకొని హగ్ చేసుకున్న ఫొటోలు బిగ్‌బాస్ ఎల్ఈడీ మీద వేసి ఫర్ లాలా అండ్ నూర్ అని ఇద్దరినీ ఈ ఇద్దరీ చీట్ చేసినట్లు చూపిస్తారు. దాంతో దేబ్జానీ క్యారెక్టర్‌లో మునిగిపోయి నన్నే చీట్ చేస్తావా అని ముకేశ్ మీదకి వెళ్తుంది. తను నా ఎక్స్ ఇక్కడ పని చేస్తుందని తెలీదు.. ఓదార్చా అని ముకేశ్ కవర్ చేస్తాడు. ఏం తక్కువ చేశారా నిన్ను.. నాలో లేనిది ఆమెలో ఉంది ఏంటి అని దేబ్జానీ మహారాణి నూర్ అడిగితే బ్రైన్ అంటూ ముకేశ్ కౌంటర్ వేస్తాడు. దేబ్జానీ సీరియస్‌గా అడిగితే ముకేశ్ యాపిల్ తింటూ కామెడీగా సమాధానం చెప్పడం ఫన్నీగా ఉంటుంది. ఇక లాలా కూడా వర్షిణి చేసిన పనికి హార్ట్ బ్రేక్ అయి వీడిని చంపేస్తా అంటూ ముకేశ్ మీదకి వెళ్తాడు. ఇదంతా ఫేక్ అని వర్షిణి అంటే దేబ్జానీ నిలదీస్తుంది.

రోహిత్ దేబ్జానీని ఓదార్చడానికి వెళ్తాడు. సీన్ భలే ఫన్నీగా ఉంటుంది. మరోవైపు త్రిగుణ్ తన తెలివితో ఎక్కడిక్కడ డీల్స్ పెట్టుకొని డబ్బు మొత్తం పంచించేస్తాడు. నీతూ రాంప్రసాద్‌కి ఫ్రీగా స్టార్ ఇచ్చేస్తుంది. ఇక వర్షిణి స్టార్ తనకి ఇవ్వమని త్రిగుణ్‌ని అడుగుతుంది. లాస్ట్‌లో చూస్తానని త్రిగుణ్ అంటే ఇక్కడైనా కన్సిడర్ చేయరా అని వర్షిణి అనడంతో ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేయకు అని త్రిగుణ్ అంటాడు. నీతూ ఫ్రీగా స్టార్ రాంప్రసాద్‌కి ఇచ్చేసిందని రోహిత్‌కి అమన్ చెప్పడంతో రోహిత్ అలా ఎందుకు ఇచ్చేశారు అని ప్రశ్నిస్తాడు. మరోవైపు త్రిగుణ్‌తో రామకృష్ణ డీల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ప్రోమో పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.