Bigg Boss Season 10 Letest Promo: బిగ్‌బాస్ ఇంట్లో నాలుగో వారం టోటల్‌ డామినేషన్‌లో భాగంగా టాస్క్ మొదలైంది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులందరినీ రెండు టీమ్స్‌గా విడదీశారు. ఒక టీం భైరవ, మరో టీం సప్తశక్తి అని పేర్లు పెట్టారు. ఇప్పటికీ రెండు టీమ్స్ గొడవలతో హౌస్ దద్దరిల్లిపోతుంది. డ్రాగర్స్, రణరంగంలో రథ నిర్మాణం అంటూ జరిగిన పోటీల్లో రోహిత్.. షాలిని, షాలిని.. అపూర్వ.. రోహిత్.. త్రిగుణ్‌, షాలిని.. అమన్‌ల మధ్య పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. తాజాగా నామినేషన్లు కూడా మొదలయ్యావి. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమోని బీబీ టీం విడుదల చేసింది. ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఆ ప్రోమోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రోమోలో ఉంది ఇదే..

బిగ్బాస్ ఇంట్లో నామినేషన్ అనే సంగ్రామానికి సమయం ఆసన్నమైంది అని బిగ్‌బాస్ చెప్తారు. ముందుగా నామినేషన్ చేయడానికి అమన్ వచ్చి త్రిగుణ్‌ని నామినేట్ చేస్తాడు. అరే తురే అని చాలా సార్లు కొట్టావ్ అంటూ అమన్ ఫైర్ అవుతాడు. వద్దు అన్న తర్వాత అన్నానా అంటూ త్రిగుణ్ అరుస్తాడు. ఒకరి మీద ఒకరు విరుచుకు పడతారు. తర్వాత రోహిత్ కూడా త్రిగుణ్‌కే నామినేట్ చేసి షాలిని ఐలవ్‌యూ.. షాలిని ఐలవ్‌యూ అని అంటాడు. ఇది చీప్ అట్మెంట్.. స్టోరీ నేను సెట్ చేయడం కాదు. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి మీరు సెట్ చేస్తున్నారు అని రోహిత్ చెప్తాడు. ఇక నరేశ్ అమన్‌ని నామినేట్ చేస్తూ సంచాలకుడిగా సరిగా చేయలేదని ఇంట్లో పది గొడవల్లో నాలుగు అమన్‌వే అని అంటాడు. తర్వాత త్రిగుణ్ రోహిత్‌కి నామినేట్ చేసినప్పుడు రోహిత్ తనని తాను డిఫెండ్ చేసుకునేట్పుడు రోహిత్ సీరియస్‌గా నిన్న జరిగిన ఒక యాక్షన్‌లో అతని ఉమ్ము నా మీద పడింది.. ఉమ్ము మీద పడింది అంటే అది యాక్సిడెంటా.. ఇంటెన్షనా అనేది మీ విజ్జానానికే వదిలేస్తున్నా.. అమన్‌ని డీగ్రేట్ చేయడం.. ముఖం బాలేదు అనడం కరెక్టేనా అంటూ రోహిత్ ప్రశ్నిస్తాడు. ఇక అమన్ నరేశ్‌తో నీ ముఖం చూస్తే చిరాకు వస్తుంది అంటే ఇంట్లో ఎవడూ పడడు అని అంటాడు. దీంతో ప్రోమో పూర్తయిపోతుంది.

నిన్నటి నుంచి కంటెస్టెంట్స్ అందరూ ముఖ్యంగా రోహిత్, త్రిగుణ్, అమన్‌, అపూర్వ వీళ్లు గొడవ పడే టైంలో వింతగా చిందులు వేస్తూ అవతల వాళ్లని వెటకారం చేస్తూ ట్రిగర్ చేస్తున్నారు. నామినేషన్‌లో ఎక్కువగా త్రిగుణ్‌ అమన్ ముఖం నచ్చలేదు.. ముఖం చూస్తే చిరాకు వేస్తుంది అన్నాడని పాయింట్ తీశారు. నిజానికి త్రిగుణ్ అమన్‌ ముఖం చూస్తే చిరాకు వేస్తుంది అనలేదు. ఇళ్లు చెత్తగా ఉంది. చూస్తే చిరాకు వేస్తుంది అంటాడు. దాన్ని అమన్ , రోహిత్ తప్పుగా అర్థం చేసుకున్నారు. వీకెండ్‌లో నాగ్ ఇందుకు సంబంధించి వీడియో వేసి అమన్‌, రోహిత్‌లకు క్లారిటి ఇచ్చే అవకాశం ఉంది. ఇక నిన్ను త్రిగుణ్, రోహిత్ గొడవలో రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్ము పడింది అని త్రిగుణ్ కావాలనే అలా చేశాడు అని రోహిత్ అంటాడు. ఈ విషయాన్ని కూడా నాగ్ వీడియో వేసి క్లారిటీ ఇస్తారు.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.