Bigg Boss Season 10 Letest Promo: బిగ్‌బాస్ ఇంట్లో ఐదో వారం రోడ్ టూ రోలర్ ప్రారంభమైంది.. ఇందులో భాగంగా మొదటగా సోమవారం నామినేషన్స్ స్టార్ట్ అయ్యావి.. నామినేషన్స్ అంటే.. మాటల యుద్ధం కాదు పవర్ కోసం జరిగే అసలైన పోరాటం. ఒక పండు కోసం మొదలైన వేట.. హౌస్‌లో ఒక్కొక్కరి అసలు రంగును బయటపెట్టింది. ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరి మీద ఎవరు ఫిజికల్‌గా అటాక్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి? కెప్టెన్ పవర్ చేతికి రాగానే.. “హౌస్ మొత్తం నాదే” అన్నట్లు అపూర్వ ప్రవర్తించిందని హోస్ దద్దరిల్లిపోయింది. ఇక అమన్, త్రిగుణ్, రోహిత్, అపుర్వాల మధ్య మొదలైన ఈ వార్.. నామినేషన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.. అసలు ఈ నామినేషన్స్‌లో ఎవరి గేమ్ పేలింది? ఎవరి మాస్క్ తొలగింది? చివరికి ఎవరు టార్గెట్ అయ్యారు? అసలు ఏం జరిగిందో ఇందుకు ఇందుకు సంబంధించిన తాజా ప్రోమోని బీబీ టీం విడుదల చేసింది. ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఆ ప్రోమోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రోమోలో ఉంది ఇదే..

ఈ వారం నామినేషన్స్‌కి బిగ్‌బాస్ కొత్త అవతారం ఎత్తాడు. “రోడ్ టు రీ లోడ్” అంటూ గేమ్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చేశాడు. గార్డెన్ ఏరియాలో కొన్ని బాక్సులు ఏర్పాటు చేసి.. ప్రతి రౌండ్‌కి ముందు ఒక హౌస్‌మేట్ ఆ బాక్సుల్లో ఒకదానిలో పండును రహస్యంగా దాచాలి. ఆ తర్వాత బిగ్‌బాస్ పిలిచిన ఇద్దరు హౌస్‌మేట్స్ ఆ పండు కోసం వేట మొదలుపెట్టాలి. కానీ అక్కడ వెతికేది కేవలం ఒక పండు కాదు. ఎదుటివారి ఆటను శాసించే పవర్ అంటూ బిగ్‌బాస్ చెప్పిన ఒక్క మాటతో అసలు హీట్ మొదలైంది.

అమన్, రాంప్రసాద్ పరుగులు పెట్టగా రాంప్రసాద్ పండు తీసుకొని అమన్‌ని నామినేట్ చేస్తాడు. త్రిగుణ్ మెడని మొదట నువ్వే రివర్స్‌లో పట్టుకున్నావు అని రాంప్రసాద్ చెప్పగానే ఆయన మీద పడ్డదే మీరు.. అదే కాళ్ల మీద మీరు పడకపోయింటే.. బాడీ మీద ప్రజర్ పడేది కాదు.. చేతికి ఏం అయ్యేది కాదు అని అమన్ చెప్తాడు. దానికి త్రిగుణ్ చాలా క్లియర్గా నన్ను ఫిజికలీ టార్గెట్ చేయడం జరిగింది. ప్రాణం పోయేటప్పుడు కూడా సంచాలక్‌ కోసం వెయిట్ చేయడం ఎలా అని త్రిగుణ్ అడిగితే దానికి అపూర్వ ఇద్దరు సంచాలకులు ఉన్నారు కదా వాళ్లు ఎందుకు గేమ్‌ని పాజ్ చెప్పలేదు వాళ్లని అడగండి అని అంటుంది. దానికి నరేశ్ మేం ఏం ఖాళీగా లేం చెప్తూనే ఉన్నాం పీకలు నొక్కుకోండి.. చావండీ అని ఎవరూ చెప్పరు అని కౌంటర్ ఇస్తాడు. దానికి అమన్ మొదలు పెట్టింది త్రిగుణ్ ముగించింది నేను అని అంటాడు. ఇక వంశీ రోహిత్‌తో ఆటకి ముందు ఇవాళ చూస్తారు నేను ఏంటో.. అని గ్రూప్‌లో అందర్ని రెచ్చగొట్టేలా మాకు ఎందుకు చెప్పావ్ అని అడుగుతాడు. దానికి త్రిగుణ్ టార్గెటింగ్, టార్గెటింగ్ అంటాడు.

ముకేశ్ అపూర్వని నామినేట్ చేస్తూ కెప్టెన్సీ రాగానే నాకు అధికారం వచ్చిందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావ్ నువ్వు చెప్తే మేం పంచెలు దించుకొని వంగి పనులు చేయాలా అని అడుగుతాడు. దానికి అపూర్వ వర్షిణి కెప్టెన్సీని ఉద్దేశించి బ్యాడ్జ్ మాత్రమే అక్కడ మొత్తం కెప్టెన్సీ నీదే అని అంటుంది. వర్షిణి వెంటనే అపూర్వ ముందుకు వచ్చి నిల్చొని మళ్లీ రిపీట్ చేయ్ అని అడుగుతుంది. did you say? మోస్ట్ డిజాస్టర్ కెప్టెన్ నువ్వు అని అపూర్వని అంటుంది. తర్వాత త్రిగుణ్ అపూర్వని నామినేట్ చేస్తూ బటర్ ఫ్లై అన్నారు కానీ ఎప్పుడు చూసినా చెవిలో మూగే ఈగ.. నేను రోహితుని అనడానికి కీలకమైన పాత్ర పోషించింది అపూర్వ చెప్పిన అబద్ధం. రోహిత్ నాకో విషయం చాలా క్లారిటీగా చెప్పాడు.. వచ్చినప్పుడే.. బీ కేర్‌ ఫుల్ వాట్‌యూ విష్ ఫర్ అని ఎందుకురా బాబు కోరుకున్నాను అని చెప్పి ప్రతిరోజూ ఫీల్ అవుతున్నా అని త్రిగుణ్ అంటాడు. దీంతో ప్రోమో పూర్తవుతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.