Bigg Boss Season 10 Letest Promo 3: బిగ్‌బాస్ ఇంట్లో నాలుగో వారం టోటల్‌ డామినేషన్‌ చివరకి వచ్చేసింది.. ఇంటి సభ్యులు రెండు టీమ్స్‌గా విడిపోయి.. యుద్ధాలు చేసుకున్నారు. చివరకు రెడ్ టీం విజయం సాధించి.. కెప్టెన్సీ కంటెండర్‌ ఛాన్స్ కొట్టి రెడ్‌టీంకి చెందిన అమన్ కెప్టెన్ అయ్యాడు. అయితే అదే రెడ్‌ టీంకి చెందిన వర్షిణి తన పవర్ వాడి అమన్ కెప్టెన్సీని లాక్కుంటుంది. కెప్టెన్సీ పోటీ తర్వాత ఇప్పుడు కంటెస్టెంట్స్ ఇమ్యునిటీ కోసం పోరాడుతున్నారు. ఈ పోరాటంలో సృష్టి, సుధీర్ల మేటర్ మరోసారి తెర మీదకు వచ్చింది.. ఇందుకు సంబంధించిన ఇవాళ్టి ఎపిసోడ్ మూడో ప్రోమోని బిగ్‌బాస్ టీం విడుదల చేసింది. ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఆ ప్రోమోలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రోమోలో ఉంది ఇదే..

టోటల్‌ డానినేషన్‌లో భాగంగా ఇమ్యునిటీ పొందడానికి ఎవరి దగ్గర డ్రాగర్ ఉంటుందో వాళ్లకే ఇమ్యునిటీ పొందే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్తారు. దాంతో రెండు, మూడు డ్రాగర్లు ఉన్న కంటెస్టెంట్స్‌ దగ్గర డ్రాగర్లు తీసుకోవడానికి అస్సలు డ్రాగర్స్ లేని కంటెస్టెంట్స్ పావులు కదుపుతారు. సృష్టి, చరణ్, అపూర్వతో మంతనాలు జరిపితే.. వంశీ, దేబ్జానీ మాట్లాడుకుంటారు. ఇక సుధీర్‌ దగ్గర ఒక డ్రాగర్ ఉండగా.. అమన్‌తో కెప్టెన్సీ డీల్ పెట్టుకొని అమన్ రెండు డ్రాగర్స్ తీసుకున్నందుకు అపూర్వ, చరణ్ సుధీర్‌తో మంతనాలు జరుపుతారు. షాలిని వంశీ దగ్గరకు వెళ్లి డ్రాగర్ ఇవ్వమని అడుగుతుంది. పదివారాలు ఉంటావ్ నీకు ఇమ్మునిటీ ఎందుకు అని వంశీ షాలినితో అంటాడు. ఇక సృష్టి అపూర్వతో ఇప్పుడు నువ్వు నాకు డ్రాగర్ ఇవ్వాలి అనుకోవడం లేదా.. నా వైపు నుంచి ఆలోచించు అని డ్రాగర్ ఇవ్వమని అడుగుతుంది. అపూర్వ చరణ్‌తో సృష్టిని నేనే మొన్న రేసులో నుంచి తీసేశా.. ఇప్పుడు నేనే మళ్లీ డ్రాగర్ ఇచ్చి ఇమ్మునిటీకి ఛాన్స్ ఇస్తే అందరూ నా గురించి ఏం అనుకుంటారు అని అంటుంది.

ఫైనల్‌గా ఇమ్యునిటీ కోసం సృష్టి, త్రిగుణ్, వంశీ, సుధీర్, ఝాన్సీ, చరణ్‌ పోటీ పడతారు. ఇందుకు బిగ్‌బాస్ వాళ్ల ఆరుగురి ఫొటోలు బయట ఏర్పాటు చేసి చివరకు ఏ ఇద్దరు ఫొటోలు ఉంటే వాళ్లే ఇమ్యునిటీ దక్కించుకొని డైరెక్ట్‌గా ఆరో వారంలోకి వెళ్తారు అని చెప్తారు. ఎవరికి ఇమ్యునిటీ దక్కొద్దు అనుకుంటారో వాళ్లకి ఫొటోలను డ్రాగర్‌తో పొడిచి రేసు నుంచి తొలగించమని అంటారు. ఝాన్సీ త్రిగుణ్‌కి ఇమ్యునిటీ దక్కకూడదు అని డ్రాగర్‌తో అతని ఫొటోని పొడుస్తుంది. ఇమ్మునిటీ రాకూడదు అనుకున్నా వారి ఫొటోని స్వాప్ చేమమని రెండో ఆప్షన్ చెప్పడంతో సుధీర్ సృష్టికి ఇమ్మునిటీ రాకూడదు ఆమె ఫొటో తీసేసి వంశీకి రావాలని వంశీ ఫొటోని మెయిన్ బోర్డు మీద పెడతాడు. వంశీ చరణ్‌ని ఇమ్యునిటీ రాకూడదని చరణ్‌ ఫొటో మీద డ్రాగర్‌తో గుచ్చి చరణ్ చాలా కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు.. అతనికి ఉన్న కాన్షిడెంట్ నేను ఎక్కడా చూడలేదు.. 15 వారంలో కూడా ఉంటారు అని నేను అనుకుంటున్నా అని కారణం చెప్తాడు. తర్వాత సృష్టి వంశీ ఫొటోతో తన ఫొటో స్వాప్ చేసుకుంటుంది. సృష్టి చెప్పిన కారణాలు కరెక్ట్‌గా లేవు అని చెప్పిన వంశీ సుధీర్‌, సృష్టి టాపిక్ మాట్లాడుతాడు. ఆ టాపిక్ వద్దు అని సృష్టి అంటుంది. దీంతో ప్రోమో పూర్తవుతుంది. ఈ ఆరుగురిలో ఏ ఇద్దరికీ ఇమ్యునిటీ దక్కి నేరుగా ఆరో వారం వరకు నామినేషన్లలో ఉండకుండా తప్పించుకున్నారో ఎపిసోడ్ వస్తే తెలుస్తుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.