Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10.. రోజు రోజుకీ మంచి మంచి ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రోజు అక్టోబరు 24వ తేదీ బిగ్‌బాస్ మొదలై 48వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్రవారం జరిగింది ఇదే..

నాగ్ అదిరిపోయే బులెట్ ఎంట్రీ ఇస్తారు. రాగానే ఆడియన్స్‌తో మాట్లాడుతారు. వెంటనే శుక్రవారం ఏం జరిగిందో చూపిస్తారు. రాంప్రసాద్‌ కెప్టెన్సీ గడువు ముగిసింది.. కెప్టెన్ బ్యాడ్జ్‌ లోపల పెట్టమని అంటారు. తర్వాత ఇంటికి ఈ వారం కెప్టెన్ ఎవరూ ఉండరు అని చెప్పి త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, నీతూలు ఇంటిని చూసుకోవాలని చెప్తారు. అమన్‌కి పనిష్మెంట్ ఉండటం వల్ల ఈ బాధ్యతలు తీసుకోకూడదు అని చెప్తారు. తర్వాత ఇంటి సభ్యులు రెండు టీమ్స్‌గా విడిపోతారు. వైట్‌ గోల్డ్‌ టాస్క్ ఆడుతారు. తమ డ్రీమ్స్ ఏంటో చెప్పే ఛాన్స్ ముగ్గురికి వస్తుంది. రోహిత్ తన తల్లికి ఇల్లు కట్టి ఇవ్వడం డ్రీమ్ అని చెప్తాడు. ఝాన్సీ తన ఇంటి అప్పులన్నీ తీర్చేయడం తన డ్రీమ్ అని అంటుంది. అమన్ తన తల్లికి బంగారం కొనడం డ్రీమ్ అని చెప్తాడు.

దేబ్జానీ, షాలిని గొడవ..

దేబ్జానీ ఝాన్సీ బెడ్ మీద ఇన్ని వారాలు పడుకునేది.. నిన్నటి ఎపిసోడ్‌లో.. దేబ్జానీ, ఝాన్సీకి గొడవ అవ్వడంతో ఝాన్సీ తన బెడ్ అడిగేసుంటుంది. దాంతో దేబ్జానీ, షాలిని ఒక బెడ్ మీద పడుకుంటారు. షాలిని బట్టలు అన్నీ బెడ్ మీద పడేయడంతో దేబ్జానీ క్లీన్ చేయమని అంటుంది. దాంతో ఇద్దరూ గొడవ పడతారు. తర్వాత కెప్టెన్సీ రూంలో పడుకోవడం గురించి గొడవ అవుతుంది. రోహిత్, దేబ్జానీ కూడా గొడవ పడతారు. షాలిని త్రిగుణ్‌తో నేను ఎలిమినేట్ అయిన తర్వాత రోహిత్ నన్ను ముద్దుపెట్టుకుంటే దాన్ని తప్పుగా అనుకున్నాడు.. నేషనల్ టెలివిజన్‌లో అలా ఎలా అంటారు. నీ కూతురు.. నీ భార్య గురించి అంటే ఎలా ఉంటుంది అని అడుగుతుంది. నేషనల్ టెలివిజన్ అని అనుకుంటే ఎందుకు అలా చేయడం అని త్రిగుణ్ అడుగుతాడు. బెడ్స్‌ గురించి గొడవ చాలా పెద్ద జరుగుతుంది. త్రిగుణ్‌, రోహిత్ గొడవ పడి ఒకర్ని ఒకరు ఒకరు రెచ్చగొట్టుకుంటారు. రోహిత్ నోటికొచ్చినట్లు మాట్లాడేసి త్రిగుణ్‌ గోట్ కూడా ముష్టి చేసుకున్నాడు అని తిడతారు. నాగ్ ఆడియన్స్‌తో రోహిత్‌ని సపోర్ట్ చేసే ఆడియన్‌తో ఇదా బిహేవియర్ అని అంటాడు. కాదు సార్ మీరు ఛాన్స్ ఇస్తే చెప్తా అంటారు. తాజ్‌ మహాల్ టీ పొడి యాడ్ జరుగుతుంది. బాయ్స్ అమ్మాయిల కోసం టీ చేసి ఇస్తారు. అమ్మాయిలు టీ తాగుతూ టీతో తమ మెమూరీ చెప్తారు.

ఫ్యాన్స్ ధర్నా చేయడం లేదు..

నాగ్ ఇంటి సభ్యులకు నవ్వుతూ పలకరించి ముఫాసా అంటూ నరేశ్‌తో మాట్లాడుతారు. గేమ్ బాగా ఆడావ్ అని చెప్పి.. కెప్టెన్‌ రూం యాక్సెస్ ఇస్తారు. తర్వాత అమన్ గేమ్ చాలా బాగుందని.. ఇంప్రూవ్‌ అవుతుందని చెప్తారు. తర్వాత దేబ్జానీని దేవసేన అని పిలిచి నీ ఆట చాలా బాగుంది.. మీ అమ్మ నీ ఆట చూసి గర్వపడుతుందని అంటారు. ఇక నీతూ ఆట కూడా చాలా బాగుందని చెప్తారు. ఏం పీకలేవు అన్న వాళ్లకి పీకి చూపించావ్.. అదిరిపోయేలా ఆడావ్ మరి కోచ్‌లా ఉండిపోవడం ఎందుకు అని అంటారు.

ముకేశ్‌కి చిన్న క్లాస్‌..

ముకేశ్‌ ఆట చాలా బాగుందని చెప్పి కొన్ని మాటలు జారుతున్నావ్ నువ్వు జెంటిల్మెన్ అనుకున్నా.. శివ పర్సనల్ జీవితం గురించి నీకు ఎందుకు.. నీ నుంచి ఇది ఊహించలేదు. కరెక్టే చేసుకో అని నాగ్ చెప్తారు. నీతూ ప్రొఫెషనల్ గురించి కూడా మాట్లాడొద్దు అని చెప్పి ముకేశ్ ఫొటో పగలగొడతారు. తర్వాత శివతో ఆట చాలా బాగా ఆడావ్.. సింగిల్‌గా ఆడుతావ్.. గ్రూప్‌లో ఆడుతావో నిర్ణయించుకో అని సలహా ఇస్తారు. ఇక వర్షిణితో ఏం ఆడావ్.. 12 కేజీలు మోసి మొదట నువ్వే డ్రాప్ చేశావ్.. నాకు కాలిబర్ ఉంది బాగా ఆడు అని చెప్తారు. తర్వాత రాంప్రసాద్‌ ఆట బాగుందని పనిష్మెంట్స్‌ కూడా బాగున్నాయి అని అంటారు.

షాలిని రావడం నచ్చిందా..

వర్షిణి తనకి త్రిగుణ్, రాంప్రసాద్‌ క్లోజ్ కానీ ఇద్దరూ నాతో ఆడను అనేశారు అని ఏడుస్తుంది. ఇక నాగ్ రాంప్రసాద్‌తో షాలిని మళ్లీ రావడం నీకు నచ్చిందా లేదా అని అంటే నచ్చేలేదు సార్.. జనాల ఓట్లతో వెళ్లిపోయిన తను మళ్లీ రావడం నచ్చలేదు.. ఆట కూడా మారలేదు అని అంటాడు. ఇక రామకృష్ణ ఆట బాలేదు ఇంప్రూప్ చేసుకోమని అంటారు. బ్రేక్ టైంలో షాలిని ఏడుస్తుంది. ప్రతీ సారి అందరూ ఇలా ఎవిక్ట్ అయిపోయి వచ్చింది అంటున్నారు.. నేను అడిగానా నాకు ఛాన్స్ ఇవ్వండి అని నాకు ఉండాలని లేదు వెళ్లిపోవాలని ఉందని ఏడుస్తుంది.

తల దించుకున్న షాలిని..

నాగ్ షాలినితో ఏమైంది ఎందుకు కళ్లు తడిచాయి అని అడుగుతారు. అందరూ ఎలిమినేట్ అయి వచ్చాను అంటున్నారు అని ఏడుస్తుంది. ఉన్నదే అంటారు కదా.. నువ్వు బెటర్ అయ్యావా.. నీకు ఓ వీడియో చూపిస్తా అని బిగ్‌బాస్ వార్నింగ్‌ల వీడియో చూపిస్తారు. దక్షితో గొడవ చూపించి.. ఎన్ని వార్నింగ్‌లు అమ్మా.. అలా మీద మీద పడిపోవడం ఏంటి.. సరే ఇవన్నీ వదిలేద్దాం అని దేబ్జానీ బెడ్ గొడవ చూపిస్తారు. మనం ఒకరిని నోటికొచ్చినట్లు అనేస్తాం అవతల వాళ్లు మనకి ఏం అనకూడదు అంటే ఎలా.. స్టేజ్ మీదకి వచ్చి షాలిని మారిపోతుందని నాకు ప్రామిస్ చేశావ్ కదా ఇదేనా ప్రామిస్ నిలబెట్టుకోవడం ఇదేనా.. త్రిగుణ్‌ ముద్దులు పెట్టుకోవడం గురించి మాట్లాడాడు.. నేషనల్ టెలివిజన్‌లో ఇలా మాట్లాడటం తప్పు అని అంటే నువ్వు అలా చేయడం కరెక్టేనా అని రోహిత్‌ తొడ మీద ముని వేళ్లతో రాయడం గురించి వీడియో చూపిస్తారు. సార్ నేను ఇంట్లో ఉండలేను వెళ్లిపోతా అని అంటుంది. ఇక రోహిత్ లేచి మునివేళ్లతో రాయడం గురించి మాట్లాడుతా.. అది రొమాంటిక్ సైన్ కాదు అని అంటే షాలిని గురించి తను మాట్లాడుకుంటుంది. నువ్వు మధ్యలో రావొద్దు.. నీకు అలవాటు అయిపోతుంది అని నాగ్ సీరియస్ అవుతారు. ఇక షాలిని నాగ్‌కి సారీ చెప్పడంతో ఎన్ని సార్లు సారీ చెప్తావ్.. నాకు బిగ్‌బాస్‌కి అదే పనిగా సారీ చెప్పడమే పని అయిపోయింది.. నీకు నిజంగా వెళ్లిపోవాలి అనిపిస్తే వెళ్లిపోచ్చు అని బిగ్‌బాస్‌కి చెప్పి గేట్ ఓపెన్ చేయిస్తారు. వెళ్లిపోతా సార్ అని షాలిని అంటే రోహిత్, రామకృష్ణ ఆపుతారు. అగ్నిపరీక్ష అన్నీ గుర్తు తెచ్చుకో.. ఫైట్ చేయ్.. అని చాలా చెప్తాడు. నాగ్ టైం ఇవ్వడంతో నేను వెళ్లను సార్.. నన్ను నేను ఫ్రూవ్‌ చేసుకొని వెళ్తా అని అంటుంది.

రేయ్ త్రిగుణ్ లెగరా..

శ్వేత ఆట చాలా బాగుందని నాగ్ చెప్తారు. ఇక ఝాన్సీ, వంశీ, సుధీర్లతో మీ గురించి మాట్లాడానికి ఏం లేదు.. మీ ముగ్గురు మీ ఆట మార్చుకోవాలి అని అంటారు. ఇక దక్షి నువ్వు అసలు ఉన్నావా ఆటలో.. నరేశ్ పసుపు పెట్టినప్పుడు కనిపించావ్ ఇంకా టైం తీసుకుంటా అంటే కుదరదు అని అంటారు. తర్వాత త్రిగుణ్ ఫొటో పగలగొట్టి రేయ్ త్రిగుణ్ లెగరా.. ఏరా నువ్వు గోటా.. బిగ్బాస్ ఏదో నిన్ను గోట్ ఆఫ్ స్పీడ్ పెట్టారు కానీ నువ్వు గోట్‌కి సరిపోతావా.. మూడు టాస్క్‌లు అదరగొట్టావ్.. నువ్వు మోసిన బరువుకి నువ్వు హీరో.. ఎవరు ఎంత వేసినా తీసుకున్నావ్,, భరించావ్,, నీ టాలెంట్ చూపించావ్ కానీ గోట్ ఇలాగే ప్రవర్తిస్తావా అని వీడియో చూడు అని త్రిగుణ్ రోహిత్ మధ్య చేతులు చూపించుకొని జరిగిన గొడవ చూపిస్తారు. ఇంత లేక్‌గా చీప్‌గా ప్రవర్తిస్తావా.. అవతల వ్యక్తి గుడ్ అని నేను చెప్పడం లేదు.. సపోర్ట్ చేయడం లేదు.. ఉరి వేసుకోరా.. ఏంటి అదంతా.. నిన్ను.. రోహిత్‌ని చూసి ముకేశ్‌ నేర్చేసుకున్నాడు.. ఇలాగే గేమ్ ఆడాలేమో అని అనుకుంటున్నాడు.. ఇది కరెక్ట్ కాదు ముకేశ్ వాళ్ల దగ్గర నేర్చుకోకు.. ఆడియన్స్ ఛీ కొడతారు అని అంటారు. త్రిగుణ్ తను తప్పు చేశానని ఒప్పుకుంటాడు. నీకేం పనిష్మెంట్ కావాలి అని అడిగితే నా గోట్ శివకి ఇచ్చేస్తా అని త్రిగుణ్‌ అంటే అది నువ్వు ఆడి గెలుచుకొని సంపాదించుకుంది అని అంటారు.

రోహిత్‌కి బ్లాక్ కార్డు..

రోహిత్‌ని లేపి వీడియోలు చూపించి.. ఎన్నిసార్లు చెప్పినా..పరివర్తన లేదు.. నీయమ్మా అనడం ఏంటి.. ఇదా నీ క్యారెక్టర్.. నామినేషన్ల గురించి మాట్లాడొద్దు అన్నా వినవా.. ముకేశ్‌ని ఫైల్స్‌ రాజా అనడం ఏంటి.. అని అడుగుతారు. నీ ఆట చాలా బాగుందని ఇష్టపడ్డవాళ్లు నువ్వు పడిపోతున్నావ్‌ అని చెప్పారు. వాళ్లతో మాట్లాడు అని ఆడియన్‌తో మాట్లాడిస్తారు. గేట్ బయట దొరకవా అని అంటావా.. నువ్వు వాళ్లకి దొరకవా.. కప్పులు కడిగే వాడు కప్పులు కొట్టడా.. తప్పులు మీద తప్పులు తప్పుల మీద తప్పులు ఏంటి ఇది.. పనిష్మెంట్ ఏంటి.. నీకు ఇప్పటికే ఓ ఎల్లో కార్డు వచ్చింది.. షాలినిలా నేను క్షమించలేను.. నీ మీద చాలా ఎక్స్‌పెటేషన్స్ ఉన్నాయి. మారి ఇంట్లో ఉంటావా.. అందరికి ఇవ్వాల్సినవి ఇచ్చేసి వెళ్లిపోతావా అని అంటారు. ఇక రోహిత్‌కి బ్లాక్ బ్యాడ్‌.. ఇది నీ క్యారెక్టర్ మీద ఒక బ్లాక్ మార్క్.. ఏది వద్దు అంటున్నామో అది కంటిన్యూగా చేస్తున్నావ్.. ఈ బ్లాక్ బ్యాడ్జ్‌ నీ మీద ఉంటుంది. డోర్‌కి అడుగు దూరంలో ఉన్నావ్.. ఇంకొక్క సారి వీటిలో ఏం జరిగినా.. ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతావ్ అని చెప్పి బ్లాక్ బ్యాడ్జ్‌ ఇచ్చి.. ఇంటిని రూల్ చేయడానికి నువ్వు అర్హుడివి కాదు.. ఈ ఇంట్లో ఉన్నంత కాలం నువ్వు కెప్టెన్‌ అవ్వవు.. అని చెప్తారు. రోహిత్‌ మోకాలి మీద కూర్చొని అలా చేయొద్దు సార్ అది నా గేమ్ మొత్తాన్ని షట్‌డౌన్ చేస్తుంది. ప్లీజ్ మిమల్ని బతిమాలుతున్నా.. అని అడుగుతాడు. ఇంట్లో వాళ్లకి నాగ్ ఓటింగ్ వేయమని అంటే పది మంది ఓటు వేస్తారు. రెండు వారాలు నువ్వు కెప్టెన్ అవ్వలేదు.. నీ ప్రవర్తన మారితే ఛాన్స్ వస్తుందని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title=" ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self"> ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.