Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10.. రోజు రోజుకీ మంచి మంచి ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రోజు సెప్టెంబరు 30వ తేదీ బిగ్‌బాస్ మొదలై 24వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓరేయ్ పడిపోయా లేపండ్రా..

నరేశ్ కెమెరా ముందుకు వెళ్లి మొదటి సారి నామినేషన్‌కి వచ్చాను. నా కోసం ఓ బ్యాంక్ ఓపెన్ చేసి ఓట్లు వేయండి.. నాకు ఒకటే ముఖం ఉంది రెండు లేవు అంటూ కామెడీగా నవ్వించి ఓటు వేయమని అడుగుతాడు. సీన్ చాలా కామెడీగా ఉంటుంది. రోహిత్ అపూర్వతో దేబ్జానీ రాంప్రసాద్, నరేశ్ ఓ టీం అని త్రిగుణ్ మధ్యలో కలుస్తాడు అంటూ మాట్లాడుతాడు. ఇక త్రిగుణ్ అమన్‌కి పిలిచి సారీ చెప్తాడు. మళ్లీ చెప్తున్నా సారీ కోపంలో తగ్గలేను అంటూ తన భార్య మీద కూడా అరిచేస్తా తర్వాత కాళ్లు పట్టేస్తా అని త్రిగుణ్ అంటే ఈ ఒక్క విషయం వల్ల బతికిపోతున్నావ్.. అన్న .. వదినా నీకు నేను ఉన్నా అని అంటాడు. రాత్రి ముకేశ్ నరేశ్, రాంప్రసాద్ వాళ్లు మాట్లాడుకుంటూ ముకేశ్ బెడ్కి గోడకి మధ్య పడిపోతాడు. ఓరేయ్ పడిపోయా లేపండ్రా అంటూ ముకేశ్ చెప్పడం అందరూ లేపకుండా నవ్వుకోవడం చాలా కామెడీగా ఉంటుంది.

ఈ గదికి వెళ్లొద్దు..

డ్రాగర్ మష్రూం గదిలో ఉండటంతో ఆ గదికి కాపాలా ఉండే ఝాన్సీ టిఫెన్ చేయడానికి వెళ్లడంతో బ్లూ టీం ఎవరినీ ఈ గదికి వెళ్లొద్దని అంటారు. త్రిగుణ్‌ కావాలనే ఆ గదికి వెళ్తాడు. గదిలో అన్నీ వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ బ్యాక్ బీన్ తీసి అందులో వెతికి లోపల ఉన్నా థర్మోకోల్ బాల్స్ పడేస్తారు. కెప్టెన్ అపూర్వ త్రిగుణ్, ముకేశ్ మీద కోప్పడుతుంది. 15 లెక్కపెట్టేలోపు సర్దేయమని అనడంతో ముకేశ్, త్రిగుణ్ గోల చేస్తారు. తర్వాత అపూర్వ కూడా క్లీన్ చేయడంతో కెప్టెన్ త్వరగా చేయలేకపోయింది ఫెయిల్ కెప్టెన్ అని అరిచి టీజ్ చేస్తారు.

ఝాన్సీ మీద దాడి..

ఝాన్సీ దగ్గర డ్రాగర్ ఉందేమో అని షాలిని, సృష్టి, దేజ్జానీ ఝాన్సీని పట్టుకొని అణిచి వెతుకుతారు. వర్షిణి ఝాన్సీని కాపాడటానికి వెళ్తుంది. షాలిని ఓ డ్రాగర్ తీసుకొని త్రిగుణ్‌కి ఇవ్వడంతో త్రిగుణ్ దాన్ని ఫ్యాంట్‌లో పెట్టుకుంటాడు. ఈ క్రమంలో త్రిగుణ్‌ని అమన్‌ పట్టుకోవడంతో త్రిగుణ్ చేయి కింద ఉండిపోతుంది. దాంతో త్రిగుణ్ ఎంత లెమ్మని చెప్పినా లేవకపోవడంతో ఓ బూతు త్రిగుణ్ తిట్టాడని అమన్ రేగిపోతాడు. ఇక నరేశ్ తనని ముకేశ్ రెచ్చగొట్టాడని అందుకే అందరి మీదకి వెళ్లానని కామెడీగా చెప్పి నవ్వుకుంటారు.

ఫైర్ వర్సెస్ లావా..

బిగ్‌బాస్ రెండు టీమ్స్‌ పంచభూతాలతో యుద్ధాలు చేయాలని అందుకు మొదటిగా నిప్పు మీద ఆధిపత్యం సాధించాలని చెప్తారు. ఇందుకు ఫైర్ వర్సెస్ లావా అని గేమ్ పెడతారు. ఇరు టీమ్స్ నుంచి 4 చొప్పున ఆడుతారు. ఎవరి టీం కలర్ డ్రమ్స్ వాళ్లు యాక్టివిటీ రూం నుంచి తెచ్చి గార్డెన్‌లో ఉన్న డ్రమ్స్ ఏరియాలో తమ డ్రమ్స్ పెట్టుకోవాలి.. ఈ క్రమంలో నేలకు టచ్ అవ్వకుండా డ్రమ్స్ మీద నడుచుకుంటూ వెళ్లి పెట్టాలని అంటారు.

గెలిచిన రెడ్ టీం..

రెండు టీమ్స్‌ నుంచి 8 మంది పాల్గొంటారు. టీమ్ రెడ్ నుంచి రోహిత్, అమన్, వంశీ, బ్లూ టీమ్ నుంచి దేబ్జానీ, ముకేశ్, త్రిగుణ్, సృష్టి పాల్గొంటారు. రెడ్‌టీంకి బెనిఫిట్‌గా మొదటి బజర్‌కి గేమ మొదలు పెట్టగా బ్లూ టీం సెకండ్ బజర్‌కి గేమ్ మొదలు పెడతారు. మొదట రెడ్ టీం అన్ని డ్రమ్స్ వాల్‌కి పెట్టడంతో అమన్‌ త్రిగుణ్‌ని పట్టుకుంటాడు. దాంతో ఇద్దరూ చాలా ఫిజికల్ అవుతారు. అమన్ నోటికొచ్చినట్లు తిట్టేస్తుంటే రోహిత్, జాన్సీ నోరు మూస్తారు. ఈ గేమ్‌లో టీం భైరవ గెలుస్తుంది.

దేబ్జానీ డ్రాగర్ తీసేసిన అమన్..

గెలిచిన రెడ్ టీంలో ఒకరు ఓడిపోయిన టీం నుంచి డ్రాగర్ తీసుకోవాలని బిగ్‌బాస్ చెప్పడంతో అందరూ కలిసి సృష్టి డ్రాగర్ తీసుకోవాలని నిర్ణయిస్తారు. దాంతో అమన్ సృష్టి పేరు చెప్తాడు. తర్వాత బిగ్‌బాస్ నీకే నచ్చిన వాళ్లు తీసుకోమని అంటే అమన్‌కి దెబ్బ దెబ్బ అని రోహిత్ హింట్ ఇవ్వడంతో అమన్ దేబ్జానీ పేరు చెప్తాడు. ఈ నిర్ణయంతో టీం మొత్తం నిన్ను నమ్మాం అమన్ తప్పు చేశావ్ అంటారు.

దొంగతనానికి వెళ్లిన షాలిని..

షాలిని కెప్టెన్ గదిలో డ్రాగర్స్ దొంగతనం చేయడానికి వెళ్తాడు. షాలిని చూసి వెళ్లి ఆపుతుంది. తనేం తీసుకోలేదు అనిరోహిత్ షాలినిని సపోర్ట్ చేయడంతో షాలిని రోహిత్‌ దగ్గర డ్రాగర్ తీసుకుంటా అంటుంది. తర్వాత కెప్టెన్ గదిలో ఎందుకు ఉండలేదు అని అపూర్వని షాలిని తిడుతుంది. తర్వాత రోహిత్ షాలినితో మీకు నేను సపోర్ట్ చేశా ఇప్పుడు మీరు దొంగతనం చేశారు అంటే నన్ను అడుగుతారు.. ఇలాంటి ప్లాన్ మీరే ఎందుకు చేయాలి అని రోహిత్ షాలినితో గొడవ పడతాడు. భయపడి మా మీద అరుస్తున్నావ్ అని అంటే కెప్టెన్ రూంలోనే ఉన్నాయి ఎవరు తీసుకుంటారో తీసుకోండి అని రోహిత్ షాలిని చాలా గొడవ పడతారు. వీళ్లకి సపోర్ట్ చేయడం నాదే తప్పు అని రోహిత్ రాంప్రసాద్‌కి సారీ చెప్తాడు. మీ వల్ల వాళ్లందరి ముందు నేను పిచ్చోడిని అయిపోయా అని రోహిత్ అంటాడు. నా గేమ్ నేను ఆడుకుంటా నాకు ఎవరి సపోర్ట్ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు అని షాలిని రోహిత్‌ని అంటుంది. తర్వాత వంశీ వాళ్లతో ఏమైనా ఉంటే మమల్ని అనండి మా కోసం రోహిత్, అపూర్వని అనడం ఏంటి అని షాలిని గొడవ పడుతుంది. ఇక వంశీ, చరణ్ కూడా ఎవరు ఏం గేమ్ ఆడారో అని గొడవ పడతారు.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

షాలిని, సుధీర్ కూడా గొడవ పడతారు. ఎపిసోడ్‌లో ఎక్కువ కనిపించాలి అని స్క్రీన్ స్పెస్ కోసమే అని షాలిని సుధీర్‌ని అంటుంది. ఇక ముకేశ్ అయితే షాలిని, అపూర్వ, రోహిత్‌ని ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ అంటాడు. ట్రయాంగిల్ ఏంటి అని రోహిత్ అంటాడు. నీకు వర్షిణిని ఏమైనా మేం అంటున్నామా.. అని గొడవ పడతారు. ముకేశ్ రోహిత్ ఓరేయ్ అరేయ్ అంటూ గొడవ పడతారు. ఇక రోహిత్, సుధీర్ గొడవ పడుతూ సుధీర్ రెడ్ టీం మొత్తంతో రోహిత్ సృష్టికి డ్రాగర్ ఇచ్చేయాలని ప్లాన్ చేశాడు.. అని రోహిత్ ప్లాన్ చెప్పేస్తాడు. నువ్వు ఫేవర్ ఆడుతున్నావ్ అని సుధీర్ చెప్తాడు. డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ సుధీర్ రోహిత్ మీద రేగిపోతాడు. భజన్‌లాల్ అంటూ రోహిత‌‌ని ట్రిగర్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.