Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10.. రోజు రోజుకీ మంచి మంచి ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రోజు సెప్టెంబరు 29వ తేదీ బిగ్‌బాస్ మొదలై 23వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ ఇద్దరి డ్రాగర్లు తీసుకున్నారుగా..

రణరంగంలో రథ నిర్మాణం గేమ్లో రెండు రౌండ్లలో టీం భైరవ విన్ అవుతారు. తర్వాత బెస్ట్ ప్లేయర్స్‌గా వంశీ, సుధీర్‌ని టీం డిక్లర్ చేస్తుంది. ఇద్దరిని ఓడిపోయిన టీం నుంచి ఇద్దరి దగ్గర డ్రాగర్లు తీసుకోమని చెప్తే సుధీర్ త్రిగుణ్ దగ్గర తీసుకుంటాడు. వంశీ ముకేశ్ డ్రాగర్ తీసుకుంటాడు. తర్వాత నరేశ్ వెతికి వెతికి తన డ్రాగర్‌ని సంపాదిస్తాడు. మీరు ఇస్తానని ఇవ్వలేదు నేనే వెతుకున్నా అని నరేశ్ హ్యాపీ అయిపోతాడు.

సంహాసనం మీద కూర్చొకూడదు..

సుధీర్‌కి కాలికి దెబ్బ తగలడంతో సుధీర్ కెప్టెన్ రూంలోని సోఫా మీద కూర్చొంటాడు. అలా కూర్చొకూడదు అని ముకేశ్ వచ్చి అపూర్వతో వాదిస్తాడు. ఇక త్రిగుణ్ రోహిత్‌తో కెప్టెన్ రూంకి మీరు వెళ్తున్నారు మాకు వెళ్లనివ్వడం లేదు అని గొడవ పడతారు. ముకేశ్ కూడా రోహిత్‌తో గొడవ పడతాడు. త్రిగుణ్ రోహిత్ని వెటకారంగా డ్యాన్స్‌లు చేసి ఉడికిస్తాడు. ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడుస్తాడు అని రోహిత్ అంటాడు.

గుండెల్లోకి రావొచ్చా..

ముకేశ్ వర్షిణితో ఇంత ఫ్రీగా ఉన్నావ్ అంటే డ్రాగర్ ఎక్కడ దాచావ్.,. నాకు చెప్పు అని అంటాడు. నువ్వు గేమ్లో లేవు నీకు ఎందుకు అని అంటే ఎక్కడుందో చెప్పు అంటాడు. ఇక త్రిగుణ్ వచ్చి గుండెల్లో దాచుకొని ఉంటుందని అంటే నీ గుండెల్లోకి రావొచ్చా అని అంటాడు. తర్వాత అపూర్వ కెప్టెన్‌ రూంలో ఉంటే వర్షిణి సింహాసనం మీద కూర్చొని ఉంటే ముకేశ్ మళ్లీ చూసి సింహాసనం మీద కూర్చొవడం తప్పు అని దగ్గరకు వెళ్లాడు. తను కూర్చొవడం తప్పు అంటే నేను పనిష్మెంట్ ఇస్తా అని అంటుంది. రోహిత్ వచ్చి కెప్టెన్ ఇష్టం అని చెప్తాడు. నువ్వు దాన్ని మెంటైన్ చేస్తున్నావ్ అని ముకేశ్ అంటే ఎవర్ని ఎవర్ని అని రోహిత్ గొడవ పడతాడు. ఇక ముకేశ్, రోహిత్, త్రిగుణ్ ముగ్గురు గొడవ పడతారు.

నామినేషన్లు షురూ..

నామినేషన్లు మొదలవుతాయి. భైరవ టీం గెలిచి బెనిఫిట్ పొందడంతో భైరవ టీంలో ఉన్న అందరూ నామినేష్ చేయొచ్చని చెప్తారు. ఇక ఓడిపోయిన సప్తశక్తి టీంలో కేవలం ఇద్దరు మాత్రమే నామినేట్ చేసే అర్హత పొందారని.. ఇక ముకేశ్ నేరుగా నామినేట్ అయినందుకు అతన్ని కెప్టెన్ అయినందుకు అపూర్వని ఎవరూ నామినేట్ చేయొద్దని అంటారు. ఇక సప్తశక్తి టీం త్రిగుణ్, నరేశ్ నామినేట్ చేస్తారని చెప్తారు.

రోహిత్‌ని నామినేట్ చేసిన త్రిగుణ్..

చాలా చాలా హిపోక్రిటిక్గా ఉండే పర్సన్‌ని నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు తను చేసిందే కరెక్ట్. ప్రతి చిన్న విషయానికి ఒక నరేటివ్
సెట్ చేయడం. అక్కడ జరిగిన విషయానికి అసలు కంప్లీట్ లేకుండా నరేటివ్ ని మార్చి మార్చి మార్చి మాట్లాడితే ఓ మనం కనెక్ట్ అయిపోతారు అనుకుంటాం. ఎప్పుడైతే వర్షిణి షాలినిని ముట్టుకుందో అప్పుడది తప్పైనప్పుడు, ఆ పర్సన్ కూడా నా చేయి పట్టుకున్నప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పే కదా ఇంకొకలికి జరిగితే అది తప్పు అది తనే చేస్తే కరెక్ట్ అని రోహిత్‌ని త్రిగుణ్ నామినేట్ చేస్తాడు.

అమన్‌ని నామినేట్ చేసిన నరేశ్..

నరేశ్ అమన్‌ని నామినేట్ చేస్తాడు. ఊరికే అగ్రసివ్ అయిపోతావ్.. సంచాలక్‌గా ఫెయిలయ్యావ్.. ఫస్ట్ బాగానే ఉన్నావ్ తర్వాత ట్రిగర్ అయిపోయావ్ అని అంటాడు. దానికి అమన్ అన్నీ వివరించి త్రిగుణ్ నా ముఖం చూస్తే చిరాకు వస్తుంది అని అంటే ఎవరికైనా కోపం వస్తుంది అని అంటాడు.

సృష్టిని నామినేట్ చేసిన ఝాన్సీ..

ఝాన్సీ సృష్టిని నామినేట్ చేసి మూడు వారాలు నామినేట్ చేయొద్దు అని నాకే చెప్పావ్.. అది తప్పు.. ఈ ప్రశ్న ఇంకెవరికీ అడగొద్దు అని కూడా చెప్పాను.. తర్వాత నామినేషన్లకు చెందిన ఎన్విలప్ నాకు ఇచ్చావ్ కానీ అందులో నామినేట్ చేసే హక్కే లేదు ఎందుకు అలా ఇచ్చావ్ అంటే నా ఫ్రెండ్స్‌ని నామినేట్ చేస్తావని ఇవ్వలేదు అన్నావ్ అని చెప్తుంది.

త్రిగుణ్‌ని నామినేట్ చేసిన అమన్..

అమన్‌ త్రిగుణ్‌కి నామినేట్ చేస్తాడు. నన్ను చూస్తే నీకు ఎందుకు చిరాకు వేస్తుంది. నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్లతో పాటు పక్కవాళ్లని ట్రిగర్ చేస్తావ్.. ఆటలో తంటున్నావ్.. మిథిలేష్ ఓటు విషయంలో కూడా నన్నే అన్నావ్ అని అమన్ అంటే.. మిథిలేష్‌కి డిసైడింగ్ ఓటు నీదే కదా అందుకే నీకు అడిగాను అంటాడు. అరే తురే అంటే ఎలా అని అమన్ అంటే నువ్వు నా తమ్ముడు అనుకొని అన్నాను ఇక అనను అంటాడు.

త్రిగుణ్‌, వర్షిణిలను నామినేట్ చేసిన అపూర్వ, రాంప్రసాద్..

అపూర్వ త్రిగుణ్‌ని నామినేట్ చేస్తుంది. అన్ని విషయాలు మాట్లాడి త్రిగుణ్‌ని ఇచ్చి పడేస్తుంది. ఇక రాంప్రసాద్ షాలినిని నామినేట్ చేసి అపూర్వ మీద అరిచి బీఫ్ సౌండ్ వచ్చేలా అన్నవ్.. రోహిత్‌ మీద చేయి ఎత్తావ్ తను నీ ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది ఇంకెవరు అయినా అయితే పెద్ద గొడవ అయ్యేదని అంటాడు.

దేబ్జానీని నామినేట్ చేసిన రోహిత్..

రోహిత్ దేబ్జానీని నామినేట్ చేసి మీకు నామినేష్ ఎలా చేయాలో కూడా తెలీదు.. మీ వాయిస్ మీకు ఉంటుందేమో ఒకరి దగ్గర ఒక మాట మరొకరి దగ్గర మరొమాట.. అన్నీ బిగ్‌బాస్ చెప్పే వరకు ఎవరు చెప్పినా వినరు.. మీకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు అని అంటాడు. నీలా ఆడటం నాకు ఇష్టం లేదు.. కరెక్ట్ అయినా కాకపోయినా నేను ఉన్నది చెప్పేస్తా అని అంటుంది. నరేశ్‌ని పొట్టొడు అన్న అన్నావ్ అంటే దానికి నరేశ్ తను తెలిసో తెలీకో అనేసింది నేను వద్దు అంటే ఆపేసింది అని అంటాడు.

సృష్టిని నామినేట్ చేసిన వర్షిణి..

వర్షిణి సృష్టిని నామినేట్ చేసి సుధీర్‌తో అలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు.. నీ ట్రోమా వల్ల నీతో ఇంకెప్పుడైనా గొడవ అయితే మమల్ని కూడా అలాగే చేస్తావని భయం వేస్తుంది అని అంటుంది. సృష్టి మరోసారి ఆ విషయం వచ్చినందుకు సారీ చెప్తుంది.

చరణ్‌ని నామినేట్ చేసిన వంశీ..

రెండో సారి వచ్చినా కూడా నువ్వే నీ ఆట ఇంప్రూవ్ చేయలేదు.. నీ పర్సనాలిటీ ఫేక్‌ అనిపిస్తుంది. అన్‌మెచ్చూర్‌గా ఉన్నావ్.. గేమ్ బాలేదు.. పెద్ద సార్ దగ్గర కూడా నేను ఆడిందే కరెక్ట్ అంటావు. ఇక్కడ కేవలం డ్యాన్స్‌లు, జోకులు మాత్రమే కాదు అని అంటాడు. నా పర్మనాలిటీ ఇదే మీ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు.. నా మెచ్యూరిటీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.. మీకు ఏమైనా నచ్చకపోతే నాతో డైరెక్ట్‌గా చెప్పు అని అరుస్తాడు. సుధీర్ కూడా చరణ్నే నామినేట్ చేస్తాడు. ప్రపంచం అంతా నన్ను వ్యతిరేకించినా నేను మాత్రం నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటా అని చరణ్ అంటాడు. ఇక ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయినవాళ్లు ముకేశ్, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, సృష్టి, అమన్, నరేశ్, చరణ్‌. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.