డే 79 ఎపిసోడ్ లో నామినేషన్ల రచ్చ తర్వాత డిస్కషన్స్ జరిగాయి. సంజన స్టేట్మెంట్ తప్పు అని ఇమ్మాన్యుయేల్ అంటే, ఇన్ని రోజులు తెచ్చుకున్న పేరును నాశనం చేసుకోవద్దు అని భరణి కళ్యాణ్ ను హెచ్చరించాడు. "మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటే ఏంటి? ఏదైనా సమస్య వస్తే డెమోన్ రీతూకి సపోర్ట్ చేస్తున్నాడు. అది రాంగ్ గా పోట్రె అవుతోంది. అందుకే మీ గేమ్ మీరు ఆడండి" అని తనూజా నచ్చజెప్పింది. రీతూ గుక్కపెట్టి ఏడవడంతో దివ్య, కళ్యాణ్ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. "నా పాయింట్ ను అసలు కన్సిడర్ చెయ్యరు ఎవ్వరూ" అని డెమోన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. "ఇప్పుడు తెలిసి ఉంటుంది తనకు నేను ఇంట్లో ఉన్నాను అని. మంచిగా ఉంటే మంచం కిందకు తోస్తారు" అంటూ సారీ చెప్పడానికి ఒప్పుకోలేదు సంజన. భరణి నామినేషన్ విషయాన్ని తీసుకొచ్చి దివ్యను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ దివ్య తీరు మారకపోవడంతో ఆయనే కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

చివరి అంకానికి చేరిన రణరంగం

"ఈ రణరంగం చివరి అంకానికి చేరుకుంది. చివరి కెప్టెన్సీ కంటెండర్హిప్ మొదలైంది. ఈసారి యుద్ధం మీ ఊహలకు అందని విధంగా ఉంటుంది. గత సీజన్లలో బెస్ట్ కెప్టెన్లుగా నిలిచిన నా యోధులను లోపలకు పంపిస్తాను. వారు మీకు, కెప్టెన్సీ కి మధ్య అడ్డుగోడలా ఉంటారు. వాళ్ళను ఓడించి గెలవాల్సిన టైమ్ ఇది. మీరు ఒక్కసారి ఓడినా నేరుగా కెప్టెన్సీ నుంచి ఎలిమినేట్ అవుతారు" అని షాక్ ఇచ్చారు బిగ్ బాస్.

బిగ్ బాస్ 7 తెలుగు నుంచి ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. "రూమ్స్ ఎలా పెట్టుకున్నారో చూస్తా" అని కెప్టెన్ రూమ్ లో తిష్ట వేసింది. "బాగా గుర్తొస్తున్నావు" అని ప్రియాంక పై ఇమ్మూ పంచ్ వేశాడు. "అందరికీ అదే చెప్తావ్" అన్నది ప్రియాంక. "కెప్టెన్సీ కోసం జరిగే పోరును మీరే మొదలుపెట్టాలి. ఎవరితో యుద్ధం చేయాలి అనుకుంటున్నారో మీరే డిసైడ్ చేయాలి" అని ఆదేశించారు బిగ్ బాస్. ఒక్కో కంటెస్టెంట్ వచ్చి తాము ఎందుకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడాలి అనుకుంటున్నారో ప్రియాంకకు చెప్పారు. సెకండ్ టైమ్ కెప్టెన్ కావాలని సంజన, ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదని, ఇదే చివరి ఛాన్స్ అని భరణి, మా అమ్మ మొన్న కెప్టెన్ గా మరోసారి చూడాలన్నది అని కళ్యాణ్, షేరింగ్ కెప్టెన్ అయ్యాను. ఇప్పుడు ఓన్ కెప్టెన్ కావాలి అని సుమన్, ఈ వీక్ నేను కెప్టెన్ అయితే మెంటల్ గా మరింత స్ట్రాంగ్ అవుతా అని ఇమ్ము తమ పాయింట్స్ చెప్పారు. "సంథింగ్ ఫిషి" అనే ఈ టాస్క్ లో ప్రియాంక, కళ్యాణ్ పార్టిసిపేట్ చేశారు. అందులో కళ్యాణ్ విన్ అవ్వడం విశేషం.

Also Read: 'బిగ్ బాస్'లో వీకెండ్ వార్... అతనికి సల్మాన్ ఖాన్ క్లాస్... హిందీలో ఏం జరుగుతోందంటే?

అశ్వత్థామతో ఆటలా?

"లేడీస్ అండ్ జెంటిల్ మెన్... అశ్వత్థామకు చావు లేదన్న విషయం తెలుసా?" అంటూ బిగ్ బాస్ 8 తెలుగు రన్నరప్ గౌతమ్ కృష్ణ హౌస్ లోకి అడుగు పెట్టాడు. "నామినేషన్ లో అరుస్తుంటే ఎక్కడ బీపీ వచ్చి పోతారో" అంటూ మీమ్ వచ్చింది సుమన్ పై. ఆయనే నా ఫేవరేట్ అని చెప్పాడు గౌతమ్. ఫన్ టాస్క్ లో సంజన - భరణి - సుమన్, రీతూ - కళ్యాణ్, డెమోన్ - తనూజా, ఇమ్మూ - దివ్య మధ్య లవ్ ట్రాక్స్ పెట్టారు. "గౌతమ్ తో యుద్ధంలో గెలవడానికి మీకిస్తున్న టాస్క్ త్వరగా సరిగ్గా" అని బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ చేశారు. ఈ టాస్క్ లో గౌతమ్ తో భరణి పోటీ పడగా, గౌతమ్ గెలిచాడు. దీంతో భరణి కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీనికి డెమోన్ పవన్ సంచాలక్ గా వ్యవహరించాడు. ఓడిపోవడంతో భరణి కూతురికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను అని ఎమోషనల్ అయ్యాడు.

Also Read: Andhra King Taluka Censor Review - 'ఆంధ్ర కింగ్ తాలూకా' సెన్సార్ రివ్యూ: రామ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్... సినిమాలో హైలైట్స్ ఏమిటంటే?