డే 73 ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫ్రీజ్, రిలీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్ అంటూ హౌస్ మేట్స్ ను ఫన్నీగా ఆడించారు. ఇమ్మాన్యుయేల్ తో పాటు అబ్బాయిలు అందరికీ మేకప్ వేశారు అమ్మాయిలు. అలాగే అమ్మాయిలందరికి ఫ్రీజ్ అయ్యాక మీసాలు, గడ్డాలు గీశారు అబ్బాయిలు. ఈ ఫన్నీ టాస్క్ అవుతుండగానే 'చింటూ చింటూ' అంటూ డెమోన్ తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఆ మాట వినగానే డెమోన్ ఎమోషనల్ అయ్యాడు. రాగానే డ్రై ఫ్రూట్ సున్నుండలు తినిపించింది. ఇక ముందుగా రీతూ నీ పరిచయం చేశాడు. దీంతో రీతూకి కూడా సున్నండ తినిపించింది ఆవిడ. 'బాగా ఆడుతున్నావ్ అని అందరూ మెచ్చుకుంటున్నారు నిన్ను. నిద్ర పోవట్లేదు. బాగా నిద్రపో. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కప్పు గెలువు' అని చెప్పింది డెమోన్ తల్లి. 'డాడీని బాగా మిస్ అవుతున్నాను' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు డెమోన్. అలాగే 'సపోర్ట్ కావాలంటే ఆమె ఒక్కతే చేస్తుంది. ఆమె బాగా చూసుకుంటుంది కాబట్టి నేనూ క్లోజ్ గా ఉంటున్నాను' అని రీతూతో ఫ్రెండ్షిప్ గురించి వివరణ ఇచ్చుకున్నాడు. అలాగే ప్రేమగా బిర్యానీ తినిపించి, 30 నిమిషాల టైమ్ పూర్తి కావడంతో వెళ్ళిపోయింది డెమోన్ తల్లి.

సంజనకు గుడ్ న్యూస్
రాత్రి 9 గంటలకు సంజనాను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి గుడ్ న్యూస్ చెప్పారు బిగ్ బాస్. "బిగ్ బాంబు కారణంగా మీరు మీ ఫ్యామిలీని కలుసుకోలేదు అన్న విషయం తెలుసు కదా. మీ ఫ్యామిలీని కలవాలని ఉందా? మీకు కూడా మీ ఫ్యామిలీని కలిసే అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నా. దాన్ని పొందాలంటే ముగ్గురు ఇంటి సభ్యుల దగ్గర టైమ్ 30 నిమిషాలకు మించకుండా తీసుకోవడానికి ట్రై చెయ్యండి" అని చెప్పారు బిగ్ బాస్. ఇమ్మాన్యుయేల్ 15 మినిట్స్ ఇచ్చేశాడు. కానీ భరణిని అడగడానికి ఆమెకు ధైర్యం సరిపోలేదు. "5 మినిట్స్ కూడా అడగాలంటే సిగ్గేస్తుంది" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన. కళ్యాణ్ వాలంటరీగా 5 నిమిషాలు త్యాగం చేశారు. కానీ కళ్యాణ్ నుంచి 1 నిమిషం మాత్రమే తీసుకుని 16 నిమిషాలతో సరిపెట్టుకుంది సంజన.

సంజన భర్త అజీజ్, ఇద్దరు పిల్లలతో వచ్చాడు. సంజన పాప కొత్త ముఖాలను చూసి ఆగకుండా ఏడవడంతో స్టోర్ రూమ్ కి పంపించారు. "ఇక నీకేమైందో అనుకున్నా. ఇంత సైలెంట్ అయ్యావేంటి?" అని అడిగారు అజీజ్. అంతేకాదు "ఇంట్లో కంటే ఇక్కడ 10 పర్సెంట్ మాత్రమే ఉంది" అని ఇమ్మూతో చెప్పాడు. "ఆ 10 శాతానికే ఇల్లు అతలాకుతలం అవుతోంది" అంటూ పంచ్ వేశాడు. అలాగే "మీ అమ్మ అందరితో గొడవ పడుతుంది. పడొద్దని చెప్పురా తమ్ముడా" అని సంజన కొడుకుతో చెప్పాడు ఇమ్ము. "బాగా ఆడి బయటకు రా" అని చెప్పి వెళ్ళిపోయారు సంజన భర్త.

దివ్య తల్లి మాస్
దివ్య తల్లి ఇంట్లోకి వచ్చి తన కూతురితో కాకుండా అందరితో మాట్లాడింది. "మా అమ్మ వస్తే నాతో తప్ప అందరితో మీటింగ్ పెడుతుంది" అని అన్నావ్. నీతో మాట్లాడను" అని చెప్పగానే దివ్య కన్నీళ్లు పెట్టుకుంది. "స్కూల్ నుంచి రాగానే వంటలు చేసి నా ప్రాణం తీసేది. నువ్వు మార్చుకోవాల్సింది ఏం లేదు. నువ్వు బాధ పడితే డాడీ వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉన్నావో అలాగే రా" అని దివ్యతో చెప్పింది. "నాకొక బ్రదర్ ఉండేవాడు. చదువులో ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ కి కమిట్ అయ్యాడు. ఇప్పుడు టీవీలో ఓ పర్సన్ నాకు అన్నయ్యలా అనిపించాడు. నా అన్నయ్య అయ్యే క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. నువ్వు బ్రదర్ అని పిలిస్తే నేను పిలిచినట్టే అని చెప్పాను. దివ్య ఇక్కడికొచ్చి సడన్ గా మామయ్య అని పిలవలేదు కదా. తను అలా పిలవడానికి ఇదే రీజన్. అందరికీ ఇదే రిక్వెస్ట్. పిల్లలకు నచ్చింది చేసుకొనివ్వండి" అని చెప్పింది.

"ఎన్ని గంటలు కెమెరా మీ మీద పెట్టినా ఏం మాట్లాడరా? ఏదైనా కోడ్ లాంగ్వేజ్ ఉందా?" అంటూ డెమోన్ పై , "మీ ఇద్దరి హైట్ కి ఆ ఫ్రెండ్షిప్ ఏంటి?" అంటూ సుమన్ ను, భరణి ఫాదర్ ఫిగర్, ఇమ్మాన్యుయేల్ అన్నీ నియోజవర్గాలకు చెందుతారు, సంజనకు పని ఇవ్వకండి, రీతూ మీ ఇద్దరిదీ ఉంటదమ్మా అది వేరే ట్రాక్ అంటూ సెటైర్లు వేశారు. "తనూజా అంటే అమ్మ వెనకాల తిరిగే కూతురులా ఉంటుంది. మా పెద్దమ్మాయి నా చేతుల్లో నుంచి మొత్తం తీసుకుంటుంది. కానీ నాకది తెలీదు. అలాగే నువ్వు కూడా అంతా తీసేసుకున్నావు. ఇంట్లో పెద్ద కూతురు టైప్ ఉంటుంది. కళ్యాణ్ పక్కింట్లో ఉన్న అబ్బాయి లాంటి వాడు. ఖుషి ఒక అందాల రాక్షసి" అంటూ అందరి గురించి చెప్పేసింది. బిర్యానీ, కలాకండ్ తీసుకొచ్చింది దివ్య తల్లి శ్రీలక్ష్మి. 'డీజే టిల్లు' సాంగ్ కు డ్యాన్స్ చేసి అందరికీ ఎనర్జీ ఇచ్చి వెళ్ళిందావిడ.