బిగ్ బాస్ డే 65 ఎపిసోడ్లో ఉదయాన్నే రెడీ ఫర్ ది డే అంటూ బిగ్ బాస్ లెటర్ పంపారు. దీంతో ఫ్యామిలీ వీక్ ఇదే అనుకుని ఎమోషనల్ అయ్యారు కంటెస్టెంట్స్. "నామినేషన్ నుంచి సేవ్ కావడానికి మీ అందరికీ ఒక అవకాశం. రీతూ, కళ్యాణ్, దివ్య ఈ బీబీ రాజ్యానికి రాజు, రాణులు. వీళ్లకు బెడ్ రూమ్ తో పాటు పూర్తి ఇంటికి యాక్సెస్ ఉంటుంది. ఇమ్యూనిటీకి కూడా దగ్గరగా ఉంటారు. కానీ మీరు సేఫ్ కాదు. మిమ్మల్ని ఓడించి, మీ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మిగతా వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. వారం ముగిసేసరికి మీ ముగ్గురిలో ఒకరు ఇమ్యూనిటీతో ఇంటి కెప్టెన్ అవుతారు" అంటూ బిగ్ బాస్ కొత్త టాస్క్ స్టార్ట్ చేశారు. రాజు, రాణులు తమ పవర్ తో హౌస్ మేట్స్ ను ఇంటర్వ్యూ చేసి... తనూజా, నిఖిల్, డెమోన్, సంజనాలను కమాండర్లుగా చేశారు. మిగతా వాళ్ళు సామాన్యులు. రాజు రాజులకు చికెన్, పనీర్ తో విందు భోజనం పంపారు బిగ్ బాస్.

ఇమ్మూ కూరగాయలు అమ్ముకున్న కథ
"చిన్నప్పుడు ఊర్లో గోంగూర అమ్మాను" అంటూ ఇమ్మూ తన గురించి ఎవ్వరికీ తెలియని స్టోరీని భరణితో షేర్ చేసుకున్నాడు. కమాండర్స్ రోజ్ రూమ్ లో, సామాన్యులు డెన్ లో ఉంటారు. అలాగే రాజు, రాణులు, కమాండర్స్ ఎలాంటి పనులు చేయరు. సామాన్యులే పనులన్నీ చేయాలి. నిఖిల్ కు సెక్యూరిటీ, ఫుడ్ బాధ్యత తనూజా- సంజన, ఇన్ఫర్మేషన్ బాధ్యతను పవన్ కు ఇచ్చారు. అలాగే సామాన్యులలో సుమన్ కు సీక్రెట్ టాస్క్ ఇవ్వగా, భరణితో దివ్య హెడ్ మసాజ్ చేయించుకుంది.

Also Read: బిగ్‌ బాస్ డే 63 రివ్యూ... దివ్య జిత్తులమారి ఆట... తనూజాకు స్వీట్ వార్నింగ్... ఆయన ఎలిమినేషన్ జస్ట్ మిస్

"కమాండర్స్ మీలో ఒకరు మీ స్థానాన్ని రిస్క్ లో పెట్టుకుని సామాన్యులతో పోరాడాల్సి ఉంటుంది. ముందుగా ఓ టాస్క్ ఆడి, అందులో ఓడిపోయిన వారు సామాన్యులతో పోరాడాల్సి ఉంటుంది" అంటూ "విన్ ఇట్ రిస్క్ ఇట్" అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. కమాండర్లు బాస్కెట్ వేసుకుని, ఇతరులు అందులో బాల్స్ వేయకుండా చూసుకోవాలి. దీనికి సంచాలక్ రీతూ. ఇందులో డెమోన్, నిఖిల్ రూల్స్ బ్రేక్ చేసినా, వాళ్ళను రిమూవ్ చేయలేదని ఫౌల్ గేమ్ అంటూ సంజన రీతూపై ఫైర్ అయ్యింది. ఈ విషయమై రీతూ - సంజనాకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఫస్ట్ రౌండ్ లో తనూజా, సెకండ్ రౌండ్ లో డెమోన్, చివర్లో నిఖిల్ సేవ్ అయ్యాడు. సంజన ఓడిపోవడంతో సామాన్యులలో సుమన్ శెట్టితో నెక్స్ట్ టాస్క్ ఆడింది.

ఫెయిల్డ్ సంచాలక్
'బిల్డ్ ఇట్ టు విన్ ఇట్' అనే ఈ టాస్క్ లో గెలిస్తేనే సంజన మళ్ళీ కమాండర్ అవుతుంది. లేదా సుమన్ కొత్త కమాండర్ అవుతారు. దీనికి కళ్యాణ్ సంచాలక్. ఇద్దరూ టవర్ ను నిర్మించారు. అయితే సుమన్ టవర్ ముందుగానే నిర్మించినా, కాస్త వంకరటింకరగా వచ్చింది. ఇదే సాకుతో సంజనాను విన్నర్ గా ప్రకటించబోయాడు కళ్యాణ్. దీంతో "ముందు ఎలాగైనా ఓకే అన్నారు కదా. ఆయన హైట్ ను దృష్టిలో పెట్టుకుని, ముందుగా పెట్టినదాన్ని బట్టి చెప్పు" అంటూ తనూజా కళ్యాణ్ పై ఇంతెత్తున లేచింది. "సుమన్ ముందే పెట్టారు కదా" అంటూ దివ్య పాయింట్ లేవనెత్తింది. "ఇష్టమొచ్చినట్టు పోట్రే చేస్తే చూడడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు" అంటూ కళ్యాణ్ సంజనాను విన్నర్.గా ప్రకటించాడు. దీంతో ఫెయిల్డ్ సంచాలక్ అంటూ తనూజా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వరకు కళ్యాణ్ అదే మాటను పట్టుకుని బాధ పడుతూ కూర్చుండిపోయాడు. చివరకు సుమన్ వచ్చి ఓదార్చాడు.

Also Read: బిగ్‌ బాస్ డే 64 రివ్యూ... నామినేషన్లలో బుర్రబద్దలయ్యే షాక్... ఆ ఒక్కడు తప్ప అందరికీ డేంజరే