Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 61 రివ్యూ... రీతూ మబ్బుమొహంపై ఇమ్మూ జోక్స్... దివ్య - తనూజా మధ్య భరణి సాండ్ విచ్... తనూజాతో రెండో పెళ్లికి సుమన్ రెడీ
4 weeks ago 2
ARTICLE AD
బిగ్ బాస్ డే 61 ఉదయాన్నే "వాళ్ళు ముగ్గురూ కెప్టెన్ అవ్వలేదు. కాబట్టి మనల్ని పీకాలని ట్రై చేస్తారు. మనం కలిసి ఆడాలి" అంటూ ఇమ్మాన్యుయేల్, దివ్య, సుమన్ శెట్టి స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నారు. అంతలోనే తిండి విషయంలో నిఖిల్, గౌరవ్ కి గొడవ మొదలైంది. "ఎప్పుడూ ఏదో ఒక చోట టైంపాస్ చేస్తావ్" అని మండిపడ్డాడు నిఖిల్. కిచెన్ లో సుమన్ శెట్టి ఫన్నీగా తనూజాతో పెళ్ళికి సిద్ధం అయ్యాడు. గార్డెన్ ఏరియాలో రీతూ మబ్బు మొహం అంటూ ఇమ్మూ కామెడీ చేశాడు.
కెప్టెన్సీ టాస్క్ లో ఊహించని ట్విస్టులు
"వే టు కెప్టెన్సీ... గార్డెన్ ఏరియాలో రెండు ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ లైన్, రెండు రెడ్ లైన్. ట్రైన్స్ ముందు ఉన్న లైన్ స్టేషన్ బౌండరీని సూచిస్తుంది. నాన్ కంటెండర్స్ అందరూ ఆ బౌండరీ వెనుక నిలబడి, బజర్ రాగానే ట్రైన్ డ్రైవర్ సీట్లో కూర్చోవాలి. కంటెండర్స్ మాత్రం తమకు కెప్టెన్ అవ్వడానికి సపోర్ట్ చేసే వ్యక్తులను సపోర్ట్ చేయాలి. మరో బజర్ రాగానే కంటెండర్స్ తనకు నచ్చిన ట్రైన్ లో ఎక్కాలి. అయితే కదిలే ట్రైన్ డ్రైవర్ కెప్టెన్సీ రేసు నుంచి కంటెండర్ ను తొలగించాలి" అనేది టాస్క్. టాస్క్ స్టార్ట్ అయ్యేలోపు గౌరవ్ తో పాటు అందరికీ తనూజాను టాస్క్ నుంచి తొలగించమని చెప్పింది.
మొదటి రౌండ్ లో రామూ, నిఖిల్ కూర్చోగా... రామూ ట్రైన్ కదిలింది. రామూ భరణిని టాస్క్ నుంచి తీసేసాడు. సెకండ్ రౌండ్ లో సాయి ట్రైన్ కదిలింది. అతను ముందుగా దివ్య పేరు చెప్పి, తరువాత డెసిషన్ మార్చుకున్నాడు. రీతూ పేరు చెప్పాడు. "నువ్వు నన్ను రెబల్ గా తీసేసావు. నిన్ను తీస్తున్నా" అన్నాడు. "నువ్వు తీయను అని చెప్పి వెన్నుపోటు పొడుస్తున్నావా? నువ్వు చెప్పినందుకే దివ్యను నమ్మించి ట్రైన్ ఎక్కించాను. ప్రతివారం దివ్యకు సపోర్ట్ చేయడానికే వచ్చావా?" అని ఫైర్ అయ్యింది రీతూ. దీంతో చివరగా దివ్యను సాయి ఈ టాస్క్ నుంచి తీసేసాడు. అంతలోనే "వాళ్లకు సజెషన్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు. నాకెందుకు చేయట్లేదు" అంటూ భరణిపై ఫైర్ అయ్యింది దివ్య.
నిఖిల్ సుమన్ శెట్టిని తీసేశాడు. చివరగా రూల్స్ మార్చారు బిగ్ బాస్. సాయి, రామ్, నిఖిల్ డ్రైవర్స్ అయ్యారు. వాళ్ళు మినహా రెడ్ ట్రైన్ లో ఎక్కడానికి మిగతా వాళ్ళు ట్రై చేయొచ్చు అని చెప్పారు. ఈ టాస్క్ లో తనూజాకు దెబ్బ తగిలింది. దీంతో గేమ్ ను పాజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. రీతూ, కళ్యాణ్ చైర్ కోసం కొట్టుకోగా, మధ్యలో వచ్చి దివ్య కూర్చుంది. అనుకున్నట్టే దివ్య "నా సపోర్ట్ ఇమ్మాన్యుయేల్ కు" అంటూ తనూజాను తీసేసింది. "పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని నన్ను తీసేసింది" అంటూ బోరున ఏడ్చింది తనూజా. హౌస్ మేట్స్ అందరూ ఆమెను సముదాయించారు. "పర్సనల్ రీజన్స్ ఎవరు తెస్తున్నారు చూశారా? ఇలాంటి టైంలో అయినా స్టాండ్ తీసుకోండి" అని అందరి ముందే భరణిపై అరిచింది దివ్య.
దివ్య వర్సెస్ భరణి
కళ్యాణ్ కూడా దివ్యతో మాట్లాడడం మానేశాడు. దీంతో రెండు నాలుకల వ్యవహారం బయట పెట్టింది దివ్య. కళ్యాణ్ లేనప్పుడు అతను చెప్పకముందే కుర్చీలో కూర్చున్నాను అంటుంది. కళ్యాణ్ ముందేమో ఆ టైంలో ఇమ్మూ ఉన్నాడు కాబట్టి నిర్ణయం మార్చుకున్నా అని చెప్పింది. ఇక దివ్య మాట్లాడానికి భరణి దగ్గరకు వెళ్లగా "మీరిద్దరి మధ్య నేనెందుకు స్టాండ్ తీసుకుంటా" అని సీరియస్ అయ్యాడు ఆయన. "ఇంత పర్సనల్ గా ఆడతారా?" అంటూ కళ్యాణ్ దగ్గర దివ్య తీరు చెప్పి బాధ పడ్డారు భరణి. చివరగా 'కౌంట్ ఇట్ క్రాక్ ఇట్' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇమ్మాన్యుయేల్ గెలిచి, మళ్ళీ కెప్టెన్ అయ్యాడు.
Read Entire Article