Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 50 రివ్యూ... మాజీ కంటెస్టెంట్స్ రచ్చ... కొట్టుకోబోయిన రీతూ చౌదరి - దువ్వాడ మాధురి... ఎవ్వరినీ వదలని శ్రీజ దమ్ము
1 month ago 2
ARTICLE AD
"బిగ్ బాస్ ఇల్లు నామినేషన్ సమరానికి సిద్ధమైంది. ఈసారి వీరిలో కొంతమంది తిరిగి ఇంట్లోకి వచ్చి ట్రోఫీ కోసం మీతో పోటీ పడబోతున్నారు. నామినేషన్ లో మీ తలరాత రాయబోతున్నారు" అంటూ ఎక్స్ కంటెస్టెంట్ ప్రియాను లోపలికి పంపారు. "నేషనల్ టెలివిజన్ లో ఒకమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. నిఖిల్ వచ్చాడు కాబట్టి కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. రోడ్డు రోలర్ బాడీ షేమింగ్ చేస్తున్నారు. క్లాస్ అంటే ఏంటి? దువ్వాడ మాధురి - తనూజా విషయంలో ఇన్ సెక్యూర్ అయ్యారు" అని సంజనాను నామినేట్ చేసింది. అలాగే నామినేట్ చేసే పవర్ ను ప్రియా, కళ్యాణ్ కు ఇవ్వగా... ఆయన రామూ రాథోడ్ ను నామినేట్ చేశాడు.
ఆమె వెళ్ళిపోగానే మర్యాద మనీష్ వచ్చి కళ్యాణ్ ను నామినేట్ చేశాడు. "ఇమ్మాన్యుయేల్ ను వెన్నుపోటు పొడిచావ్. ఫిల్టర్ గేమ్ వద్దు. నువ్వు మానిప్యులేట్ అవుతున్నావ్. సోలో గేమ్ ఆడు. నీకు ముద్దు మాటలు చెప్పి, చెవిలో మందార పువ్వులు పెడుతున్నారు" అని చెప్పాడు. అలాగే నామినేషన్ పవర్ ను ఇమ్మాన్యుయేల్ కి ఇచ్చాడు. "అయేషా స్టోన్ కు అర్హురాలా అని అడిగితే, తనూజా అవును అని చెప్పి సేఫ్ ఆడింది. నువ్వు ఒక పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండవు. నేను నిన్ను సపోర్ట్ చేయలేదు అని చెప్పడం బాధగా అన్పించింది" అంటూ తనూజాను నామినేట్ చేశాడు. తనూజా లేచి "2 నాలుకల మాట మాట్లాడుతున్నావ్" అని ఫైర్ అయ్యింది.
ఫ్లోరా సైనీ "నువ్వు ఇంతకుముందు సీజన్లు చూసి వచ్చి, అదే ఫేక్ లవ్ స్టోరీ నడుపుతున్నావ్. ముందు కళ్యాణ్ ను ట్రై చేసావ్. కానీ వర్క్ అవుట్ అవ్వకపోవడంతో డెమోన్ తో ట్రాక్ స్టార్ట్ చేశావ్. తనూజా హెల్త్ బాలేనప్పుడు కళ్యాణ్ ఏడిస్తే నవ్వావు. అయేషా వెళ్ళినప్పుడు కూడా నవ్వావు. ఎంతటి శాడిస్ట్ అయితే అలా ఉంటారు?" అంటూ రీతూ చౌదరిని నామినేట్ చేసింది. కానీ "ఫాల్స్ అలిగేషన్" అని కొట్టిపడేసింది రీతూ.
సుమన్ శెట్టి వర్సెస్ సంజన
ఫ్లోరా సుమన్ శెట్టికి కత్తిని ఇవ్వగా, ఆయన చెత్త బుట్ట గొడవను తీసి సంజనను నామినేట్ చేశాడు.ముందు నోరు జారాను అని ఒప్పుకున్నా సంజన గొడవ పెద్దది అవ్వడంతో మరోసారి నోరు జారింది. "అసమర్థ కెప్టెన్. మీరు చేస్తే నీతులు మేము చేస్తే బూతులు" అంటూ సమర్థించుకుంది. "మీ మాటలతో చచ్చిపోతున్నాం" అంటూ కుండబద్దలు కొట్టాడు సుమన్ శెట్టి. ఆ తర్వాత "సంజనాకు తెలుగు బాగా తెలుసు. తప్పు వర్డ్స్ చెప్పినప్పుడే తెలుగు రాదు అంటుంది. సెన్స్ లేదు, షట్ అప్" అని దువ్వాడ మాధురి మండిపడింది. సంజన ముందు ఫైర్ అయ్యి, తరువాత కుళాయి తిప్పేసింది. దీంతో ఇమ్మూ "డిగ్రెడ్ చేశావ్" అంటూ సంజనాకు తన తప్పును చెప్పాడు. మరోవైపు రీతూ, డెమోన్ కంటెండర్ విషయంలో గొడవ పడ్డారు. "నావల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావ్ కదా. నువ్వు నీ గేమ్ ఆడుకో" అంటూ డెమోన్ అరిచాడు.
తర్వాత "అలా వెళ్తాను అనుకోలేదు. ఇలా వస్తాను అనుకోలేదు. మాధురి గారు ఎలా ఉన్నారు. మీ పేరు మాస్ మాధురా? రాజుగారా? అనేది తెలియట్లేదు. చాలామందిని బయట అడిగాను. నాకే తెలీదు నీకెలా తెలుస్తుంది అన్నారు. తెలియాలని రూల్ లేదు కదా. బాండింగ్స్ బాగున్నాయా? గేమ్ ఆడడానికే వచ్చారా?" అంటూ దువ్వాడ మాధురికి ఇచ్చిపడేసింది శ్రీజ దమ్ము. "లీనియన్స్ ఇస్తున్నారు. చప్పట్లు అన్నది ఎవరో వారితోనే రాజూ రాజూ అంటూ.తిరుగుతున్నారు. తనూజా ఎన్ని రోజులు సపోర్ట్ తో నెట్టుకొస్తారు?" అంటూ తనూజాను కూడా ఓ ఆట ఆడుకుంది శ్రీజ. "ఈ హౌస్ నన్ను డిసప్పాయింట్ చేసిన పర్సన్ కళ్యాణ్. నిన్ను అమ్మాయిల పిచ్చోడు న్ను అన్నవాళ్ళను ఎందుకు నామినేట్ చేయలేదు? తుప్పాస్ నామినేషన్ వేసి సేఫ్ గేమ్ ఆడావు. నీ ప్రొఫెషన్ తీసి మాధురి మాట్లాడింది. నువ్వు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆమె వల్లే గొడవలు అయ్యాయి. తనూజా చెయ్యి వేయమన్నది. ఇప్పుడు ఆమెను నామినేట్ చేస్తే బ్యాడ్ అవుతాను అని సంజనాను నామినేట్ చేశావ్" అంటూ కళ్యాణ్ ను నామినేట్ చేసింది.  అంటూ బయట కల్యాణ్ గురించి ఆడియన్స్ ఏం అనుకుంటున్నారో చెప్పేసింది.
అలాగే ఆ కత్తిని మాధురికి ఇవ్వగా "నువ్వు సపోర్ట్ తో గేమ్ ఆడుతున్నావ్" అంటూ రీతూ చౌదరిని నామినేట్ చేసింది. రీతూ "మీవి బాండ్స్ కాదా ?" అని ప్రశ్నించింది, "మీది అన్ హెల్దీ బాండ్. 24 గంటలు మీ ఇద్దరి గోల టార్చర్" అంటూ నోరు జారింది దువ్వాడ మాధురి. "జాగ్రత్తరా మళ్ళీ బయటకెళ్తే బుర్ర పగలగొడతారేమో" అంటూ శ్రీజ మరింత చిచ్చు రేపింది.
Read Entire Article