వీకెండ్ ఎపిసోడ్ ను దువ్వాడ మాధురి - సాయి శ్రీనివాస్ మధ్య జరిగిన గొడవతో స్టార్ట్ చేశారు నాగార్జున. "నేను లేనప్పుడు నా గురించి మాట్లాడొద్దు. ఆ అమ్మాయి నాపై ఎందుకు లవ్ చూపించట్లేదు అని అడిగింది. అందుకే సాయితో ఆడుకో అని చెప్పాను. బుద్ధి లేదు, నోరు అదుపులో పెట్టుకో" అంటూ మాధురి సీరియస్ అయ్యింది. "నాతో కాకుండా సాయితో ఆడుకోపో అనడం ఇన్ఫ్లుయెన్స్" అని అన్నాడు సాయి. "నేను సాయి మాత్రమే చెప్పాడు అని చెప్పలేదు" అంటూ ప్లేట్ తిప్పేసింది రమ్య.

బ్యాండ్స్ తో ఫేక్ బాండ్స్ బయటకు...
ముందుగా కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ కు కంగ్రాట్స్ చెప్పి, అసలు సిసలైన గేమ్ మొదలెట్టారు నాగార్జున. ముందుగా రమ్య లేచి మాధురికి ఫేక్ బాండ్స్ ట్యాగ్ ఇచ్చింది. "వచ్చినప్పుడు బాండ్స్ వద్దు అన్నది. ఇప్పుడు తనూజాతో అవే బాండ్స్ పెట్టుకుంటోంది. అది కూడా ఫేక్" అని చెప్పింది రమ్య. "బాండ్స్ వద్దు అనుకుంటున్న ఆమె నాతో ఎందుకు బాండ్స్ కోరుకుంటోంది ?" అని ప్రశ్నించింది మాధురి. దీంతో నాగ్ "తనూజాను ఇదే బాండ్ రీజన్ తో నామినేట్ చేశావు. బాండ్ అనుకుని గేమ్ లో వెనకబడుతున్నావు" అని అన్నారు.

"తనూజా నీది మాధురిది ఫేక్ బాండా ? నాన్నను రాజుతో రీప్లేస్ చేశావా?" అని మొహం మీదే అడిగేశాడు నాగ్. తనూజ రియాక్ట్ అవుతూ "నాన్న బాండ్ అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు దగ్గర అవుతున్నారు. ఇది నా గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పాను. ఆమె లేదు నేను జెన్యూన్. నీతోనే ఉంటా అన్నారు" అని చెప్పిందని క్లారిటీ ఇచ్చింది. రమ్యకు తనూజా మానిప్యులేట్ ట్యాగ్ ఇచ్చింది. సాయి - రమ్య - మాధురి గొడవ మిస్ కమ్యూనికేషన్ అంటూ నాగ్ క్లియర్ చేశారు.

ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్
"ఏం ఆడావ్ పవన్?" అంటూ డెమోన్ పై ప్రశంసలు కురించారు నాగార్జున. డెమోన్ "మేము చేస్తే బ్యాక్ స్టాబింగ్, మీరు చేస్తే ఆటనా" అంటూ ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ ను కళ్యాణ్ కు ఇచ్చాడు. "తనూజాను నామినేట్ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు?" అని అడిగాడు నాగార్జున. "రమ్య ఆల్రెడీ పాయింట్స్ చెప్పేసింది. అయేషాను చేస్తానంటే ఇమ్మూ వద్దన్నాడు. లాస్ట్ ఛాన్స్ గా సంజనను నామినేట్ చేశాను" అని చెప్పాడు. "అంటే కూడబలుక్కుని నామినేషన్స్ చేస్తున్నారు. మాట స్లిప్ అయ్యాడని నువ్వు ఫీల్ అయ్యావా ?" అని ఇమ్మాన్యుయేల్ ను అడిగాడు నాగ్.

Also Read: బిగ్‌బాస్ డే 47 రివ్యూ... తనూజాకు హెల్త్ ఎమర్జెన్సీ - గుక్కపెట్టి ఏడ్చిన దువ్వాడ మాధురి... అయేషా అవుట్!

"తనూజాకు కూడా అతను ఆమెను నామినేట్ చేస్తాడని తెలియాలని చెప్పాను. నువ్వు కళ్యాణ్ ను సేఫ్ అంటున్నావు. మరి అదే స్లిప్ ను నీ దగ్గర పెట్టుకుని నువ్వే నామినేట్ చేసి ఉండొచ్చు కదా? నీకు నామినేట్ చేయాలని లేదు. కానీ కళ్యాణ్ తో నామినేట్ చేయించాలని అనుకున్నావ్ నీది సేఫ్ గేమ్" అంటూ కుండబద్దలు కొట్టారు నాగార్జున. తనూజా జెన్యూనా కాదా అనే విషయం గురించి ఇమ్మాన్యుయేల్ మాట్లాడిన విషయాలను వీడియో వేసి మరీ చూపించారు. ఇమ్మాన్యుయేల్ ఫ్లిప్పర్ ట్యాగ్ ను కళ్యాణ్ కి ఇచ్చాడు.

'ఫౌల్ మౌత్డ్' ట్యాగ్ ను రీతూ మధురికి ఇచ్చింది. కెప్టెన్సీ టాస్క్ లో రీతూ చేసింది వెన్నుపోటు అంటూ నాగ్ రీతూ మొహం మీదే చెప్పేశారు. ఇదే సందర్భంలో "మాధురి బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి. బిగ్ బాస్ హౌస్ లో కాదు. ఇలాంటి కఠినమైన పదాలు వాడొద్దు" అంటూ వార్నింగ్ ఇచ్చారు నాగ్. "రామూ నీకు మనిషిలా కనిపించట్లేదా" అని తనుజాని అడిగి, అలా చేయడం కరెక్ట్ కాదని హెచ్చరించారు. సంజన ఇన్ సెక్యూర్ ట్యాగ్ ను మాధురికి ఇచ్చింది.

"ఇది నవ్వే విషయం కాదు రోడ్ రోలర్, లావుగా ఉంది అంటూ దివ్యను అవమానించావు" అంటూ అందరి ముందే సంజనాతో దివ్యకు సారీ చెప్పించారు. అందరికంటే ఎక్కువ బోర్డులు దువ్వాడ మాధురికి వచ్చాయి. డెమోన్, తనూజా, రీతూ, సుమన్ లకు గోల్డెన్ బజర్ గెలుచుకునే టాస్క్ ను రేపు ఇవ్వనున్నారు. అలాగే వాళ్లలో ఒకరు దువ్వాడ మాధురికి పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

Also Read: బిగ్‌బాస్ డే44 రివ్యూ... మాస్ మాధురితో పెట్టుకుంటే మడతడిపోద్ది... హౌస్‌లో కరుడు గట్టిన నేరస్థులు