బిగ్ బాస్ హౌస్ దీపావళి సెలబ్రేషన్స్ తో దద్దరిల్లింది. "గెస్ ది మూవీ" అనే టాస్క్ లో గెలిస్తే ఇంటి నుంచి వీడియో మెసేజ్ ఇస్తానంటూ నాగార్జున హౌస్ మేట్స్ ను రెండు టీములుగా విడగొట్టారు. ఆరెంజ్ టీంకు సుమన్ శెట్టి, పర్పుల్ టీంకు గౌరవ్ లీడర్లుగా వ్యవహరించారు. ఈ టాస్క్ లో పర్పుల్ టీమ్ గెలిచింది. ఆడియన్స్ డిమాండ్ మేరకు స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చి వీడియో కాల్ కోసం రిక్వెస్ట్ చేశాడు సుమన్ శెట్టి. సంజనకు ఆమె భర్త నుంచి వీడియో మెసేజ్ వచ్చింది. అది చూశాక "నా బిడ్డ నవ్వట్లేదు" అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. "డాక్టర్ అజీజ్ నిన్ను బాగా చూసుకుంటాడు కదా. అలాగే బిడ్డను బాగా చూసుకుంటున్నాడు. అమ్మకన్నా నీ బిడ్డకు ఐస్ క్రీమ్ ఎక్కువ" అని చెప్పి సముదాయించాడు నాగ్. "మై క్రాకర్ మై టపాస్... మీ అందరికీ గిఫ్ట్స్ తెచ్చాను. నా ఇంటి ఆడబిడ్డలకు పండుగరోజు చీరలు, అబ్బాయిలకు కుర్తాలు పంపాను" అంటూ హౌస్ మేట్స్ కు దీపావళి గిఫ్ట్స్ ఇచ్చారు.

టాస్క్ లలో సుమన్ శెట్టి టీం ప్రభంజనం
"స్వీట్ ఫైట్" అనే సెకండ్ టాస్క్ పెట్టారు. ఇందులో స్వీట్ ను గెస్ చేసి, పరుగెత్తుకెళ్లి తినాలి. ఈ టాస్క్ లో సుమన్ శెట్టి ఆరెంజ్ టీం విన్ అయ్యింది. గెలిచిన టీం నుంచి డెమోన్ పవన్ కు మెసేజ్ ఇచ్చారు. తరువాత "ఆటాడిస్తా" అనే మూడవ టాస్క్ ఇచ్చారు. ఇందులో కూడా ఆరెంజ్ టీం విన్ అవ్వగా, సుమన్ శెట్టికి ఇంటి నుంచి మెసేజ్ ఇచ్చారు.

సెలెబ్రిటీల స్పెషల్ పర్ఫార్మెన్స్ అదుర్స్
స్టార్టింగ్ లోనే హీరోయిన్ శివాని నాగారం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సింగర్ సాకేత్ పేరడీ సాంగ్స్ లా సెటైరికల్ గా సాంగ్స్ పాడుతూ, పాటల రూపంలో హౌస్ మేట్స్ స్టోరీలు చెప్పాడు. అలాగే "జాటాధార" టీం తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఈ సినిమాలో నటించిన మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ సంచాలక్ గా "డ్యాన్స్ ఫేస్ ఆఫ్" పెట్టారు. నేటి ఎపిసోడ్ లో ఇదే హైలెట్ అని చెప్పొచ్చు. ఇందులో నాగార్జున సోనాక్షి సిన్హాకి ఒక్కొక్కరిని పరిచయం చేశారు. అలాగే హీరో సుధీర్ బాబు కూడా బిగ్ బాస్ హౌస్ లో మెరిశారు. ఈ టాస్క్ లో ఆరెంజ్ టీం గెలిచింది. ఈ టీం నుంచి ఇమ్మాన్యుయేల్ కు ఫ్యామిలీ మెసేజ్ అందించారు. హీరోయిన్ ఆనంది "సూసేకి, సారంగదరియా" సాంగ్స్ కు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చివరగా అప్సర రాణి మాస్ సాంగ్స్ కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.

బోరున ఏడ్చిన తనూజ
"నేను ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇప్పటి వరకూ జరగలేదు. హౌస్ లోకి రాగానే ఎక్కువగా కనెక్ట్ అయ్యింది భరణి గారితోనే. ఆయన ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా, నాన్న లాగా కనెక్ట్ అయ్యారు. అందరూ ఆయన వల్ల గేమ్ పోతుంది, ఆ బాండింగ్ వల్ల వెనక్కి వెళ్తున్నావు, ఆయన వల్ల గెలుస్తున్నావు అని చెప్పడంతో ఎంత ఇష్టం ఉన్నా దూరంగా ఉంటూ వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం చుట్టూ అందరూ ఉన్నా హెవీగా ఉంది" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. " బంధాలు బర్డెన్ కావొద్దు. ముందుకెళ్తావా అక్కడే ఉంటావా? అన్నది నీ ఇష్టం . నీ ఆటతో పాటు మాట బిహేవియర్ క్యారెక్టర్ నిన్ను గెలిపిస్తుంది" అంటూ నాగ్ నచ్చజెప్పారు.

ఈ హౌస్ లో బిట్టర్ మూమెంట్ ఇచ్చిన వాళ్ళకి బిట్టర్ స్వీట్ తినిపించాలనేది నెక్స్ట్ టాస్క్. ఇమ్మాన్యుయేల్ క్లారిటీ మిస్ అవుతోంది అంటూ తనూజకు, సంజన రాముకి ఇచ్చింది. కళ్యాణ్ పవన్ కి, భరణి సంజనాకు, సుమన్ గౌరవ్ కి, దివ్య దువ్వాడ మాధురికి ఇచ్చారు. "మా ఇద్దరి గురించి ఆడియన్స్ కు ఒక క్లారిటీ ఉంది. మా ఇద్దరికీ క్లారిటీ ఉంది. మూడో మనిషికి చాన్స్ ఇవ్వొద్దు" అంటూ కళ్యాణ్ కు, పవన్ అయేషాకు, రీతూ "నమ్మకం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో" అంటూ పవన్ కి, అయేషాకి రామూ, రమ్య గౌరవ్ కి , సాయి దివ్యకి, నిఖిల్ కళ్యాణ్ కి, అయేషా పవన్ కి, గౌరవ్ సుమన్ కి ఇచ్చారు. మాధురి తనకెవరితోనూ బిట్టర్ మూమెంట్స్ లేవని చెప్పింది.

Also Read: భరణి ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటే... 6 వారాల్లో నాన్న జేబులో పడింది ఎంతంటే?

హైపర్ ఆది పెదరాయుడు పాపారాయుడుగా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో పంచాయతీలను పంచులతో తీర్చాడు. ఒక్కో కంటెస్టెంట్ మీద పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్వించాడు ఆది. అలాగే పనిలో పనిగా గేమ్ ఎలా ఆడాలి, ఏమవుతుంది అన్న హింట్స్ కూడా ఇచ్చేశారు.

అసలైన బిట్టర్ మూమెంట్
చివరగా భరణి రామ్ నామినేషన్ లో ఉండగా, "పవర్ అస్త్ర కు ఉన్న పవర్ ను ఉపయోగించి ఒకరిని సేవ్ చేసే చాన్స్ ఉంది. దాన్ని వాడతాడా లేదా అనేది ఇమ్మాన్యుయేల్ ఇష్టం. దానికి 3 పవర్స్ ఉంటాయి. ఈ వీక్ సేవింగ్ పవర్ ఉంది. ఒక్కసారి వాడితే ఆ పవర్ మళ్ళీ రాదు. వాడుతున్నావా లేదా?" అని నాగ్ అడిగారు. దానికి ఇమ్మాన్యుయేల్ రామూ కోసం వాడతా అని తేల్చేశాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు.

Also Read: దివ్వెల మాధురికి నిద్ర లేకుండా చేస్తున్న కెప్టెన్ కళ్యాణ్ - అర్ధరాత్రి ఆ ముగ్గురి గూడుపుఠాణి... గుట్టు రట్టు చేసిన తెలుగు హీరో