Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 35 రివ్యూ... శ్రీజను బలి పశువును చేసిన బిగ్ బాస్... వైల్డ్ కార్డుల వైల్డ్ డెసిషన్... కొత్త కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?
1 month ago 2
ARTICLE AD
"బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ వైల్డ్ ఎంట్రీలతో కొత్త చాప్టర్ మొదలు కానుంది. కానీ ముందుగా ఎవిక్షన్ పూర్తి చేద్దాం" అంటూ డైరెక్ట్ గా హౌస్ లోకి తీసుకెళ్లారు నాగార్జున. రీతూ - ఫ్లోరాలలో ఫ్లోరాను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేషన్ కు ముందు తాను సంజనను మిస్ అవుతానని కన్నీరు పెట్టుకుంది ఫ్లోరా. పవన్ ను మిస్ అవుతాను అంటూ రీతూ కుళాయి తిప్పేసింది. లక్స్ పాప వెళ్తూ వెళ్తూ సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్, శ్రీజ దమ్ముకి థంబ్స్ అప్... భరణి, తనూజ, సుమన్ శెట్టికి థంబ్ డౌన్ ఇచ్చింది. ఆమెకు గుడ్ బై చెప్పాక వైల్డ్ కార్డు ఎంట్రీలు మొదలయ్యాయి.
ఫైర్ స్టార్మ్ ఎంట్రీతో కొత్త చాప్టర్ స్టార్ట్
మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య) స్పెషల్ పర్ఫార్మెన్స్ తో అడుగు పెట్టింది. తనకు బయట ఒక స్ట్రీట్ డాగ్ షెల్టర్ ఓపెన్ చేసి, అమల అక్కినేని చేత ఓపెన్ చేయించాలనే కోరిక ఉందంటూ నాగ్ ముందు ఓపెన్ అయ్యింది. బ్యూటిఫుల్ ఏవీలో తన స్టోరీ చెప్పింది. అందులో పికిల్స్ కాంట్రవర్సీ కూడా ఉంది. ఆమె చేతికి లగ్జరీ ఫుడ్ పవర్ ను ఇచ్చి హౌస్ లోపలికి పంపారు. ఎప్పుడంటే అప్పుడు ఎవరికి కావాలంటే వాళ్లకు దీని ద్వారా ఇష్టమైన ఫుడ్ పెట్టొచ్చు. 5 రకాల పచ్చళ్ళు ఎవరికి సూట్ అవుతాయి చెప్పమంటే... ఓవర్ యాక్టింగ్ అనే పికిల్ ను శ్రీజకు, సెల్ఫిష్ డెమోన్, సేఫ్ గేమ్ భరణి, ఫేక్ దివ్య నికిత, మానిప్యులేటర్ రామూ రాథోడ్ కి ఇచ్చింది రమ్య.
సెకండ్ వైల్డ్ కార్డ్ శ్రీనివాస్ సాయి. నాగార్జునతో 'కేడీ', 'ఊపిరి' సినిమాలు చేశాడు. "లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా?" అనే డైలాగ్ ను సంజనాకు నేర్పించమన్నారు. అలాగే బ్లూ స్టోన్ ఇచ్చి, ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. అదే టైంలో "స్టిక్ ఇట్ టు విన్ ఇట్" అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో సంజనను సేవ్ చేశారు వైల్డ్ కార్డ్స్.
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న దువ్వాడ మాధురి మూడవ వైల్డ్ కార్డు ఎంట్రీ. శ్రీనివాస్ తో పరిచయం గురించి ఏవీలో వెల్లడించింది. కాగా సౌత్ లో ఉన్న బిగ్ బాస్ హోస్ట్ లు అందరూ ఒక్కొక్క వైల్డ్ కార్డుకు ఒక్కో స్టోన్ ఇచ్చారు. కన్నడ బిగ్ బాస్ నుంచి హోస్ట్ కిచ్చ సుదీప్ మాధురికి గోల్డెన్ బజర్ సూపర్ పవర్ ఇచ్చారు. దీంతో ఎలిమినేషన్ నుంచి ఎవరినైనా సేవ్ చేయొచ్చు.
ఫోర్త్ కాంటెస్టెంట్ నిఖిల్ నాయర్. ఇతనికి మలయాళం బిగ్ బాస్ హోస్ట్ మోహన్ లాల్ పింక్ స్టోన్ తో డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే పవర్ ఇచ్చారు. ప్రస్తుత కెప్టెన్ కళ్యాణ్ ను కన్విన్స్ చేసి, కెప్టెన్ బ్యాండ్ ను స్టోర్ రూంలో పెట్టించాలనే టాస్క్ ఇచ్చారు. కానీ ఆయన అందులో ఫెయిల్ అయ్యారు. "క్యాచ్ ది స్టిక్ టాస్క్"లో రీతూ సేవ్ అయ్యింది.
నెక్స్ట్ వైల్డ్ కార్డు అయేషా. ఆమెకు తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి డైరెక్ట్ నామినేషన్ పవర్ ఇచ్చారు. "మీరు లేకపోతే ఈ హౌస్ లేదు" అంటూ ఆవిడ ఇమ్మాన్యుయేల్ కి హార్ట్ ఇచ్చింది. అంతలో "డ్యూడ్" టీం నుంచి ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు బిగ్ బాస్ వేదికపై కాసేపు సందడి చేసింది. చివరి వైల్డ్ కార్డు గౌరవ్ గుప్తా. అతనికి బిగ్గెస్ట్ బిగ్ బ్లెస్సింగ్ పవర్ ఇచ్చారు నాగ్. బిగ్ బాస్ ను డైరెక్ట్ గా సలహా అడిగే అవకాశం ఇచ్చారు దీంతో.
వైల్డ్ కార్డు చేతుల్లో శ్రీజ బలి
చివరగా ఎలిమినేషన్ ను వైల్డ్ కార్డ్స్ చేతుల్లో పెట్టారు నాగ్. అందరూ కలిసి శ్రీజను ఎలిమినేట్ చేశారు. డెమోన్ ఫ్రెండ్, భరణి ఎనిమీ, కళ్యాణ్ ట్రస్ట్, సంజన రియల్, సుమన్ శెట్టి వీక్, దివ్య ఫేక్, ఇమ్మాన్యుయేల్ స్ట్రాంగ్, రీతూ - తనూజ - రామూ గుడ్ అని చెప్పి గుడ్ బై చెప్పేసింది శ్రీజ.
Read Entire Article