Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 31 రివ్యూ - శ్రీజపై దివ్య పర్సనల్ గ్రడ్జ్... వరస్ట్ ప్లేయర్ కళ్యాణ్... ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే!
1 month ago 3
ARTICLE AD
డబుల్ ఎలిమినేషన్లు, వైల్డ్ కార్డు ఎంట్రీ ట్విస్టులతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఇప్పటికే ఇమ్యూనిటీని గెలుచుకున్న ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ రామూ రాథోడ్ తప్ప మిగిలిన వారంతా ఎలిమినేషన్ డేంజర్ నుంచి తప్పించుకోవడానికి ఫైట్ చేస్తున్నారు. తాజాగా డే 31 ఎపిసోడ్ 32లో బిగ్ బాస్ మరిన్ని ఆసక్తికరమైన టాస్కులు పెట్టారు. నిన్న ఫౌల్ గేమ్ ఆడి, బిగ్ బాస్ ఆగ్రహానికి కంటెస్టెంట్స్ లోనైన సంగతి తెలిసిందే.
మిడ్ నైట్ శ్రీజపై మిరియాలు నూరిన దివ్య
"ఆమె గెలవడం కోసం పక్క వాళ్ళను ముంచేస్తుంది" అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది దివ్య. అర్ధరాత్రి ఒక్కతే కూర్చుని శ్రీజ గురించి మాట్లాడింది. ఉదయాన్నే నైట్ జరిగిన గేమ్ గురించి అందరూ డిస్కస్ చేసుకున్నారు. ఇమ్మాన్యుయేల్ తో సంజన మాట్లాడుతూ "దివ్య వచ్చాక నన్ను పక్కన పెట్టేశాడు. అది మండింది. ఆయనను చాలా మాటలు అన్నాను. ఇప్పుడు సారీ చెప్పినా ఆ బాండ్ మళ్ళీ కుదురుతుందో లేదో" అంటూ బాధ పడింది. చికెన్ విషయంలో శ్రీజ, రామూ మధ్య చిన్న వివాదం నడిచింది. మరోవైపు కళ్యాణ్ తో తనూజ తనకు కావలసినవాకి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పింది. దీంతో కళ్యాణ్ హర్ట్ అయ్యాడు.
తప్పులను సరిదిద్దుకోవడానికి మరో అవకాశం ఇస్తున్నాను అంటూ బిగ్ బాస్ "మ్యాచ్ ఇట్ విన్ ఇట్" అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే జంటలుగా ఉన్న పార్టనర్స్ లో ఒకరు యాక్టివిటీ ఏరియాలో టేబుల్ పై ఉన్న వస్తువును చూసి, లివింగ్ రూమ్ లోకి వచ్చి దాని బొమ్మ గీయాలి. మరో పార్టనర్ ఆ వస్తువును తీసుకుని రావాలి. ఇదీ ఈరోజు ఫస్ట్ టాస్క్. ఇందులో భరణి టీం ఫస్ట్, సంజన టీం సెకండ్, సుమన్ శెట్టి టీమ్ మూడవ స్థానంలో, 4వ స్థానంలో డెమోన్, 5వ స్థానంలో కళ్యాణ్ నిలిచారు. ఈ టాస్క్ లో ఆఖరి ప్లేస్ లో నిలిచిన తనూజ - పవన్ కు జీరో పాయింట్స్ వచ్చాయి.
వరస్ట్ ప్లేయర్ పట్టం ఆ ఇద్దరికే
డేంజర్ జోన్ లో ఉన్న సభ్యులకి "హోల్డ్ ఇట్ లాంగ్" అనే టాస్క్ పెట్టారు. ఇందులో ఒక్కో జంట రెండు వైపులా తాళ్ళు పట్టుకుని, ప్లాట్ ఫామ్ నేలకి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. సంచాలక్ లు ఇమ్మాన్యుయేల్, రాము తమకు నచ్చిన కంటెస్టెంట్ ప్లాట్ ఫాంపై ఇసుక సంచులు వేస్తారు. ఈ టాస్క్ లో డెమోన్, కళ్యాణ్, భరణి, సంజన, సుమన్ టీంలు వరుసగా 1 నుంచి 5 స్థానాల్లో నిలిచారు. ఈ టాస్క్ ల తర్వాత లీడర్ బోర్డులో భరణి - దివ్య 180 పాయింట్స్, సంజన - ఫ్లోరా 180, రీతూ -డెమోన్ 190, కళ్యాణ్ - తనూజ 110 పాయింట్స్, సుమన్ శెట్టి - శ్రీజ 90 పాయింట్స్  తో ఉన్నారు.
నెక్స్ట్ తనూజ - కళ్యాణ్, శ్రీజ - సుమన్ లలో వరస్ట్ ప్లేయర్ ఎవరో మిగతా హౌస్ మేట్స్ ను ఒపీనియన్ చెప్పమన్నారు బిగ్ బాస్. కళ్యాణ్, సుమన్ లు వరస్ట్ అని తేల్చారు హౌస్ మేట్స్. దివ్య టీం, ఇమ్మాన్యుయేల్ -రామూ మాత్రం శ్రీజ వరస్ట్ అని చెప్పారు. దీంతో కావాలనే ఇటు తనూజతో కళ్యాణ్, అటు సుమన్ తో శ్రీజ టీంగా కలిసిన ప్లాన్ బెడిసికొట్టింది. "నీ వల్ల స్ట్రాటజీ వాడి, అందరూ మారిపోయారు" అంటూ దివ్య చెప్పిన పాయింట్ పై శ్రీజ ఫైర్ అయ్యింది. "పర్సనల్ గ్రడ్జ్ వల్లే ఇలా చెప్తున్నావ్" అని మండిపడింది. దివ్య కూడా ఏమాత్రం తగ్గలేదు.
Read Entire Article