Bigg Boss 9 Telugu : దివ్వెల మాధురికి నిద్ర లేకుండా చేస్తున్న కెప్టెన్ కళ్యాణ్ - అర్ధరాత్రి ఆ ముగ్గురి గూడుపుఠాణి... గుట్టు రట్టు చేసిన తెలుగు హీరో

1 month ago 2
ARTICLE AD

Bigg Boss Telugu 9 Latest Episode Review: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాక గ్రూప్ గేమ్ ఆడడం అన్నది సర్వసాధారణం. కానీ అలా ఆడిన వాళ్ళనే టార్గెట్ చేస్తుంటారు మిగిలిన వాళ్ళు. ఎందుకంటే ఫేవరిజం పేరుతో మిగతా వాళ్ళకు అన్యాయం జరుగుతుందన్నది వాళ్ళ వాదన. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో అదే జరుగుతోంది. రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ గ్రూప్ గేమర్స్ పైనే దృష్టి పెట్టి, గేమ్ గేర్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నట్టే కన్పిస్తోంది. కానీ తాజాగా జరిగిన పరిణామం ఒకటి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందులో కెప్టెన్ కళ్యాణ్ ఉండడం మరింత ఆసక్తికరంగా మారింది.

అర్దరాత్రి గుసగుసలు.. ఉదయాన్నే గుస్సా
తాజా ఎపిసోడ్ లో "వాళ్లకు నిద్ర రాకపోతే అందరికీ నిద్ర రానివ్వకుండా చేస్తే ఎలా?" అంటూ ఉదయాన్నే కసురుకుంది మాధురి. నిజానికి ముందురోజు అర్దరాత్రి పికిల్స్ రమ్య, దివ్వెలా మాధురి హౌస్ నుంచి బయటకొచ్చి, బయట ముచ్చట్లు పెడుతున్న వాళ్ళ దగ్గర కూర్చున్నారు. అక్కడికెళ్ళి హౌస్ లో కెప్టెన్ అండ్ టీం పెట్టిన మిడ్ నైట్ టాక్ తో నిద్ర రావట్లేదు అంటూ గుస్సా అయ్యారు. ఇక్కడితో ఆ టాపిక్ అయిపోలేదు. "కప్పు కోసం కెప్టెన్ తో పాటు ఆ ఇద్దరి గూడుపుఠాణి" అంటూ కళ్యాణ్ గుట్టు రట్టు చేశాడు తెలుగు హీరో శ్రీనివాస్ సాయి.

తనూజ ఆటలో అరటి పండేనా ?
వాష్ రూమ్ లో "కెప్టెన్ కెప్టెన్ లాగా ఉండట్లేదు. కళ్యాణ్ - డెమోన్ - రీతూ చౌదరి కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ల వల్ల నిద్ర పట్టలేదు. అయేషా రాముతో ఏం.మాట్లాడింది? అన్న విషయంలో నిద్ర పట్టట్లేదు వాళ్లకి. అందరినీ పంపించేసి టాప్ 3లో వాళ్ళే ఉండాలన్నది వాళ్ళ ప్లాన్. మనందరినీ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. తనూజ లైట్ వాళ్ళకి. అయితే దివ్య, తనూజ కూడా వాళ్ళ బ్యాచే. వాళ్ళు ఉన్నప్పుడు ఏం మాట్లాడుకోకండి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి" అంటూ నిఖిల్ - అయేషాలను శ్రీనివాస్ హెచ్చరించాడు. ఇంకేముంది అది మనసులో పెట్టేసుకుని, కాసేపటికే రీతూతో అంట్ల గొడవేసుకుని, హౌస్ లో అల్లకల్లోలం సృష్టించింది అయేషా.

ఇందులో "తనూజ వాళ్ళకి లైట్" అంటూ శ్రీనివాస్ స్టేట్మెంట్ ఇవ్వడం కొసమెరుపు. దీంతో తనూజ ఆటలో అరటి పండేనని తేలిపోయింది. ఆమెకు దగ్గరైన వాళ్ళంతా నిజానికి దూరమే మెయింటైన్ చేస్తున్నారు. భరణి - తనూజ మధ్య ఫేక్ బాండింగ్ నడుస్తోంది. ఆ బంధం త్వరలోనే బరస్ట్ అవుతుంది. సోల్ ఫ్రెండ్ అనుకున్న రీతూ కెప్టెన్ టాస్క్ గొడవ కారణంగా దూరమైంది. ఇమ్మాన్యుయేల్ గోడ మీద పిల్లిలా అటూ ఇటుగా ఉన్నాడు. నామినేషన్స్ తో సుమన్ దూరమయ్యాడు. మిగిలింది కళ్యాణ్. కానీ కెప్టెన్ మిడ్ నైట్ కప్పు కోసం రీతూ - డెమోన్ తో మీటింగ్ పెట్టడం చూస్తుంటే తనూజను పక్కన పెట్టేసినట్టే కన్పిస్తోంది. మరి ఈ గ్రూప్ పై బిగ్ బాస్ ఫోకస్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Entire Article