Bigg Boss 9 Telugu- Day 7 Episode 8 Review: బిగ్ బిస్ సీజన్ 9లో డే 7, ఆదివారం జరిగిన ఎపిసోడ్‌ ఆసక్తికరంగానే సాగింది. ముఖ్యంగా మొదటి వికెట్‌గా శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ముగ్గురు కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నట్లుగా చెప్పి, సుమన్ శెట్టిపై బిగ్ బాంబ్ పేల్చింది. మరో వైపు భరణికి బంపరాఫర్‌ను బిగ్ బాస్ ఇచ్చారు. అసలు ఆదివారం ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

‘మీనూ’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అస్సలు ఆలస్యం చేయకుండా, వెంటనే మన టీవీకి కనెక్ట్ అయ్యారు. హౌస్‌లోని వారితో లవ్ సింబల్ చూపిస్తూ.. శనివారం మిగిలిపోయిన బాక్స్‌లు వంతు చూద్దామని గేమ్‌లోకి వెళ్లిపోయారు. అంతకు ముందే టైమ్ ఫర్ సేవింగ్ అంటూ.. ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్న ఒక్కొక్కరి పేరు చూపిస్తూ, అన్ సేఫ్ అని చెబుతూ.. రాము రాథోడ్, సంజన సేఫ్ అని ప్రకటించారు. అనంతరం తనూజను పిలిచి ఒక నెంబర్ కోరుకోమని బాక్స్ ఓపెన్ చేశారు. ఆ బాక్సులో ఎంప్టీ వచ్చింది. దీంతో మీకు ఏమైనా హౌస్‌లో ఇష్యూస్ ఉన్నాయేమో? అనేది డిస్కస్ చేయాలని చెప్పారు. ఇష్యూస్ ఏమీ లేవని తనూజ చెప్పింది. నెక్ట్స్ శ్రష్టి తనకున్న ఇష్యూస్ చెప్పింది. తిండి విషయంలో తనకున్న ఇష్యూని నాగ్‌కు చెప్పింది శ్రష్టి వర్మ. మనీష్, ప్రియ ఈ విషయంలో తమ వాదనలు వినిపించారు. బనానా, యాపిల్ ఇష్యూపై డిస్కషన్ నడిచింది.

Also Read: బిగ్‌ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?

సంజన లేచి కెప్టెన్‌గా నేను చెప్పింది ఎవరూ వినడం లేదని నాగ్‌కు కంప్లయింట్ ఇచ్చింది. థమ్సప్ ఎవరు తీసుకున్నారో కనిపెట్టలేకపోయావంటూ కింగ్ నాగ్ కామెడీ చేశారు. హౌస్‌లో దొంగతనం స్టార్ట్ చేసిందే నువ్వంటూ సంజనను కూర్చోపెట్టాడు నాగ్. శ్రీజ దమ్ము లేచి నాకు ఇష్యూస్ ఉన్నాయని చెబుతూ.. నా వాయిస్ చాలా పెద్దగా ఉంటుంది. దానికి ఇరిటేట్ అయితే నేనేం చేయలేనని చెప్పింది. హరీష్‌తో తనకున్న ఇష్యూ కూడా చెప్పింది. సంజన లేచి నా రూమ్ నుంచి 20కి పైగా వస్తువులు పోయి ఉంటాయంటే.. అయితే నువ్వు కెప్టెన్సీ సరిగా చేయడం లేదని నాగ్ అన్నారు. ఏదైనా వస్తువు పోయినప్పుడు బిగ్ బాస్ నాకు చెప్పే విధంగా ఉండాలని సంజన అంటే.. అలా అయితే నువ్వు గుడ్డు కొట్టేసినప్పుడే చెప్పేవాడు కదా.. అనగానే సంజన సారీ చెప్పింది.

అనంతరం తనూజ లేచి మరో బాక్స్ నెంబర్ 1 చెప్పింది. ఆ బాక్సులో బనానా వచ్చింది. తనూజ అరటిపండు దొంగిలించి ఏమేం చేసిందో వీడియోలో చూపించారు. ప్రియా తన గురించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయగా.. అందరూ దొంగలే అంటూ నాగ్ తేల్చేశారు. థమ్సప్ దొంగిలించింది నేనేనంటూ హరీష్ చెప్పారు. దానిలో ప్రియా ఎలా ఇన్వాల్వ్ అయ్యిందో వీడియోలో చూపించారు. టైమ్ ఫర్ అనదర్ సేవింగ్ అని సుమన్ శెట్టిని స్టోర్ రూమ్‌కు పంపించారు. ఎలిమినేషన్ లిస్ట్‌లో మిగిలిన వారందరికీ షాంపూ బాటిల్స్ ఇచ్చి.. అక్కడ ఉన్న ఫిష్ బాటిల్లో ఆ షాంపూని పోయమన్నారు. రెడ్ వస్తే అన్ సేఫ్, గ్రీన్ వస్తే సేప్ అని చెప్పారు. ఇమ్మానుయేల్ సేఫ్ అయినట్లుగా ప్రకటించారు. అనంతరం ‘మిరాయ్’ టీమ్ కాసేపు సందడి చేసింది.

Also Read: బిగ్ బాస్ షోలో ఫస్ట్ వికెట్ అవుట్ - ఆమెకు నెగెటివిటీ ఈ రేంజ్‌లో ఉందా?

‘మిరాయ్’ టీమ్ వెళ్లిన తర్వాత మళ్లీ టైమ్ ఫర్ సేవింగ్ అంటూ.. నామినేషన్స్‌లో మిగిలి ఉన్న వారిని నిలబెట్టారు. పంజరాలు, బర్డ్స్ తెప్పించి.. ఎవరు ఫ్రీ బర్డ్ అయితే వాళ్లు సేఫ్ అని తెలిపారు. ఫ్లోరా సైనీ సేఫ్ అయింది. వెంటనే మరో సేవింగ్ జరిగింది. క్యారేజ్ బాక్స్‌లో తెప్పించి వాటిలో రెడ్ రైస్ వస్తే అన్‌ సేఫ్ అని, గ్రీన్ రైస్ ఉంటే సేఫ్ అని చెప్పారు. రీతూ చౌదరి, సుమన్ శెట్టి సేఫయ్యారు.

టెనెంట్స్ అందరినీ లీవింగ్ రూమ్‌లోకి పిలిచి.. ఈ వారం ఎదుర్కొన్న అగ్ని పరీక్ష ఆధారంగా ఓనర్ అయ్యే అవకాశాన్ని కల్పించారు. కన్వయిన్ బెల్ట్‌పై వచ్చే పేపర్లకు స్టాంప్ వేసి, బ్యాలెట్ బ్యాక్స్‌లో వేసే టాస్క్ విధించారు. ఈ టాస్క్‌లో భరణి టీమ్ గెలిచింది. ఓడిపోయిన్ టీమ్‌తో పాటు సంచాలక్ కలిసి గెలిచిన నలుగురిలో ఒకరిని పర్మినెంట్ ఓనర్‌గా ఎన్నుకున్నారు. అందులో నాలుగు ఓట్లు భరణికి పడ్డాయి. భరణి పర్మినెంట్ ఓనర్‌గా బంపర్ ఆఫర్ కొట్టేశారు.

Power struggle alert! 👁️🔥
Tenants lo nunchi Owner ayye avakasam evaridhi? 👀💣

Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/5ELkeIhFfq

— Starmaa (@StarMaa) September 14, 2025

టైమ్ ఫర్ ఎలిమినేషన్.. మిగిలిన ఇద్దరు పవన్, శ్రష్టిలను యాక్టివిటీ రూమ్‌కు రమ్మని, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ డ్యాన్స్ చేసే వారి డ్రస్‌పై ఎవరి బొమ్మ అయితే ఉంటుందో వారు సేఫ్ అని నాగ్ ప్రకటించారు. సాంగ్ చివరిలో పవన్ ఫొటో కనిపించగానే.. అతను సేఫ్ అని చెప్పి, శ్రష్టిని డ్యాన్సర్స్ తీసుకెళ్లిపోయారు. పవన్ సేఫ్, శ్రష్టి ఎలిమినేటెడ్ అని నాగ్ ప్రకటిస్తూ.. ఆమెను స్టేజ్‌ మీదకు పిలిచారు.

దీంతో ఈ సీజన్ ఫస్ట్ వికెట్‌గా శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. స్టేజ్ మీదకు వచ్చిన శ్రష్టికి నాగ్ ఓ టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో జెన్యూన్‌గా ఉన్న నలుగురు కంటెస్టెంట్స్ ఎవరు? కెమెరా ముందు యాక్ట్ చేస్తున్న నలుగురు ఎవరు? అని అడగగా.. రాము రాథోడ్, మర్యాద మనీష్, హరీష్, ఫ్లోరా సైనీ‌లను జెన్యూన్‌ పర్సన్స్‌గా శ్రష్టి చెప్పింది. రీతూ, తనూజ, భరణి.. కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నట్లుగా చెప్పింది. భరణి గురించి చెబుతూ శ్రష్టి ఎమోషనల్ అయింది. సుమన్ శెట్టిపై బిగ్ బాంబ్ పేల్చింది.. తన క్లీనింగ్ పని సుమన్ శెట్టికి అప్పగించింది. అనంతరం భరణికి టెనెంట్స్ నుంచి ఓ అసిస్టెంట్‌ను ఎన్నుకునే అవకాశం కల్పించగా, తనూజని భరణి ఎన్నుకున్నారు. ఈ విధంగా ఆదివారం ఎపిసోడ్ జరిగింది. మొత్తంగా ఈ సండే బిగ్ బాస్ బాగానే అలరించింది అని చెప్పవచ్చు.

Also Read: బిగ్ బాస్ ఎపిసోడ్ 6 రివ్యూ... డ్రింక్ చుట్టూ తిరిగిన కథ, నవ్వు రాని టాస్క్... బోరింగ్ ఎపిసోడ్