Bigg Boss 10 Telugu Contestants 2026: తెలుగులో 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' సీజన్ 2 ప్రారంభమే వివాదాలకు దారి తీసింది. నవదీప్, బిందు మాధవి అవమానించారని ఉప్పల్ బాలు విమర్శల వర్షం కురిపించారు. తన ఆవేదన వ్యక్తం చేశారు. అతని బాటలో మరికొందరు సైతం జడ్జీలు పక్షపాతం చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఓ అడుగు ముందుకు వేసిన మరికొందరు 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లో రికమండేషన్ బ్యాచ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తుందని ఆరోపించారు. ఈ తరుణంలో 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళేది ఎవరు? అనే డిస్కషన్ మొదలైంది. కంటెస్టెంట్ల లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఓ యంగ్ అండ్ హ్యాపెనింగ్ ఫిమేల్ యాంకర్ పేరు కూడా ఉంది. దాంతో ఆ అమ్మాయి ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

'బిగ్ బాస్'కి వెళ్ళడం లేదు - యాంకర్ ఛర్మిల
'చెన్నై లవ్ స్టోరీ' ప్రెస్‌ మీట్‌తో యాంకర్ ఛర్మిల పాపులర్ అయ్యారు. ''ఈ మధ్య యాంకర్లు కూడా హీరోయిన్లలా అయిపోతే ఎలా?'' అనడం మాత్రమే కాదు... ''నెక్స్ట్ పిక్చర్‌లో యాక్ట్ చేస్తావా?'' అని ఆఫర్ కూడా ఇచ్చారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది.

'అగధ' ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌లో ''మా సినిమాలో కూడా ఆఫర్ ఇస్తున్నా. హీరోయిన్‌గా ముందు అల్లు అరవింద్ గారి సినిమా చేస్తావా? నా సినిమా చేస్తావా?'' అని దర్శక నిర్మాత ఎంఎస్ రాజు అడిగారు. అందుకు బదులుగా ''అందరి సినిమాలకు నేను యాంకరింగ్ చేయాలని కోరుకుంటున్నాను'' అని సమాధానం ఇచ్చి మరోసారి ఛర్మిల వైరల్ అయ్యారు.

RJ Charmila On Bigg Boss 10 Telugu: ఇప్పుడు ఛర్మిలకు ప్రేక్షకులలో, సోషల్ మీడియా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకుని 'బిగ్ బాస్' తెలుగు 10కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారని ప్రచారం మొదలైంది. 'బిగ్ బాస్ 10' ఇంటిలోకి ఛర్మిల వెళతారని కథనాలు వెలువడ్డాయి. దాంతో ఆ అమ్మాయి క్లారిటీ ఇచ్చారు.

Also Read: Brahmanandam Brother Sri Vadan Viral Video - అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్

''నేను 'బిగ్ బాస్ 10'లో పార్టిసిపేట్ చేస్తానని, ఆ ఇంటిలో కంటెస్టెంట్‌గా అడుగు పెడతానని వస్తున్న వార్తలు ఫేక్. అది ఫేక్ న్యూస్. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే... చాలా మంది నన్ను అడుగుతున్నారు. నేను 'బిగ్ బాస్'కు వెళ్ళడం లేదు'' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో యాంకర్ ఛర్మిల పేర్కొన్నారు.

Also Read: NTR Pet Bagheera Passed Away - దుఃఖంలో ఎన్టీఆర్ కుటుంబం... వాళ్ళను విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్ళిన 'భగీర'

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 'బిగ్ బాస్' 10 మొదలు కానుంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి షో హోస్ట్ చేయనున్నారు. 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష నుంచి ఐదారు మందిని ఇంటిలోకి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కూడా వంద రోజుల పాటు రియాల్టీ షో సాగుతుందని సమాచారం అందుతోంది. మరి ఆ ఇంటిలో ఎవరెవరు అడుగు పెడతారో చూడాలి. వెయిట్ అండ్ సి.

Also Read: NTR Trivikram Movie Title - గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్