భారత మార్కెట్‌లో మిడ్-సైజ్ SUVలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కార్ల కంపెనీలు సైతం ఆ డిమాండ్ తగ్గట్లుగా వేరియంట్లను రిలీజ్ చేస్తున్నారు. మిడ్ సైజ్ ఎస్‌యూవీలు పవర్‌ఫుల్ లుక్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, మెరుగైన భద్రత, సౌకర్యవంతమైన క్యాబిన్ ఫ్యామిలీ జర్నీకి మంచి SUV లగా భావిస్తున్నారు. ఎందుకంటే వాటిలో ఎక్కువ స్థలం ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణాలలో సౌకర్యవంతంగా ఉంటుంది. వీటి నిర్వహణ కూడా సెడాన్‌లతో పోలిస్తే ఎక్కువ ఖరీదు కాదు. మీ బడ్జెట్ రూ.15 లక్షల వరకు ఉంటే, ఈ రేంజ్ అనేక SUVలు ఉన్నాయి. ఇవి మైలేజ్, ఫీచర్లు, భద్రతతో కలిపి బెస్ట్ బ్యాలెన్స్‌డ్ కారుగా కనిపిస్తున్నాయి.

హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta)

Hyundai Creta చాలా సంవత్సరాలుగా మిడ్-సైజ్ SUV విభాగంలో అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటోంది. దీని ప్రారంభ ధర దాదాపు 10.80 లక్షలు. కాగా, Creta పెట్రోల్, డీజిల్, టర్బో పెట్రోల్ మూడు ఇంజిన్ వేరియంట్ ఎంపికలను కలిగి ఉంది. డీజిల్ వేరియంట్ దాదాపు 19 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఫ్యామిలీ జర్నీకి ఆల్ రౌండర్‌గా పనిచేస్తుంది.

కియా సెల్టోస్ (Kia Seltos)

Kia Seltos స్టైల్, లేటెస్ట్ ఫీచర్‌లను కోరుకునే వారి కోసం బెస్ట్ అని చెప్పవచ్చు. దీని ధర రూ.11 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉంది. మైలేజ్ దాదాపు 17– 19 kmpl వరకు ఉంటుంది. డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ADAS దీనికి ప్రీమియం అనుభూతిని ఇస్తాయి.

మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)

మీరు మైలేజ్, తక్కువ నిర్వహణపై దృష్టి పెడితే, Grand Vitara మంచి ఎంపికగా చెప్పవచ్చు. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌లో, ఈ SUV దాదాపు 28 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర 10.80 లక్షలు. ఇది హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్, CNG వేరియంట్స్ కూడా కలిగి ఉంది. ఇది కుటుంబానికి పొదుపుగా చేస్తుంది.

Mahindra XUV 7XO

Mahindra XUV 7XO ఎక్కువ శక్తి, భద్రతను కోరుకునే వారి కోసం బెస్ట్ కారు. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉంది, ఇవి రెండూ శక్తివంతమైన పనితీరును అందిస్తాయి. ఈ SUV 6, 7-సీటర్ ఎంపికలలో వస్తుంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ADAS, మల్టీ-స్క్రీన్ డాష్‌బోర్డ్, స్ట్రాంగ్ బాడీ దీనిని కుటుంబ ప్రయాణాలకు సురక్షితంగా చేస్తాయి.

టాటా సియెర్రా (Tata Sierra)

గురించి తెలుసుకోవాలి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద బూట్ స్పేస్, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లను కలిగి ఉంది. టాటా మోటార్స్ భద్రత, తక్కువ నిర్వహణ వ్యయం దీనిని మీ డబ్బుకు విలువైన SUVగా చేస్తాయి.

Also Read: EV Cars and Two Wheelers: ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. నిర్మలమ్మ ప్రకటనతో దిగిరానున్న ధరలు