Best Films to Watch on Christmas : మరికొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ కానున్నాయి. వణుకు పుట్టించే చలిలో ఇప్పటి నుంచే క్రిస్మస్ కోసం ఎదురుచూస్తున్నారు చాలామంది. ఇక ఈ క్రిస్మస్ వేడుకలను ఇంట్లోనే కూర్చుని జరుపుకోవాలని ఆలోచించే మూవీ లవర్స్... ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రిస్మస్ స్పెషల్ సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి. క్రిస్మస్ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే కొన్ని ఆహ్లాదకరమైన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రెడ్ వన్

మీరు యాక్షన్ మూవీ లవర్స్ అయితే గనక క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీని తప్పకుండా చూడండి. డ్వేన్ జాన్సన్, క్రిస్ ఎవాన్స్ కలిసి నటించిన 'రెడ్ వన్' మూవీలో క్రిస్మస్ మ్యాజిక్ తో కూడిన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను చూడవచ్చు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

క్లాజ్

నిజానికి ఈ 'క్లాజ్' అనేది ఒక యానిమేషన్ సినిమా. యానిమేషన్ అనగానే చిన్నపిల్లలు చూసే సినిమా కదా అనే ఆలోచన మైండ్ లోకి వస్తుంది. కానీ ఇటీవల కాలంలో తెరకెక్కుతున్న అద్భుతమైన యానిమేటెడ్ సినిమాలు చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా చూడొచ్చు అన్న విధంగా ఉంటున్నాయి. పైగా అందులో ఉండే సోషల్ మెసేజ్ మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఇక ఈ 'క్లాజ్' అనే యానిమేషన్ మూవీలో ఫ్రెండ్షిప్ వ్యాల్యూ ను అద్భుతంగా చూపించారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను చూసి మీ క్రిస్మస్ ని మరింత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి.

ఏలియన్ క్రిస్మస్

క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది శాంటా క్లాజ్, ప్రార్థనలు, దేవుడు. అయితే ఈసారి క్రిస్మస్ ని ఈ గ్రహాంతరవాసుల స్టోరీతో సెలబ్రేట్ చేసుకోండి. ఈ సినిమాలో ఒక ఏలియన్ క్రిస్మస్ గురించి తెలుసుకుంటాడు. 'ఏలియన్ క్రిస్మస్' మూవీ ఫన్నీగా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ సినిమాను చూసి క్రిస్మస్ రోజు సరదాగా ఎంజాయ్ చేయండి.

ఏ బాయ్ కాల్డ్ క్రిస్మస్

అసలు క్రిస్మస్ ఎలా మొదలైంది ? అని పరిశోధించే ఒక యువకుడి కథ ఇది. ఇదొక మ్యాజికల్ అడ్వెంచర్ మూవీ. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Also Read : క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇండియాలో బెస్ట్ ప్లేస్‌లు ఇవే

ఫాలింగ్ ఫర్ క్రిస్మస్

ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. మీ పార్ట్నర్ తో కలిసి క్రిస్మస్ రోజు సినిమా చూడాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫ్యామిలీ స్విచ్

కుటుంబంతో కలిసి సినిమా చూసి కడుపుబ్బా నవ్వాలి అనుకునే వారి కోసమే ఈ మూవీ. ఇందులో లైఫ్ లెసన్ ను మంచి స్టోరీతో చెప్పారు. ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఇక ఈ క్రిస్మస్ ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ సినిమాలతో మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోండి.

Read Also : Bachhala Malli Review - 'బచ్చల మల్లి' రివ్యూ: హీరోకి యూనిక్ క్యారెక్టర్ ఒక్కటే చాలా... సినిమాకు కథ, ఎమోషన్స్ అవసరం లేదా?