Beauty tech hub in Hyderabad: ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ, హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ ప్రకటన

2 months ago 10
ARTICLE AD
<p>ప్రపంచంలోనే తొలి బ్యూటీ&ndash;టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L'Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్​లో &nbsp;ప్రారంభించనుంది.&nbsp;దావోస్ లో &nbsp;వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ &ndash;2026లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి &nbsp;లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో లో &nbsp;హైదరాబాద్&zwnj;లో భారీ పెట్టుబడులతో బ్యూటీ&ndash;టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో &nbsp;లోరియల్&zwnj;కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది.&nbsp;</p> <p>డిజిటల్ ట్రాన్స్&zwnj;ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని హియెరోనిమస్ తెలిపారు. దీంతో గ్లోబల్ ఎంటర్&zwnj;ప్రైజ్ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రాముఖ్యత మరింత పెరుగనుంది.&nbsp;నవంబర్&zwnj;లో జీసీసీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లను లోరియల్ ఆహ్వానించింది.&nbsp;</p> <p>ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. &nbsp;లోరియల్ జీసీసీని హైదరాబాద్&zwnj;కు తీసుకురావాలన్న ఆలోచనపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఆసక్తి చూపారని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.&nbsp;హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన &nbsp;ప్రదేశమని &nbsp;చెప్పారు. &nbsp;మెడ్&zwnj;టెక్&zwnj;, హెల్త్&zwnj;టెక్&zwnj; మాత్రమే కాకుండా బ్యూటీ&ndash;టెక్&zwnj; వంటి కొత్త విభాగాల్లోనూ తెలంగాణ ముందుంటోందని మంత్రి అన్నారు. ఇప్పటికే మారియెట్, వ్యాన్ గార్డ్, నెట్ ఫ్లిక్స్, మెక్ డోనాల్డ్స్, హినెకెన్ , జాగర్ , కోస్ట్కో &nbsp;వంటి గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్&zwnj;లో జీసీసీలను ఏర్పాటు చేశాయన్నారు.&nbsp;</p> <p>తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH) గురించి &nbsp;ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వివరించింది. జీసీసీతో పాటు మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని లోరియల్ను ఆహ్వానించారు. &nbsp;రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమల ఎకోసిస్టమ్&zwnj;ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తయారీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హియెరోనిమస్ సానుకూలంగా స్పందించారు</p>
Read Entire Article