Beauty Rituals : మేకప్ లేకుండానే మెరిసే అందం.. అరబ్ మహిళలు ఫాలో అయ్యే స్కిన్ & హెయిర్ టిప్స్
3 months ago 8
ARTICLE AD
Arab Women’s Beauty Secrets : మెరిసే చర్మం, అందమైన జుట్టు కావాలని అందరూ అనుకుంటారు. అలా చూస్తే ఈ విషయాల్లో అరబ్ మహిళలు ఓ బార్ సెట్ చేసేశారు. వారి స్కిన్ ఎప్పుడూ మెరుస్తూ.. జుట్టు సిల్కీగా, పొడుగ్గా, హెల్తీగా ఉంటుంది. స్ట్రాంగ్ హెయిర్, మెరిసే చర్మంకోసం వారు రోజూవారీ లైఫ్లో కొన్ని టిప్స్ ఫాలో అవుతారు. కేవలం మేకప్​ పైనే ఆధారపడకుండా.. సాంప్రదాయంగా కొన్ని పద్ధతులు అనుసరిస్తారు. అవేంటో చూసేద్దాం.
జుట్టుకు కేఫీర్
హెన్నా
కెమికల్ హెయిర్ డైకి బదులుగా హెన్నాను ఉపయోగించడం అనేది ఇక్కడ అనాది కాలంగా వస్తోన్న సంప్రదాయం. ముదురు రంగు కోసం హెన్నాకు బాస్మాను కలుపుతారు. జుట్టును బలోపేతం చేయడానికి రంగులేని హెన్నాను కూడా ఉపయోగిస్తారు. ఇది కూడా జుట్టును మృదువుగా, స్ట్రాంగ్​గా చేస్తుంది.
కళ్లకోసం..
అరబ్ మహిళలు అందంలో భాగంగా కళ్ళకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. యాంటిమోనీని కంటికి ఉపయోగిస్తారు. ఇది కళ్లను పెద్దవిగా కనిపించేలా చేసి.. కంటి వెంట్రుకలను బలపరుస్తుంది.
కనుబొమ్మల కోసం
మందపాటి కనుబొమ్మలు, పొడవాటి కనురెప్పలు అందానికి ముఖ్యమైనవిగా భావిస్తారు. దీనిని కోసం ఉస్మా అనే సహజ నూనెను ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా దీనిని వాడటం వల్ల కనుబొమ్మలు, కనురెప్పల మందం పెరుగుతుంది.
రోజ్ వాటర్
రోజ్ వాటర్ రెగ్యులర్​గా ఉపయోగిస్తారు. ఇది చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ తొలగించి.. ఉపశమనం ఇస్తుంది. ఎరుపును తగ్గిస్తుంది. తేలికపాటిది కాబట్టి దీనిని రోజూ ఉపయోగించేందుకు ప్రాధాన్యత ఇస్తారు.
నిమ్మరసం..
సువాసన కోసం..
సువాసన విషయానికి వస్తే.. అరబ్ మహిళలు సహజ నూనెలను ఇష్టపడతారు. కస్తూరి, గంధపు చెక్క, గులాబీ, మల్లె వంటి నూనెలు దీర్ఘకాలిక సువాసనను కలిగి ఉంటాయి. ఆల్కహాల్ రహితంగా ఉండటం వల్ల వాటి సువాసన మరింత ప్రత్యేకంగా ఉంటుంది.
ఇవన్నీ వారిని అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. పైగా ఇవి ఒక్కరోజులో వచ్చే మార్పులు కాదు. రోజూ వీటిని ఫాలో అవుతూ ఉంటే.. ఫలితాలు మీరే చూడగలుగుతారు. అందంగా అంటే మేకప్​తో వచ్చేది కాదని.. లోపలి నుంచి దానిని కాపాడుకోవాలని దానికోసం ఎలాంటి పోషణ అవసరం అనే విషయాన్ని వీరు హైలెట్ చేస్తున్నారు.
Read Entire Article