BB 9: పాపం డిమోన్ పవన్ ఏమైపోతాడో..

5 hours ago 1
ARTICLE AD

అవును బిగ్ బాస్ హౌస్ లోకి పవర్ ఫుల్ కామనర్ గా అడుగుపట్టి టాస్క్ ల్లో మిగతా కంటెస్టెంట్స్ కు గట్టి పోటీ ఇచ్చి తానేమిటో ప్రూవ్ చేసుకున్న డిమోన్ పవన్ రీతూ చౌదరి మాయలో పడి ఆట మొత్తం నాశనం చేసుకున్నాడు. రీతూ, పవన్ ఇద్దరూ లవ్ ట్రాక్ వేసుకుంటే కొన్నాళ్ళు హౌస్ లో సర్వైవ్ అవ్వొచ్చని ప్లాన్ చేసుకుని మరీ ఫ్రెండ్ షిప్ చేసారు.

మధ్య మధ్యలో రీతూ తో గొడవ, కొన్నిసార్లు రీతూ ని అపార్ధం చేసుకుని గొడవ పడిన పవన్, వైల్డ్ కార్డ్స్ వచ్చాక రీతూ తో స్నేహం చెయ్యాలో వద్దో అనే కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడాడు. కానీ డిమోన్ పవన్ ని రీతూ బంకలా పట్టుకుంది. ఆమె వల్ల పవన్ ఆట కొన్నిసార్లు పోయినా.. పవన్ వల్ల రీతూ కూడా లాస్ అయ్యింది. ఆ విషయం పదే పదే హౌస్ మేట్స్ పవన్ కి చెబుతూ వచ్చారు. గత వారం సంజన పవన్-రీతులను పక్క పక్కన చూడలేకపోతున్నామంటూ చేసిన కామెంట్స్ వల్ల రీతూ హార్ట్ అయ్యింది. ఆ విషయంలో పవన్ స్టాండ్ తీసుకోకపోవడంపై నాగ్ ఫైర్ అయ్యారు. 

మరి ఇంత జరిగిన పవన్ ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేట్ అవడంతో ఇకపై రెండు వారాల పాటు తన ఆట మెరుగుపరుచుకుని టాప్ 5 కి వేళ్తాడో, లేదంటే రీతూ పై దిగులుతో సైలెంట్ గా ఉంటాడో అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఏది ఏమైనా పవన్ అయితే కప్ గెలిచే ఛాన్స్ ని కళ్యాణ్ చేతుల్లో ఎప్పుడో పెట్టేసాడు.  

Read Entire Article