Matchstick Trick to Eliminate Bathroom Smell : బాత్‌రూమ్‌ను రోజులో చాలాసార్లు ఎన్నో అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఉదయం బ్రష్ చేయడం నుంచి కాలకృత్యాలు తీర్చుకోవడంతో పాటు స్నానం వంటి అవసరాలకు వాష్రూమ్ ఉపయోగిస్తారు. దీనిని సరిగ్గా ఉంచుకోకపోతే బ్యాక్టీరియాలు పెరగడం, దుర్వాసన రావడం వంటివి జరుగుతాయి. కాబట్టి దానిని శుభ్రపరచడంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. బాత్రూమ్ పరిశుభ్రతను పట్టించుకోకపోతే.. చెడు వాసన రావడం ప్రారంభమవుతుంది. బ్యాక్టీరియా పెరుగుతుంది.

బ్యాక్టీరియాను ఈజీగా శుభ్రం చేయవచ్చు. కానీ వాసనను తొలగించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ముఖ్యంగా బాత్‌రూమ్‌కు టాయిలెట్ అటాచ్ చేసినప్పుడు. ఈ వాసన నుంచి బయటపడటానికి.. ఖరీదైన ఫ్రెషనర్‌లు లేదా రసాయన స్ప్రేలను ఉపయోగిస్తారు. కానీ ఈసారి మీరు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా సులభమైన ట్రిక్‌ ఫాలో అవ్వొచ్చు. దీనికోసం మ్యాచ్‌బాక్స్ ఉంటే చాలు. ఇంతకీ ఆ ట్రిక్ ఏంటో.. అగ్గిపెట్టేతో ఉపయోగం ఏంటో చూసేద్దాం.

మ్యాచ్‌బాక్స్‌తో బాత్‌రూమ్ వాసనను ఎలా పోతుందంటే..

ఈ మ్యాచ్బాక్స్ ట్రిక్ చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఇది మీకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఇది బాత్‌రూమ్ వాసనను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ట్రిక్‌ని ప్రయత్నించడానికి.. మీరు ఈ టిప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి.

ఈ ట్రిక్‌ను ఎలా ఉపయోగించాలంటే..

ముందుగా బాత్‌రూమ్‌లో వాసన వస్తున్న ప్రదేశాన్ని గుర్తించండి.

అప్పుడు ఒకటి లేదా రెండు మ్యాచ్‌స్టిక్‌లను వెలిగించండి.

ఇప్పుడు వెలిగించిన మ్యాచ్‌స్టిక్‌ను కొంతకాలం బాత్‌రూమ్‌లో ఉంచండి.

ఇలా చేయడం వల్ల వాసన తగ్గుతుంది. ఎక్కువ డబ్బు కూడా వృథా కాదు.

వాసన ఎక్కువగా వస్తే ఏమి చేయాలి?

దీని కోసం మీరు మ్యాచ్‌బాక్స్‌ను ఉపయోగించాలి. అలాగే దానిలో బొగ్గు పొడిని వేయండి. తద్వారా దానిని సులభంగా ఉపయోగించవచ్చు.

మెటీరియల్స్

ఖాళీ మ్యాచ్‌బాక్స్ - 1

బొగ్గు మాత్రలు - 5

ఏం చేయాలంటే..

ఈ పద్ధతి గాలిలో తేమ, వాసనను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. కాబట్టి ముందుగా ఖాళీ అగ్గిపెట్టే తీసుకోండి. దానిలో బొగ్గులను పొడి చేసి.. బాక్స్లో నింపండి. మ్యాచ్‌బాక్స్ పూర్తిగా పొడిగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు బాక్స్‌ను మూసివేసి.. సూది లేదా పిన్‌తో చిన్న రంధ్రాలు చేయండి. ఈ రంధ్రాల ద్వారా గాలి లోపలికి ప్రవేశించి శుభ్రంగా మారుతుంది.

అయితే ఇది కేవలం వెంటనే బ్యాడ్ స్మెల్ పోగొట్టడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. ఎక్కువకాలం ఫ్రెష్గా ఉండాలంటే వాష్రూమ్ శుభ్రంగా ఉంచుకోవాల్సిందే.