యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ (Attitude Star Chandrahas) కథానాయకుడిగా రూపొందిన కొత్త సినిమా 'బరాబర్ ప్రేమిస్తా' (Barabar Premistha Movie). సంపత్ రుద్ర దర్శకత్వం వహించారు. ఇందులో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించారు. అర్జున్ మహీ ('ఇష్టంగా' ఫేమ్) విలన్. ఇప్పటి వరకు విడుదలైన సినిమా పోస్టర్లు, పాటలు బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఫిబ్రవరి 6న 'బారాబర్ ప్రేమిస్తా'
Barabar Premistha Movie Release Date: 'బారాబర్ ప్రేమిస్తా' చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థల మీద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 6న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు.

Also Read: Sharwanand: నిర్మాత అనిల్ సుంకరకు శర్వానంద్ ప్రామిస్... ఇది బంపర్ ఆఫర్ అంటే!

చంద్రహాస్‌ మాట్లాడుతూ... ''ఈ ఫిబ్రవరి 6న 'బారాబర్ ప్రేమిస్తా'తో మేం విక్టరీ కొట్టబోతున్నాం. నాకు ఈ సినిమాపై నమ్మకం ఉంది. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి'' అని చెప్పారు. దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ... ''ఓ ఊరిలో అమ్మాయి, అబ్బాయి కొట్టుకుంటే ఎలా ఉంటుందనేది మా 'బారాబర్ ప్రేమిస్తా' సినిమా. స్వచ్ఛమైన తెలంగాణ నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా తీస్తున్న సినిమా. ఫిబ్రవరి 6న అందరూ చూడండి'' అని అన్నారు.

Also Read: Anil Ravipudi: పవన్ కళ్యాణ్‌తో సినిమా... క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

Barabar Premistha movie cast: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ జంటగా నటించిన 'బారాబర్ ప్రేమిస్తా'లో అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: సిసి క్రియేషన్స్ - ఎవిఆర్ మూవీ వండర్స్, నిర్మాతలు: గెడా చందు - గాయత్రి చిన్ని - ఎవిఆర్, దర్శకుడు: సంపత్ రుద్ర, స్క్రీన్ ప్లే: సంపత్ రుద్ర - ఎంఏ తిరుపతి, కథ: ఎంఏ తిరుపతి, మాటలు: రమేష్ రాయ్, ఛాయాగ్రహణం: వైఆర్ శేఖర్, సంగీతం: ఆర్ఆర్ ద్రువన్, కూర్పు: బొంతల నాగేశ్వర రెడ్డి.

Also Read: Cheekatilo Review Telugu - 'చీకటిలో' రివ్యూ: Prime Videoలో క్రైమ్ థ్రిల్లర్ - శోభితా ధూళిపాళ నటించిన మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?