Bapatla Crime News: వాడరేవు బీచ్‌లో స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు, బాపట్ల జిల్లాలో విషాదం

1 month ago 2
ARTICLE AD
<p>చీరాల: బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చీరాల మండలం వాడరేవు బీచ్ లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్ర స్నానం కోసం వాడరేవు బీచ్&zwnj;కు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నీటిలో మునిగి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అనంతరం కొద్దిసేపటికి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయని తోటి విద్యార్థులు తెలిపారు. ఆ ముగ్గురు తెలంగాణకు చెందిన వారని సమాచారం. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.</p> <p>అమరావతిలోని విట్ యూనివర్సిటికీ చెందిన కొందరు విద్యార్థులు సెలవు రోజు కావడంతో బీచ్&zwnj;లో సరదాగా గడిపేందుకు వాడరేవు బీచ్&zwnj;కు వెళ్లారు. వారిలో సాత్విక్&zwnj;, సోమేష్, సాకేత్, మణిదీప్, గౌతమ్ అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. గల్లంతైన కాసేపటికి సాకేత్, సాత్విక్&zwnj;&zwnj;, మణిదీప్&zwnj;ల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. సోమేష్, గౌతమ్&zwnj;ల ఆచూకీ కోసం వాడరేవు బీచులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.</p>
Read Entire Article