ప్రముఖ కథానాయకుడు, ఏపీలోని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎడమ మోకాలికి గాయం అయ్యింది. కాకినాడ పోర్టులో NBK111 సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్న సమయంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యకు ఇంజ్యూరీ అయ్యింది. హుటాహుటిన దగ్గరలోని ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్ళి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ సిటీకి ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ హెల్త్ బులిటిన్ రిలీజ్ చేశారు ఏఐజీ డాక్టర్లు.

అసలు బాలకృష్ణకు ఏమైంది?
What Happened To Balakrishna On NBK111 Sets?: ఎన్‌బీకే111 సెట్స్‌లో హీరో బాలయ్యకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డ కట్టడంతో పాటు కండరాలు కాస్త వాచినట్టు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఎడమ మోకాలి భాగంలో మజిల్ టేర్ అని వైద్యులు తెలిపారు.

ఏఐజీ ఆస్పత్రిలో ఏం చేస్తున్నారు?
ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో బాలకృష్ణకు చికిత్స అందుతోంది. ఆయనకు క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Also Read: నిహారిక ప్రేమలో పడిందన్నారు... ఫోటోలు వైరల్ చేశారు... అసలు కహానీ ఏమిటంటే?

ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాలయ్య మెడికల్ హిస్టరీని దృష్టిలో ఉంచుకుని సురక్షితమైన చికిత్స అందించేందుకు వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందాన్ని నియమించారు. సునిశిత నిపుణులైన వైద్య బృందం బాలయ్య ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది.

Also Read: Nandamuri Deepika - ఎవరీ నందమూరి దీపిక? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు... ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా?

వైద్యుల నిరంతర పర్యవేక్షణలో నందమూరి బాలకృష్ణ ఉన్నట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న టెస్టులు పూర్తి అయ్యాక ట్రీట్మెంట్ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. బాలయ్యకు సర్జరీ పడుతుందని తెలిసింది. ఏఐజీ ఆస్పత్రిలో సర్జరీ చేయనున్నట్లు సమాచారం. బాలకృష్ణ ఆరోగ్యానికి సంబంధించిన తదుపరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Also Read: Jabardasth Latest Episode July 26th Promo - 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది