Nandamuri Balakrishna Gopichand Malineni Movie NBK111 To Launch Soon: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా 'వీరసింహారెడ్డి'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కానుంది. బాలయ్య కోసం మరో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను గోపీచంద్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ట్రాక్ ఎక్కేది ఎప్పుడంటే?

ఈ మూవీని 'NBK111' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనుండగా దసరా సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో 'పెద్ది' మూవీ తెరకెక్కిస్తోన్న ప్రముఖ ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. బాలయ్య గ్రేస్‌కు తగ్గట్లుగా హిస్టరీ, గతంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను గోపీచంద్ సిద్ధం చేశారట.

సూపర్ హిట్ కాంబో కావడంతో ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఉగ్ర రూపంలో ఉన్న సింహం ఓ వైపు... పవర్ ఫుల్ కవచం మరోవైపు ఉండేలా గాడ్ ఆఫ్ మాసెస్ సింహ గర్జన కనిపించేలా ఉన్న పోస్టర్ వేరే లెవల్. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఓ పవర్ ఫుల్ రోల్‌లో బాలయ్య కనిపించనున్నారట. త్వరలోనే ఇతర నటీనటులు, మిగిలిన అప్డేట్స్ ఇవ్వనున్నారు.

Also Read: కిష్కింధపురి కలెక్షన్లు... బెల్లంకొండ మేజిక్ వర్కవుట్ అవ్వలేదా? ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?

'అఖండ 2' తర్వాతే

ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2'తో బిజీగా ఉన్నారు. ఆ మూవీ పనులు పూర్తైన వెంటనే ఈ మూవీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో 'అఖండ'కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ నెల 25న మూవీ రిలీజ్ అవుతుందని అంతా భావించినా వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో మూవీ విడుదలవుతుందని బాలయ్య ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. డిసెంబర్ 5 శుక్రవారం కావడంతో ఆ రోజే రిలీజ్ కావొచ్చని అంతా భావిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు.