బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'. అది తన పరువుకు భంగం కలిగించేలా ఉందని సమీర్ వాఖండే కోర్టుకు వెళ్లారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) పేరు ఓ డ్రగ్స్ కేసులో ముడిపడిన సంగతి తెలిసిందే. దాంతో ఐఆర్ఎస్ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede) పాపులర్ అయ్యారు. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. అయితే... నెట్‌ఫ్లిక్స్ కోసం 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్ చేశారు ఆర్యన్ ఖాన్. దానికి ఆయన దర్శకుడు. అందులో తన పరువు నష్టం కలిగించారని ఆరోపిస్తూ సమీర్ వాఖండే ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ దావాను విచారించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కోర్టుకు ఫిర్యాదును విచారించే అధికారం లేదని తెలిపింది.

పురుషేంద్ర కౌరవ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ సమీర్ వాఖండే దాఖలు చేసిన దావా / కేసును విచారించడానికి నిరాకరిస్తూ... సరైన అధికారం కలిగిన కోర్టుకు పంపాలని ఆదేశించింది. నెట్‌ఫ్లిక్స్‌ వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'లో తనపై కావాలని తప్పుడు, అవమానకరమైన విషయాలు చూపించారని సమీర్ వాంఖడే ఆరోపించారు. ఆ వెబ్ సిరీస్ తన వ్యక్తిగత ప్రతిష్టకు, గౌరవానికి నష్టం కలిగించడమే కాకుండా తన కుటుంబంపై కూడా ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. ఆ సిరీస్‌లో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ఇమేజ్‌ను నెగెటివ్ గా చూపించారని, దీని వల్ల ప్రజలకు చట్టం, ప్రభుత్వ సంస్థలపై నమ్మకం తగ్గిందని ఆయన అన్నారు.

'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్ బ్యాన్ చేస్తూ శాశ్వత ఉత్తర్వులు, పరిహారం ఇవ్వాలని సమీర్ వాంఖడే కోర్టును కోరారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్, ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్ కార్ప్), గూగుల్, ఫేస్‌బుక్, సంబంధిత సంస్థలపై కేసు దాఖలు చేశారు.

Also Read: Salaar 2: 'రాజా సాబ్' ఫ్లాప్ తర్వాత 'సలార్ 2' పక్కన పెట్టేశారా? ప్రభాస్ నిర్మాతల రియాక్షన్ ఏమిటంటే?

సమీర్ వాంఖడే, ఆర్యన్ ఖాన్ కేసు విషయానికి వస్తే... ఇంకా బాంబే హైకోర్టు, ప్రత్యేక NDPS కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఫిర్యాదులో సిరీస్‌లోని ఒక సన్నివేశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇందులో ఒక పాత్ర 'సత్యమేవ జయతే' అని చెప్పి వెంటనే అసభ్యకరమైన సంజ్ఞ చేస్తుంది. సమీర్ వాఖండే ప్రకారం... అది తనకు మాత్రమే అవమానకరం కాదని, జాతీయ చిహ్నం, నినాదానికి కూడా అవమానం అని చెప్పారు. ఆ విధం చేయడం భారతీయ చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు.

Also Read: AK47 Movie: మెట్రో ఎక్కిన వెంకటేష్... త్రివిక్రమ్ కోసం పరేడ్ గ్రౌండ్ స్టేషన్‌లో 'ఏకే 47'

సమీర్ వాంఖడే కోర్టును 2 కోట్ల రూపాయల పరిహారం కూడా కోరారు. ఈ మొత్తాన్ని టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌లో క్యాన్సర్ రోగుల చికిత్స కోసం అందజేస్తామని ఆయన తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఢిల్లీ హైకోర్టు... డిసెంబర్ 2, 2025న తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు ఈ కేసును సరైన కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం తర్వాత ఈ కేసు తదుపరి చట్టపరమైన ప్రక్రియ కోసం సంబంధిత కోర్టుకు వెళుతుంది.

Also Read: Om Shanti Shanti Shantihi Twitter Review - 'ఓం శాంతి శాంతి శాంతిః' ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్ టాకేంటి? తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా సినిమా హిట్టేనా?