Rajamouli's Baahubali The Epic First Day Collection : 'మాహిష్మతి ఊపిరి పీల్చుకో... బాహుబలి వచ్చేస్తున్నాడు'... 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?'... 'అమరేంద్ర బాహుబలి అనే నేను...'... అదే మాహిష్మతి సామ్రాజ్యం... అందరికీ తెలిసిన కథే. ప్రేక్షకుల ముందుకు వచ్చి పదేళ్లు దాటింది. ఇన్నేళ్ల తర్వాత రెండు పార్టులను కలిపి ఒకే మూవీ 'బాహుబలి ది ఎపిక్'గా రిలీజ్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. అప్పట్లో వరల్డ్ వైడ్ రికార్డు కలెక్షన్స్ సాధించగా అప్పటికీ... ఇప్పటికీ... ఎప్పటికీ ఓ లెజెండ్ 'బాహుబలి' అనేలా మళ్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి.

ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

'బాహుబలి ది ఎపిక్' మూవీకి ఫస్ట్ డే రూ.10.4 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ తన రిపోర్ట్‌లో తెలిపింది. గురువారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడగా... ముందు రోజు రూ.1.15 కోట్లు... తొలి రోజు రూ.9.25 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఇక గ్రాస్ పరంగా రూ.18 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఇండియన్ సినిమా చరిత్రలో ఫస్ట్ డే ఈ రేంజ్‌లో ఏ మూవీ కూడా కలెక్షన్స్ సాధించలేదు.

ఇప్పటివరకూ ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీగా తమిళ స్టార్ విజయ్ మూవీ గిల్ రూ.10 కోట్లతో ఉంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ రూ.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కానీ ఇప్పుడు ప్రభాస్ మూవీ ఆ రికార్డులన్నింటినీ బీట్ చేసింది. ఇక రీసెంట్‌గా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కొత్త లోక (రూ.2.71 కోట్లు) డ్రాగన్ (రూ.6.5 కోట్లు)లను కూడా అధిగమించింది. ఇక వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read : సైన్స్ వర్సెస్ శాస్త్రం - ఊరి వెనుక భయానక స్టోరీ... 'శంబాల' ట్రైలర్ చూశారా?