Rajamouli's Baahubali The Epic Day 1 Worldwide Box Office Collections : తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'బాహుబలి' రెండు పార్టులు కలిపి 'బాహుబలి ది ఎపిక్' గురువారం సాయంత్రం ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే థియేటరల్లో డార్లింగ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. పదేళ్ల తర్వాతైనా 'బాహుబలి' క్రేజ్ ఏమాత్రం తగ్గలేేదని తెలుస్తుండగా... ఫుల్ ఆక్యుపెన్సీతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

'బాహుబలి ది ఎపిక్' వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్లతో కలిపి రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఇండియావ్యాప్తంగా అన్నీ భాషల్లో కలిపి రూ.2.13 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ప్రముఖ సాక్నిల్క్ రిపోర్ట్ వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే థియేటర్ ఆక్యుపెన్సీ 53.02 శాతం ఉన్నట్లు తెలిపింది. అటు, ఓవర్సీస్‌లోనూ కలెక్షన్స్‌లో అదరగొడుతున్నట్లు తెలుస్తోంది. 2015లో వచ్చిన ఫస్ట్ పార్ట్ 'బాహుబలి: ది బిగినింగ్' వరల్డ్ వైడ్‌గా రూ.650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించగా... రెండో పార్ట్ 'బాహుబలి: ది కంక్లూజన్' రూ.1600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇన్నేళ్ల తర్వాత కూడా రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వస్తుండడంపై మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది.

Also Read : 'బాహుబలి' vs 'మాస్ జాతర'... రవితేజపై రాజమౌళి దెబ్బ - బుకింగ్స్, క్రేజ్ కంపేర్ చేస్తే?