CBI investigation in Ayesha Meera murder case: 2007లో విజయవాడలో జరిగిన బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని సీబీఐ కోర్టు అయేషా తల్లిదండ్రులు బాషా, సంషేద బేగంకు నోటీసులు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో సత్యంబాబుపై నమోదు చేయాలనుకుంటున్న రెండు సెక్షన్లు అత్యాచారం, హత్య నేరాలకు చెందినవే. అంటే సీబీఐ దర్యాప్తులోనూ అన్ని ఆధారాలు.. సత్యంబాబు నేరం చేసినట్లుగా నిరూపించేలా బయటడ్డాయన్న అభిప్రాయం న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం... సెక్షన్ 302 (హత్య) కేసు. హత్య చేసినవారికి మరణశిక్ష (డెత్ పెనాల్టీ) లేదా జీవిత కాలం ఖైదు (లైఫ్ ఇంప్రిజన్‌మెంట్), అలాగే జరిమానా విధించవచ్చు. ఇది అతి తీవ్రమైన నేరం, కోర్టు ఆధారాల ఆధారంగా శిక్ష నిర్ణయిస్తుంది. సెక్షన్ 376 ( అత్యాచారం). కనీసం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష (రిగరస్ ఇంప్రిజన్‌మెంట్), ఇది జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చు, జరిమానా కూడా విధిస్తారు. ఒకవేళ అత్యాచారంవల్ల మరణం లేదా శాశ్వత కోమా (పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్) జరిగితే, శిక్ష జీవిత ఖైదు లేదా మరణశిక్షగా మారవచ్చు. ఈ కేసులో రేప్-మర్డర్ కాంబినేషన్ కాబట్టి, శిక్షలు మరింత కఠినంగా (డబుల్ లైఫ్ లేదా డెత్) ఉండవచ్చు.

2007 డిసెంబర్ 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో 17-19 ఏళ్ల ఆయేషా మీరాని అత్యాచారం చేసి హత్య చేశారు. పిడతల సత్యంబాబును నిందితుడిగా గుర్తించి 2010లో కోర్టు జీవిత కైదు విధించారు. కానీ 2017లో హైకోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. 2018లో హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి కేసు అప్పగించారు.

2018 నుంచి 7 ఏళ్ల పాటు దర్యాప్తు చేసిన సీబీఐ, జూన్ 2025లో తుది నివేదికను హైకోర్టు సూచనలతో విజయవాడ సీబీఐ స్పెషల్ కోర్టుకు సమర్పించింది. 260 మంది సాక్షుల్ని ను విచారించారు. సత్యంబాబు స్వగ్రామం లో అతన్ని ప్రశ్నించారు. ఆయేషా మృతదేహాన్ని ఖననం చేసి రీ-పోస్ట్ మార్టం, డీఎన్‌ఏ టెస్టులు చేశారు. మొదటి దర్యాప్తులో ఆధారాల ట్యాంపరింగ్ పై 50 పోలీసులు, సాక్షులను ప్రశ్నించారు.

సీబీఐ నివేదికలో అసలు దోషులు ఎవరు అన్నది నివేదిక ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.కోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించారు. అయితే కోర్టు తాజాగా సత్యంబాబు పై సెక్షన్లు 376, 302 కింద అభియోగాలు (FIR) నమోదు చేయాలని సీబీఐ సూచించినట్టు, దానికి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోర్టు అడిగింది. తల్లిదండ్రులు సెప్టెంబర్ 19న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అప్పుడే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.