తెలుగు ప్రేక్షకులకూ బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ తెలుసు. శ్రీ విష్ణు 'ఓం భీమ్ బుష్', శర్వానంద్ 'మనమే' సినిమాల్లో నటించింది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో స్పెషల్ సాంగ్ చేసింది. అయితే... బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ధురంధర్'లో సాంగ్ ఆమెకు నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్'లో సాంగ్స్‌ అన్నీ హిట్. అయితే... స్పెషల్ సాంగ్ 'షరారత్'కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ పాటలో ఆయేషా ఖాన్ డ్యాన్స్‌ చేసింది.

'ధురంధర్'లోని 'షరారత్' పాటలో అయేషా ఖాన్‌తో పాటు క్రిస్టల్ డిసౌజా కూడా స్టెప్పులు వేశారు. అయితే... క్రిస్టల్ కంటే ఆయేషా ఖాన్ ఎక్కువ హైలైట్ అయ్యింది. జస్లీన్ స్కాండల్, మధుబంతి బాగ్చి పాడిన ఆ పాట... చార్ట్ బస్టర్స్‌లో టాప్‌లో నిలిచింది. ఇప్పుడు అయేషా ఖాన్ ఆ పాట గురించి మాట్లాడింది. అది చేసేటప్పుడు ఎందుకు ఏడ్చిందో చెప్పింది.

పీరియడ్స్‌లో 'షరారత్' షూట్ చేశా - అయేషా ఖాన్

బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయేషా ఖాన్ మాట్లాడుతూ... ''మేం 'షరారత్' కోసం రెండు రోజులు షూటింగ్ చేశాం. అప్పుడు చాలా బిజీ షెడ్యూల్. నాకు పీరియడ్స్ వచ్చాయి. ఆ సమయంలో పెయిన్ ఉంటుంది. మన బెస్ట్‌ ఇవ్వలేం. కష్టంగా అనిపించినా ఛాన్స్‌ మిస్ చేసుకోకూడదని సాంగ్ చేశా. ఆ టైంలో సెట్‌లో ఎలా ఉందని ఎవరైనా అడిగితే... అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇంకా చెప్పాలంటే... సెట్‌లో ఎవరున్నారో కూడా నాకు తెలియదు. సాంగ్‌లో నా షూట్ అయ్యాక, నా వర్క్ ఫినిష్ చేసి పక్కకు వచ్చేసేదాన్ని'' అని చెప్పారు.

Also Read: Saturday Box Office: లక్షల్లో పడిన కొత్త సినిమాల కలెక్షన్లు... బాక్సాఫీస్‌లో శనివారమూ చిరంజీవి MSVPGయే టాప్ - గుణశేఖర్ 'యుఫోరియా' పరిస్థితి ఏంటి?

ఆయేషా ఖాన్ ఇంకా మాట్లాడుతూ... ''అప్పుడు గౌరవ్ సర్ కూడా సెట్‌లో ఉన్నానని చెప్పారు. నేను 'మీరు కూడా ఉన్నారా?' అని ఆశ్చర్యపోయా. ఎందుకంటే... నాకు, క్రిస్టల్‌కి టైం లేదు. మేం చాలా అలసిపోయాం. అంత డాన్స్ చేసిన తర్వాత నొప్పి వచ్చేది. పైగా, నాకు పీరియడ్స్... దాంతో ఎమోషనల్‌ అయ్యేదాన్ని. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఏడ్చాను... ఆనందంతో ఏడ్చా. అంత నొప్పిలోనూ సాంగ్ చేసినందుకు. అవి ఆనంద భాష్పాలు'' అని చెప్పింది.

Also Read: Govinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

'షరారత్' సాంగ్‌లో తనతో పాటు డ్యాన్స్‌ చేసిన క్రిస్టల్ గురించి అయేషా ఖాన్ మాట్లాడుతూ... ''నేను, క్రిస్టల్ కలిసి ఎంజాయ్ చేశాం. ఆమె నాకంటే సీనియర్. బోలెడు వర్క్ చేసింది. మేం కలిసి సాంగ్ చేస్తున్నామని తెలిసినప్పుడు... తను సీనియర్ కదా, తనకు అహంకారం ఉంటుందని అనుకున్నాను. కానీ, క్రిస్టల్ చాలా మంచిది'' అని చెప్పింది.

Also Read: Parasakthi Review Telugu - పరాశక్తి రివ్యూ: జీ5 ఓటీటీలో శివకార్తికేయన్ సినిమా... తెలుగు ప్రేక్షకులకు ఈ తమిళ సినిమా నచ్చుతుందా?