Asia Cup Trophy : ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది, ఆ తర్వాత టీం ఇండియాకు ట్రోఫీ ప్రదానం చేయాల్సి ఉంది. ఇంత వరకు అది జరగలేదు. ఆ ఘటన జరిగి దాదాపు రెండు రోజులు అయింది, కానీ ఇప్పుడు ఆసియా కప్ ట్రోఫీ ఎక్కడ ఉంది, అది భారతదేశానికి ఎలా వస్తుంది? ట్రోఫీ తీసుకెళ్లిన పాకిస్తాన్ మంత్రి నఖ్వీ ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (ACC Chairman Mohsin Naqvi) ఆసియా కప్ ట్రోఫీని తనతో తీసుకెళ్లిపోయి క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు.ఫైనల్ గెలిచిన తర్వాత మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి టీమ్ ఇండియా నిరాకరించింది, ఆ తర్వాత ఆయన ట్రోఫీతో హోటల్‌కు వెళ్ళిపోయారు. నఖ్వి పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రి కూడా, ఇప్పుడు అతను పతకాలు, ట్రోఫీ తిరిగి ఇచ్చే విషయంపై స్పందించారు. విచిత్రమైన షరతు పెట్టారు.

క్రికెట్‌బజ్ ప్రకారం, మొహ్సిన్ నఖ్వీ టోర్నమెంట్ నిర్వాహకులతో మాట్లాడుతూ, టీమ్ ఇండియా తమ ట్రోఫీ, పతకాలను తీసుకోవచ్చని, అయితే ఇది ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడే సాధ్యమవుతుందని, అందులో అతను స్వయంగా భారత జట్టుకు పతకాలు, ట్రోఫీలను బహుకరిస్తానని చెప్పారు. భారత్, పాకిస్థాన్ మధ్య చెడిన సంబంధాల కారణంగా, అలాంటి కార్యక్రమం జరిగే అవకాశం దాదాపు లేదు.

ఆసియా కప్ ఫైనల్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా చాలాసేపు మైదానంలోనే కూర్చుంది. గంటన్నర పాటు ఎదురుచూడాల్సి వచ్చింది, చివరకు ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తన పట్టుదలతో ఆసియా కప్ ట్రోఫీని తీసుకుని మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయారు.

BCCI కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేశారు

ఇటీవల న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ BCCI కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మొహ్సిన్ నఖ్వీ పతకాలు, ట్రోఫీలను తనతో తీసుకెళ్ళడానికి ఎటువంటి అధికారం లేదని అన్నారు.

దేవ్‌జిత్ సైకియా మాట్లాడుతూ,"పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రి అయిన ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి మా జట్టు నిరాకరించింది. అందుకే మేము అతని చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోము. అంటే అతను ట్రోఫీస పతకాలను తనతో తీసుకెళ్తాడని కాదు. ఇది చాలా దురదృష్టకరం, క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసేది."

ఆసియా కప్ ట్రోఫీ ఇప్పుడు ఎక్కడ ఉంది?

ఆసియా కప్ ఫైనల్ తర్వాత, మొహ్సిన్ నఖ్వీ తనతోపాటు ఆసియా కప్ ట్రోఫీని తీసుకెళ్లారు. అది ఇప్పటికీ ఆయన వద్దనే ఉంది. ఇప్పుడు ఆయన విధించే షరతులకు భారత్ అంగీకరించే అవకాశం లేనందున ఈ వివాదం మరికొన్ని రోజులు కొనసాగబోతోందని స్పష్టమవుతుది.

ట్రోఫీ భారతదేశానికి ఎలా వస్తుంది?

ఆసియా కప్ ట్రోఫీ ఇప్పుడు భారతదేశానికి ఎలా తిరిగి వస్తుంది అంటే.. మోహ్సిన్ నఖ్వీ తన మొండితనాన్ని వదులుకుని, ఎటువంటి షరతులు లేకుండా భారత జట్టుకు ట్రోఫీ, పతకాలను అందజేస్తేనే. BCCI అధికారికంగా ACC, ICCకి ఫిర్యాదు చేస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవల మోహ్సిన్ నఖ్వీకి ట్రోఫీని ఉంచుకునే హక్కు లేదని పేర్కొన్నాడు. సైకియా కూడా దానిని హెచ్చరించాడు. అందుకే దీనిపై కచ్చితంగా ఐసీసీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.