Asia Cup 2025 :ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం ఎనిమిది దేశాలు తమ జట్లను ప్రకటించాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈసారి టీమ్ ఇండియా ఆసియా కప్ ఆడనుంది. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది, అయితే ఆసియా కప్‌కు ముందు టీమ్ ఇండియాలో ఉన్న ముగ్గురు ఆటగాళ్లు పెద్ద ఆందోళన కలిగిస్తున్నారు.

సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భారత్‌కు అనుకూలంగా ఉంది. సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 22 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడగా, 17 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో పరుగులు సాధించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ 22 మ్యాచ్‌ల్లో 26.57 సగటుతో 558 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా లేనప్పుడు, టీ20 ఇంటర్నేషనల్‌లో అతని గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 61 మ్యాచ్‌ల్లో 43.40 సగటుతో 2040 పరుగులు చేశాడు. కెప్టెన్సీకి ముందు సూర్య మూడు సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు సాధించాడు. టీ20లలో సూర్యకుమార్ యాదవ్ సగటు 43.40 నుంచి 26.57కి తగ్గింది. ఆసియా కప్‌లో జట్టు విజయం సాధించాలంటే సూర్య బ్యాట్‌తోనూ అద్భుతాలు చేయాల్సి ఉంటుంది.

రింకూ సింగ్ T20I గణాంకాలు

రింకూ సింగ్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 33 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 24 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది.. బ్యాటింగ్ చేస్తూ 11 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. రింకూ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇప్పటివరకు 42 సగటుతో 546 పరుగులు చేశాడు. కానీ రింకూ సింగ్ గత రెండు సిరీస్‌లలో పెద్దగా రాణించలేదు.

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రింకూకు రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది, అయితే రింకూ ఈ రెండు మ్యాచ్‌ల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రింకూ రెండు మ్యాచ్‌ల్లో 39 పరుగులు చేశాడు. రింకూ బ్యాట్‌తో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ (UP T20 League)లో పరుగులు చేశాడు, అయితే ఇప్పుడు ఆసియా కప్‌లో ఈ ఆటగాడి ఫామ్‌పై అందరి దృష్టి ఉంది.

సంజు శామ్సన్ కీలకం

సంజు శామ్సన్ కేరళ క్రికెట్ లీగ్ (KCL 2025)లో మంచి ఫామ్‌లో కనిపించాడు. సంజు టీ20లలో భారత్ తరపున ఓపెనింగ్ చేస్తున్నాడు, అయితే ఇప్పుడు ఆసియా కప్ కోసం టీ20 జట్టులోకి శుభ్‌మన్ గిల్ ఎంట్రీ ఇచ్చాడు. గిల్ ప్లేయింగ్ ఎలెవన్ లో భాగం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సంజు సామ్సన్ జట్టులో స్థానం సంపాదించడం కష్టం. కానీ శామ్సన్‌ను మిడిల్ ఆర్డర్‌లో జట్టులో చేర్చుకోవచ్చు.