Arvind Kejriwal: బీజేపీకి కేజ్రీవాల్ బంపరాఫర్- కేంద్రం ఆ ఒక్క పనిచేస్తే ఎన్నికల్లో పోటీ చేయనని హామీ

10 months ago 8
ARTICLE AD

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బంపరాఫర్ ఇచ్చారు. తన ఛాలెంజ్ స్వీకరించి, మాట నిలబెట్టుకుంటే తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ కేజ్రీవాల్ ఛాలెంజ్ చేశారు. ఎన్నికల ర్యాలీలో ఆదివారం నాడు పాల్గొన్న సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ మురికివాడల కూల్చివేతలపై నమోదైన అన్ని కేసులను ఎత్తివేసి, వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయనని కేంద్ర మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు.

ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఢిల్లీలోని అన్ని మురికివాడలను కూల్చివేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. న్యూఢిల్లీలోని షకూర్ బస్తీ ప్రాంతంలో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. మురికివాడల నివసించే వారి సంక్షేమం కంటే భూసేకరణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. మరో 30 రోజుల తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి, ఈ బీజేపీ నేతలు ఇప్పుడు వచ్చి మీ మురికివాడల్లో నిద్రపోతున్నారు. గత 10 ఏళ్లలో ఈ పని ఎందుకు చేయలేదో ప్రజలు అర్థం చేసుకోవాలి. కేవలం ఎన్నికల సమయంలో మురికివాడల్లోని ప్రజలు బీజేపీ నేతలకు గుర్తొ్స్తారని’ ఎద్దేవా చేశారు.

ఢిల్లీ మురికివాడల్లోని ప్రజలను బీజేపీ ప్రేమించడం లేదని, కానీ ఈ ప్రాంతంపై మాత్రం ఇష్టం పెంచుకుంటుంది. బీజేపీకి మొదటగా మీ ఓట్లు కావాలి. ఎన్నికల తరువాత మీరు నివాసం ఉంటున్న స్థలాలు వారి స్వాధీనం కావాలి. ఇదే వారి అసలు ప్లాన్. బీజేపీ ప్రచారం చేసుకుంటున్న 'జహాన్ జుగ్గీ వాహన్ మకాన్' పథకం కేవలం  కంటితుడుపు చర్య.

గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం 4,700 ఫ్లాట్లను నిర్మించింది. కానీ బీజేపీ మురికివాడల్లోని వారి ఇండ్ల స్థలాలపై కన్నేసింది. మీరు కనుక వారికి ఓట్లు వేస్లే ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వస్తుంది. బీజేపీ జిత్తులను మీరు తిప్పికొట్టాల్సిన సమయం వచ్చింది. మురికివాడల్లోని నివాసాలను అక్రమంగా కూల్చివేసి, అక్కడ నివసించే వారిని ఇతర ప్రాంతాలకు వెల్లగొట్టేందుకు బీజేపీ వెనుకాడదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Read Entire Article