Arshdeep Sets Historic Milestone: భారత పేస్ గన్ అర్ష్‌దీప్ సింగ్, యువ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌ అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో అరుదైన రికార్డుల‌ను తమ‌ ఖాతాలో వేసుకున్నారు. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీయడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా తరఫున అత్యధిక టీ20 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2026 సంవత్సరంలో అర్ష్‌దీప్ వికెట్ల సంఖ్య ఏకంగా 38కి చేరింది. దీంతో 2022లో భువనేశ్వర్ కుమార్ నమోదు చేసిన 37 వికెట్ల ఆల్ టైమ్ రికార్డు తెరమరుగైంది. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 180 ప‌రుగులు చేసింది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ గ్లెన్ ఫిలిఫ్స్ ధ‌నాధ‌న్ ఫిఫ్టీ (43 బంతుల్లో 70, 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్ సింగ్ కు 2 వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ ను టీమిండియా.. 19.5 ఓవ‌ర్ల‌లో , 6 వికెట్ల‌కు 181 ప‌రుగులు చేసి, 4 వికెట్లతో గెలుపొందింది. తిల‌క్ వ‌ర్మ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (26 బంతుల్లో 51 నాటౌట్)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో మిచెల్ శాంట‌ర్న్ 4 వికెట్లతో స‌త్తా చాటాడు . సిరీస్ లో త‌ర్వాతి మ్యాచ్ వెల్లింగ్ట‌న్ వేదిక‌గా మంగ‌ళ‌వారం (ఈనెల 27న‌) జ‌రుగుతుంది.ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Milestone 🔓 3⃣8⃣ and counting! 👌 👌 @arshdeepsinghh now has the most T20I wickets for a #TeamIndia cricketer (in Men's cricket) in a calendar year! 🙌 🙌 Updates ▶️ https://t.co/FZtUFIFWS2 #NZvIND https://t.co/J6HQa8JJp1

— BCCI (@BCCI) October 24, 2026

శుభారంభం అందించిన అర్ష‌దీప్..
రెండో ఓవర్లోనే టిమ్ సీఫెర్ట్ (7)ను అవుట్ చేసి అర్ష్‌దీప్ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ వెంటనే ప్రిన్స్ యాదవ్ వేసిన బంతికి ఫిన్ అలెన్ (16), భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ (6) వెనుదిరిగారు. దీంతో ఆరో ఓవర్ ముగిసేసరికి కివీస్ 41 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్ ఇన్నింగ్స్‌ను గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్ అద్భుతంగా నిలబెట్టారు. వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూనే క్రమంగా గేర్ మార్చి భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 69 బంతుల్లోనే 116 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఫిలిప్స్ కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, జాకబ్స్ 40 బంతుల్లో యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. ఫిలిప్స్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, జాకబ్స్ 46 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు సాధించి జట్టుకు పటిష్టమైన స్కోరును అందించారు.

👀🔥 Tikak Verma performing extraordinary level fielding today 🚨 ⨀ Took 2 crucial catches. ⨀ Tim Siefert catch and bowl by Arshdeep Singh. ⨀ Daryl Mitchell catch and bowl Bhuvaneshwar Kumar. Tilak verma you Beauty 😍 https://t.co/Pjr3pVWg12

— Cricket Virus (@Cricketvirus18) October 24, 2026

తిల‌క్ వ‌ర్మ అరుదైన రికార్డు..
ఇదే మ్యాచ్‌లో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ రికార్డు బ్యాట్‌తో కాకుండా ఫీల్డింగ్‌లో సాధించడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా తిలక్ వర్మ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలి మూడు ఓవర్లలోనే అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో టిమ్ సీఫెర్ట్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ క్యాచ్‌లను తిలక్ ఒడిసిపట్టుకున్నాడు. ఈ రెండు క్యాచ్‌లతో ఈ ఏడాది అతడి మొత్తం క్యాచ్‌ల సంఖ్య 26కు చేరింది. తద్వారా ఇండోనేషియాకు చెందిన డానిల్సన్ హావో పేరిట ఉన్న 25 క్యాచ్‌ల ప్రపంచ రికార్డును తిలక్ అధిగమించాడు. మరోవైపు, టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ శనివారం జరిగిన రెండో టీ20 పోరుతో భారత జట్టు తుది జ‌ట్టులోకి కాస్త గ్యాప్ త‌ర్వాత చోటు ద‌క్కించుకున్నాడు. అయితే నాలుగు ప‌రుగులే చేసి, నిరాశ ప‌ర్చాడు.