AP SEC Anil Chandra Punetha: ఎస్ఈసీ బిగ్ అప్‌డేట్ - 2 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీల్లో 72 వార్డుల్లో నామినేషన్ల గడువు పొడిగింపు !
1 week ago 2
ARTICLE AD
AP Local Body Polls Supreme Court:   ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్  అనిల్ చంద్ర పునేఠా  కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులు, క్షేత్రస్థాయి విచారణల ఆధారంగా.. వైఎస్సార్ కడప , తిరుపతి జిల్లాల పరిధిలోని నాలుగు స్థానిక సంస్థలకు చెందిన మొత్తం  72 వార్డుల్లో నామినేషన్ల గడువును పొడిగిస్తూ  ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో ప్రత్యర్థుల దౌర్జన్యాలు, అడ్డంకుల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు మళ్లీ అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ పక్కా వార్డుల వారీ జాబితాను విడుదల చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లాలోని కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11 వార్డులలో నామినేషన్ల దాఖలుకు పునరుద్ధరణ అవకాశం కల్పించారు. వార్డు నంబర్లు  6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55 లలో ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. అదేవిధంగా,  రాజంపేట మున్సిపాలిటీ లోని 11 వార్డులలో వార్డు నంబర్లు  6, 12, 13, 14, 17, 19, 23, 24, 25, 26, 27  నామినేషన్ల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 వార్డులలో నామినేషన్ల ప్రక్రియను మళ్లీ ప్రారంభించనున్నారు. ఆ వార్డుల వివరాలు  1, 2, 3, 4, 5, 6, 9, 11, 12, 13, 14, 19, 55, 56, 57, 59, 65,   66. క్షేత్రస్థాయి పరిశీలనలో వీడియో రికార్డింగ్స్, పోలీసు నివేదికలను ఆధారంగా చేసుకుని ఈ 18 వార్డులలో అభ్యర్థులను భౌతికంగా అడ్డుకున్నట్లు ఎస్ఈసీ నిర్ధారించింది. మొత్తంగా కడప  , రాజంపేట , మైదుకూరు  , తిరుపతి  కలిపి మొత్తం 72 వార్డుల్లో  నామినేషన్ల ప్రక్రియ పునరుద్ధరించారు.  నామినేషన్లు వేయబోయే అభ్యర్థులకు ఎస్ఈసీ కఠిన భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీల పర్యవేక్షణలో అభ్యర్థులకు పూర్తిస్థాయి పోలీస్ రక్షణ కల్పించి, ఏ ఒక్కరికీ ఎలాంటి అభ్యంతరం కలగకుండా నామినేషన్లు స్వీకరించాలని నిబంధనలు విధించారు.
Read Entire Article