<p>Anil Kumar Singhal as TTD EO: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు. ప్రస్తుతం ఉన్న శ్యామలరావును బదిలీ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంటీ కృష్ణ బాబును రోడ్స్, ట్రాన్స్ పోర్ట్, బిల్డింగ్ శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సౌరభ్ గౌర్ కు మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. టీటీడీ ఈవో స్థానం నుంచి బదిలీ అయిన శ్యామల రావును సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రవీణ్ కుమార్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. ముకేష్ కుమార్ మీనాను ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.</p>