<p>AP High Court reserved its verdict on the anticipatory bail of the police officers in the Jatwani case : ఏపీ హైకోర్టులో నటి జత్వానీ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పై విచారణ జరిగింది.ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిది. ఏ 2గా ఉన్న సీతారామాంజనజేయులు కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయలేదని ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. హీరోయిన్ జత్వానీని వేధించిన కేసులో.. కేసులు నమోదు కావడంతో ఇతర ఐపీఎస్‌లు, పోలీసులు ముందస్తు బెయిల్ కోసంకోర్టుకెళ్లారు. విచారణ పూర్తయ్యే వరకూ వారిని అరెస్టు చేయవద్దని కోర్టు చెప్పింది. తాజా విచారణ తర్వాత కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. </p>